Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్: కివీస్ పేసర్ హెన్రీ అరుదైన ఘనత

తాజా ప్రపంచ కప్ టోర్నీలో హెన్రీ మొదటి పవర్‌ ప్లేలో 8 వికెట్లను తీశాడు. దాంతో ఈ మెగా టోర్నీలో పది ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు.  వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పోరులో భాగంగా జేసన్‌ రాయ్‌ వికెట్‌ను సాధించడం​ ద్వారా హెన్రీ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. 

World Cup 2019: Matt Henry creats record
Author
London, First Published Jul 14, 2019, 10:27 PM IST

లండన్‌: ప్రపంచ కప్ పోటీల్లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ మ్యాట్ హెన్రీ అరుదైన ఘనతను సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో తొలి పవర్‌ ప్లేలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అతను నిలిచాడు. 

తాజా ప్రపంచ కప్ టోర్నీలో హెన్రీ మొదటి పవర్‌ ప్లేలో 8 వికెట్లను తీశాడు. దాంతో ఈ మెగా టోర్నీలో పది ఓవర్లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు.  వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ పోరులో భాగంగా జేసన్‌ రాయ్‌ వికెట్‌ను సాధించడం​ ద్వారా హెన్రీ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. 

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా ఆరో ఓవర్‌ నాల్గో బంతికి రాయ్‌ను పెవిలియన్‌కు పంపాడు.  ఈ జాబితాలో కాట్రెల్‌(వెస్టిండీస్‌), జోఫ్రా ఆర్చర్‌( ఇంగ్లండ్‌), క్రిస్‌ వోక్స్‌( ఇంగ్లండ్‌)లు సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వీరు తలో ఏడు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ( ఇక్కడ చదవండి: కేన్‌ విలియమ్సన్‌ వరల్డ్‌ రికార్డు)

కివీస్‌ నిర్దేశించిన 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌ 28 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆరంభం నుంచి కివీస్‌ పేసర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డ రాయ్‌.. హెన్రీ బౌలింగులో అవుటయ్యాడు. ఆ తర్వాత జానీ బెయిర్‌ స్టోకు లైఫ్‌ లభించింది. బెయిర్‌ స్టో ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ను  గ్రాండ్‌ హోమ్‌ వదిలేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios