ప్రపంచకప్‌‌లో విజయం సాధించడం పట్ల ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆసక్తికర్ వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరిగా క్రిస్ వోక్స్ ఔటనప్పుడు ప్రపంచకప్‌ మళ్లీ చేజారిందని అనుకున్నామని తెలిపాడు.

అయితే సూపర్‌ ఓవర్‌లో గప్టిల్ ఓవర్‌త్రో కారణంగా తిరిగి జట్టు సభ్యుల్లో ఆశలు చిగురించాయని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు. సూపర్‌ ఓవర్‌లో బెన్‌స్టోక్స్, బట్లర్ బాగా ఆడారని అతను ప్రశంసించాడు.

ఫైనల్‌లో భాగంగా లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ చేసిన పరుగులు న్యూజిలాండ్‌ పరుగులతో సమానం కావడంతో అంపైర్లు సూపర్ ఓవర్ ఆడించారు. ఈ  సందర్భంగా  ఇంగ్లాండ్ క్రికెటర్లు బెన్‌స్టోక్స్, బట్లర్‌లు బ్యాటింగ్‌కు దిగారు.

బౌల్ట్ బౌలింగ్‌లో స్టోక్స్ ఆడిన బంతి డీప్ మిడ్‌వికెట్ మీదుగా వెళ్లింది. అతను రెండో పరుగుకు ప్రయత్నిస్తుండగా ఫీల్డింగ్ చేస్తున్న గప్టిల్ బంతిని వికెట్ల మీదకు వేశాడు. ఈ సమయంలో బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి  బౌండరీ చేరింది.

దీంతో ఇంగ్లాండ్‌కు మొత్తం ఆరు పరుగులు రావడం న్యూజిలాండ్ ఆశలపై నీళ్లు చల్లింది. సూపర్‌ఓవర్‌లోనూ ఇరు జట్లు చెరో 15 పరుగులు చేయడంతో మ్యాచ్ మళ్లీ టై అయ్యింది. దీంతో ఎక్కువ ఫోర్లు కొట్టిన ఇంగ్లాండ్‌ను విజేతగా ప్రకటించారు.