Asianet News TeluguAsianet News Telugu

చెత్త రూల్: విజేత నిర్ణయానికి పెట్టిన నిబంధనపై గంభీర్ ఫైర్

బౌండరీ కౌంట్ నిబంధనను హాస్యాస్పదంగా ఉందని గౌతమ్ గంభీర్ ఐసీసీపై విరుచుకుపడ్డాడు. అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ టై అయిన తర్వాత ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే గత నిబంధనను మార్చి బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడంపై గంభీర్‌ ఐసీసీ తీరును తప్పుపట్టారు. 

Don't understand how the game of such proportions
Author
New Delhi, First Published Jul 15, 2019, 10:15 AM IST

న్యూఢిల్లీ: సూపర్ ఓవర్ కూడా టై కావడంతో విజేతగా నిర్ణయించడానికి అత్యధిక బౌండరీలను కొలమానంగా తీసుకోవడంపై భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు గౌతం గంభీర్ తీవ్రంగా మండిపడ్డారు. అదో చెత్త నిబంధన అని ఆయన విరుచుకపడ్డారు. ఇరు జట్లను సంయుక్తంగా విజేతలుగా ప్రకటించకుండా బౌండరీలను లెక్క తీసి జయాపజయాలను నిర్ణియించే పద్ధతి సరైంది కాదని అన్నారు.  

లార్డ్స్ మైదానం వేదికగా ఆదివారం రోజున న్యూజిలాండ్‌తో అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్స్‌లో ఇంగ్లండ్ విజయం సాధించి ప్రపంచ కప్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు హెన్రీ నికోల్స్ 55, టామ్ లాథం 47 పరుగులు చేయడంతో 50 ఓవర్లలో 241 పరుగులు సాధించింది. 

242 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌ 241 పరుగులకు ఆలౌట్‌ కావడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. మ్యాచ్ టై అవడంతో మ్యాచ్ ఫలితాన్ని తేల్చడం కోసం ఐసీసీ సూపర్ ఓవర్ నిర్వహించింది. ఈ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది. అనంతరం 16 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ కూడా ఆరు బంతుల్లో 1 వికెట్ నష్టపోయి అదే 15 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ సైతం మళ్లీ టైగానే మిగిలింది. 

సూపర్‌ ఓవర్‌లోనూ స్కోర్లు ‘టై’ కావడంతో మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్‌ ను విజేతగా ప్రకటించారు. బౌండరీ కౌంట్ నిబంధనను హాస్యాస్పదంగా ఉందని గౌతమ్ గంభీర్ ఐసీసీపై విరుచుకుపడ్డాడు. అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ టై అయిన తర్వాత ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించే గత నిబంధనను మార్చి బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడంపై గంభీర్‌ ఐసీసీ తీరును తప్పుపట్టారు. 

ఈ తరహా విధానం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.  ఇదొక చెత్త రూల్‌ అంటూ మండిపడ్డాడు. మెగా ఫైట్‌లో కడవరకూ పోరాడిన ఇరు జట్లను గంభీర్‌ అభినందించాడు.

 

Follow Us:
Download App:
  • android
  • ios