44 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్ జట్టు ప్రపంచకప్‌ను ముద్దాడింది.  వరుసగా రెండో సారి ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్ అనూహ్య పరిణామాల మధ్య కప్ పొందలేకపోయింది.

అయితే న్యూజిలాండ్ ఓటమి తర్వాత భారత జట్టు కూడా బహుశా నిరాశ చెంది ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రపంచకప్‌లో అతి తక్కువ పరాజయాలు చవిచూసిన జట్టు భారత్ మాత్రమే. జగజ్జేతగా ఆవిర్భవించిన ఇంగ్లాండ్ సైతం.. తాజా టోర్నమెంటులో మూడు పరాజయాలు చవిచూసింది.

లీగ్ దశలో ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఇండియా.. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ ఎనిమిది విజయాలు సాధించగా.. భారత్, ఆస్ట్రేలియా ఏడు విజయాలు, న్యూజిలాండ్ 6, పాక్ 5, శ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ 3, వెస్టిండీస్ 2 విజయాలు మాత్రమే నమోదు చేసింది. ఇక పసికూనగా బరిలోకి దిగిన అఫ్ఘనిస్తాన్ ఆడిన 9 మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైంది.