ముంబై: ప్రపంచ కప్ టోర్నీకి అంబటి రాయుడు ఎంపిక చేయకపోవడాన్ని బిసిసిఐ మాజీ కార్యదర్శి సంజయ్ జగ్దాల్ సమర్థించారు. రాయుడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడం సరైన నిర్ణయమేనని ఆయన అన్నారు. 

అనేక అవకాశాలు ఇచ్చినా రాయుడు, దినేశ్‌కార్తిక్‌లు సద్వినియోగం చేసుకోలేకపోయారని జగ్దాల్ అన్నారు. రాయుడు, కార్తిక్‌లకు అనేక అవకాశాలు వచ్చినా నిరూపించుకోలేదని, వారి పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఆయన అన్నారు.సెలక్షన్‌ కమిటీ విజయ్‌శంకర్‌, అంబటిరాయుడు, దినేశ్‌కార్తిక్‌లను ఎంతో పరీక్షించిందని చెప్పారు. 

2003లో తాను సెలెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి కార్తిక్‌, రాయుడు ఆడుతున్నారని, కేవలం ఐపీఎల్‌ ప్రదర్శన ప్రామాణికంగా వారిని ఎంపిక చేయడం సరైంది కాదని ఆయన అన్నారు.

రిషబ్ పంత్‌కు తొలి జట్టులో అవకాశం కల్పించకపోవడంపై తాను ఆశ్చర్యపోయానని ఆయన అన్నారు. మనీష్‌పాండే, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి ఆటగాళ్లకు అవకాశం రాకపోవడం దురదృష్టకరమని, అందుకు తాను చింతిస్తున్నానని అన్నారు.