లండన్: ఇంగ్లాండుతో ఆదివారం జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ కానే విలియమ్సన్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 30 పరుగులు చేసి అవుటైన విలియమ్సన్ ప్రపంచకప్‌ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు.

28 ఏళ్ల విలియమ్సన్ ఈ ప్రపంచకప్‌లో 549 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో ఓ కెప్టెన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఈ క్రమంలో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే రికార్డును అతను బద్దలు కొట్టాడు. 

2007 ప్రపంచకప్‌లో జయవర్ధనే 548 పరుగులు చేశాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 539 (2007), ప్రస్తుత కెప్టెన్ అరోన్ ఫించ్ 507 (2019) పరుగులతో ఉన్నారు.