ఉత్కంఠభరితంగా సాగిన ప్రపంచకప్ ఫైనల్‌లో తృటిలో కప్పు చేజార్చుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఆ సమయంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. మొక్కవోని దీక్షతో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లిన విలియమ్సన్ ధోనీ తర్వాత కెప్టెన్ కూల్‌గా ప్రశంసలు పొందుతున్నాడు.

తాజాగా ఈ లిస్ట్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా చేరాడు. నెమ్మదిగా ఉండటమే విలియమ్సన్‌కు ఆభరణమని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ ప్రదానం చేసే సమయంలోనూ తనకిదే మాట చెప్పానని ఆయన తెలిపారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ అతడు తన గుణాన్ని మర్చిపోయి ప్రవర్తించాడని పేర్కొన్నారు. కానీ దురదృష్టవశాత్తూ విలియమ్సన్ ప్రపంచకప్ గెలవలేకపోయాడని.. ఆ బాధను తన ముఖంపైన కనిపించకుండా అప్పుడు కూడా తన స్వభావాన్ని మరోసారి నిరూపించాడని సచిన్ తెలిపారు. ప్రపంచ క్రికెట్‌లో అందరి సారథుల్లో కాకుండా విలియమ్సన్ మ్యాచ్‌ను భిన్న కోణంలో చూస్తాడని సచిన్ ప్రశంసించాడు.