మూడో బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో గుప్తిల్ డైరెక్ట్ త్రోకు ధోనీ రన్నవుటయ్యాడు. ఈ ఔట్‌తోనే ప్రపంచకప్‌లో భారత్ పోరాటం ముగిసింది. అయితే బ్యాటింగ్‌తో ఆకట్టుకోని గుప్తిల్ ఈ ఒక్క రనౌట్‌తో హీరో అయ్యాడు.
మాంచెస్టర్: డైరెక్ట్ హిట్‌తో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని రన్నవుట్ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్ ట్వీట్టర్ లో ఆ విషయంపై స్పందించాడు. ధోనీని రన్నవుట్ చేయడం ద్వారా అతను భారత విజయావకశాలను దెబ్బ తీశాడు.
ధోని రనౌట్ కావడం తన అదృష్టమని గుప్తిల్ అన్నాడు. భారత్‌తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో గుప్టిల్ తన అద్భుత ఫీల్డింగ్‌తో ధోనిని పెవిలియన్‌ను చేర్చిన విషయం తెలిసిందే. విజయానికి 12 బంతుల్లో భారత్ 36 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోని ఓ భారీ సిక్స్ కొట్టి విజయంపై అశలను రేకెత్తించాడు.
ఆ తర్వాతి బంతిని వదిలేసిన మూడో బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో గుప్తిల్ డైరెక్ట్ త్రోకు ధోనీ రన్నవుటయ్యాడు. ఈ ఔట్‌తోనే ప్రపంచకప్‌లో భారత్ పోరాటం ముగిసింది. అయితే బ్యాటింగ్‌తో ఆకట్టుకోని గుప్తిల్ ఈ ఒక్క రనౌట్‌తో హీరో అయ్యాడు.
Scroll to load tweet…
