MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Telangana: కొండా సురేఖ‌ను మా పార్టీలోకి రానివ్వం.. జ‌గ‌దీశ్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Telangana: కొండా సురేఖ‌ను మా పార్టీలోకి రానివ్వం.. జ‌గ‌దీశ్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ నాయ‌కుడు జగదీశ్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇంత‌కీ ఆయ‌న ఎమన్నారంటే.?

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 04 2026, 08:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొండా సురేఖకు బీఆర్‌ఎస్‌లో చోటు లేదు
Image Credit : X/iamkondasurekha

కొండా సురేఖకు బీఆర్‌ఎస్‌లో చోటు లేదు

మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో జగదీశ్‌రెడ్డి పలు రాజకీయ అంశాలపై స్పందించారు. కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లోకి తిరిగి రావాలని భావిస్తున్న నేతల విషయంలో పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని చెప్పారు. గతంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరి విషయంలో మాత్రమే వారి రాజకీయ ప్రవర్తన, వ్యవహారశైలిని పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. అయితే కొండా సురేఖ విషయంలో మాత్రం ఎలాంటి మినహాయింపు ఉండదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆమెను బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కనీసం తెలంగాణ భవన్‌ గేటు వరకు కూడా ఆమెను రానివ్వబోమంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రాజగోపాల్‌రెడ్డి విషయంలోనూ అదే వైఖరి
Image Credit : Asianet News

రాజగోపాల్‌రెడ్డి విషయంలోనూ అదే వైఖరి

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విషయంలోనూ బీఆర్‌ఎస్‌ ఇదే విధానాన్ని అనుసరిస్తుందని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. రాజగోపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నా పార్టీ ఆయనను చేర్చుకోదని స్పష్టం చేశారు. గతంలో ఎన్నికలకు ముందు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఇద్దరూ బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపిన సమయంలోనే తమ పార్టీ ఆ ప్రతిపాదనను తిరస్కరించిందని గుర్తుచేశారు. అప్పుడే నిర్ణయం తీసుకున్న పార్టీ ఇప్పుడు పరిస్థితులు మారిన తర్వాత వెనక్కి తగ్గే అవకాశం లేదనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు.

34
ఎమ్మెల్యేల క్యారెక్టర్‌ ఆధారంగానే నిర్ణయం
Image Credit : Twitter

ఎమ్మెల్యేల క్యారెక్టర్‌ ఆధారంగానే నిర్ణయం

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్‌ఎస్‌ తలుపులు పూర్తిగా మూసివేయలేదని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఎవరు పడితే వారు పార్టీలోకి రావడానికి అవకాశం ఉండదన్నారు.

తిరిగి చేరాలనుకునే నేతల గత రాజకీయ వ్యవహారాలు, పార్టీ పట్ల వారి వైఖరి, వ్యక్తిగత రాజకీయ ప్రవర్తన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. కేవలం రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా తిరిగి చేర్చుకునే విధానం బీఆర్‌ఎస్‌లో ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

44
రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు
Image Credit : X/BRS and Congress

రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవిపై సంచలన వ్యాఖ్యలు

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తే అది రాజకీయంగా తీవ్ర విమర్శలకు దారితీస్తుందని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి పదవి కోసం ఆయన పార్టీ మారితే డబ్బులకు అమ్ముడుపోయినట్టుగా భావించాల్సి వస్తుందని ఆరోపించారు. ఇదే సమయంలో గతంలో బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేసిన నేతల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కొందరు నాయకులు అప్పట్లో పార్టీతో పాటు కాంగ్రెస్‌ అధిష్ఠానం, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌లపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఉన్నాయని, రెండు తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్‌ అంశం కూడా రాజకీయంగా కీలకంగా మారనుందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hyderabad : హైదరాబాద్‌లో అంతరిక్షం నుండి కనిపించేంత భారీ చెత్తకొండలా..! ఎక్కడున్నాయో తెలుసా?
Recommended image2
హైదరాబాద్‌లో ఫ్లాట్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. భారీ తగ్గింపును ఇస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలు
Recommended image3
రాబోయేది క‌ష్ట‌కాలం, జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే.. ప్ర‌జ‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Related Stories
Recommended image1
జీవితం అంటే ఇదే.. విధి రాత‌ను మార్చ‌డం అసాధ్య‌మ‌ని చాటే గొప్ప క‌థ
Recommended image2
బొగ్గు నుంచి కరెంట్ ఎలా తయారవుతుందో తెలుసా.? ప్రాసెస్ తెలిస్తే వావ్ అనాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved