Asianet News TeluguAsianet News Telugu

Ram:రామ్ ఇలా చేస్తున్నాడంటి? మన డైరక్టర్స్ కు మండుతోంది

  ఇప్పుడు మరో తమిళ దర్శకుడికి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. తెలుగు నుంచి దర్శకులు వెళ్లి రామ్ ని కలుస్తున్నా పెద్దగా స్పందించటం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. తమిళ,తెలుగు మార్కెట్ కోసం తమిళ దర్శకులతో జతకడుతున్నట్లు సమాచారం. 

Telugu Directors angry on Ram?
Author
Hyderabad, First Published Jun 30, 2022, 9:39 AM IST


రామ్ తెలుగు డైరక్టర్స్ ని నమ్మడం మానేసారా? అంటే అవుననే అనిపిస్తోంది. తమిళంలో హిట్టైన తడమ్ సినిమాని రెడ్ గా రీమేక్ చేసిన రామ్ ఇప్పుడు తమిళ దర్శకుడు లింగుస్వామితో సినిమా చేస్తున్నారు.  వారియర్ టైటిల్ తో రూపొందుతున్న  ఆ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలవుతుంది. ఇప్పుడు మరో తమిళ దర్శకుడికి అవకాశం ఇస్తున్నట్లు సమాచారం. తెలుగు నుంచి దర్శకులు వెళ్లి రామ్ ని కలుస్తున్నా పెద్దగా స్పందించటం లేదని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. తమిళ,తెలుగు మార్కెట్ కోసం తమిళ దర్శకులతో జతకడుతున్నట్లు సమాచారం. 

అయితే వారియర్ సినిమా తర్వాత రామ్ .. బోయపాటి శ్రీను తో సినిమా చేయనున్నారు. ఆ తర్వాతే గౌతమ్ మీనన్ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. లవ్ స్టోరీలు, యాక్షన్‌ కథలకైనా రెడీ అన్నట్టుగా కనిపించే రామ్‌ కోసం గౌతమ్‌ మేనన్‌ ఓ కథ రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య కొంతకాలంగా కథా చర్చలు జరుగుతున్నాయి. మేకింగ్‌లో ప్రత్యేకమైన స్టైల్  ఉన్న గౌతమ్‌ మేనన్‌.. రామ్‌తో జట్టు కట్టనుండడం ఓ వర్గంలో ఆసక్తి రేపుతోంది. 

ఇక   'ది వారియర్' విషయానికి వస్తే...శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. రామ్ ఈ సినిమాలో మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ పాత్రను రామ్ చేయడం ఇదే ఫస్టు టైమ్. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా నిర్మితమైంది. ది వారియర్ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఆయన స్వరపరిచిన 'బుల్లెట్' సాంగ్ కి రికార్డు స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత వదిలిన 'విజిల్' సాంగ్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. తెలుగు - తమిళ భాషల్లో కలుపుకుని ఇప్పటికే ఈ పాట 12 మిలియన్ ప్లస్ వ్యూస్ ను తెచ్చుకోవడం విశేషం. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు. జులై 1వ తేదీన .. రాత్రి 7:57 నిమిషాలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను వదిలారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios