MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • Sanathnagar TIMS Hospital: కార్పొరేట్ రేంజ్ ఫ్రీ వైద్యం.. సనత్‌నగర్ టిమ్స్ ప్రత్యేకతలు ఇవే

Sanathnagar TIMS Hospital: కార్పొరేట్ రేంజ్ ఫ్రీ వైద్యం.. సనత్‌నగర్ టిమ్స్ ప్రత్యేకతలు ఇవే

Sanathnagar TIMS Hospital: సనత్‌నగర్‌లో రూ.1126 కోట్లతో నిర్మించిన ఎంసీఆర్ టిమ్స్ ఆసుపత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 1082 బెడ్స్, ఏఐ టెక్నాలజీతో పేదలకు కార్పొరేట్ ఉచిత వైద్యం అందనుంది. సనత్‌నగర్ TIMS ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 17 2026, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సనత్‌నగర్ ఎంసీఆర్ టిమ్స్: కార్పొరేట్ హాస్పిటల్స్ మైండ్ బ్లాంక్.. ఉచితంగానే వరల్డ్ క్లాస్ వైద్యం
Image Credit : X/TelanganaHealth

సనత్‌నగర్ ఎంసీఆర్ టిమ్స్: కార్పొరేట్ హాస్పిటల్స్ మైండ్ బ్లాంక్.. ఉచితంగానే వరల్డ్ క్లాస్ వైద్యం

తెలంగాణ ప్రజారోగ్య వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేచింది. సాధారణంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలు గుమ్మరిస్తే తప్ప దక్కని అత్యున్నత స్థాయి వైద్యాన్ని, పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా అందించడమే లక్ష్యంగా నిర్మించిన 'డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' (ఎంసీఆర్ టిమ్స్) నేడు అధికారికంగా సేవలు ప్రారంభించనుంది.

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని పాత ఛాతీ ఆసుపత్రి కాంప్లెక్స్ ప్రాంగణంలో రూ.1,126 కోట్లతో నిర్మించిన ఈ భారీ సూపర్ స్పెషాలిటీ వైద్యశాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. 2014 తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ రంగంలో నిర్మించిన అతిపెద్ద టెర్షియరీ కేర్ ఆసుపత్రి ఇదే కావడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
22.67 ఎకరాల భారీ క్యాంపస్.. ఐదు బ్లాకుల విస్తరణ
Image Credit : X/DamodarCilarapu

22.67 ఎకరాల భారీ క్యాంపస్.. ఐదు బ్లాకుల విస్తరణ

సనత్‌నగర్ ఎంసీఆర్ టిమ్స్ దాదాపు 22.67 ఎకరాల విస్తీర్ణంలో (మొత్తం 53.30 ఎకరాల ప్రాంగణం), 11.68 లక్షల చదరపు అడుగుల నిర్మాణ వైశాల్యంతో అత్యంత ఆధునికంగా రూపుదిద్దుకుంది. మొత్తం క్యాంపస్‌ను ఐదు విభిన్న బ్లాకులుగా డిజైన్ చేశారు. ఇందులో రెండు బ్లాకులను రీసెర్చ్, అకాడమిక్స్, పరిపాలనా వ్యవహారాలకు కేటాయించగా, మిగిలిన మూడు ప్రధాన బ్లాకుల్లో చికిత్సలు అందించనున్నారు:

• 'ఏ' బ్లాక్: అత్యవసర చికిత్సలు (ఎమర్జెన్సీ), ట్రౌమా కేర్, 30 ఐసీయూ బెడ్స్, 15 ఆపరేషన్ థియేటర్లు, సెంట్రల్ స్టెరైల్ సర్వీస్ విభాగాలు ఉన్నాయి.

• 'బీ' బ్లాక్: ఓపీ రిజిస్ట్రేషన్, రోగుల క్యూ తగ్గించే అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, ఫార్మసీ, డయాగ్నోస్టిక్స్, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్, లినియర్ యాక్సిలరేటర్ ఆధారిత రేడియేషన్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ విభాగం, రెండు అధునాతన క్యాత్ ల్యాబ్‌లు అమర్చారు.

• 'సీ' బ్లాక్: పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్‌లతో పాటు జనరల్ వార్డులు, పేయిడ్ రూమ్స్, వీఐపీ సూట్స్, విదేశీ రోగుల మెడికల్ టూరిజం కోసం ప్రత్యేక ఫ్లోర్ కేటాయించారు.

Related Articles

Related image1
Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మహా తుపానుగా మారుతోందా? ఈ ప్రాంతాలకు అలర్ట్
Related image2
Nagupamu In Dream: నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది?
36
1082 బెడ్లు, 37 విభాగాలు: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
Image Credit : X/DamodarCilarapu

1082 బెడ్లు, 37 విభాగాలు: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్

ఈ ఆసుపత్రి మొత్తం 1,082 పడకల సామర్థ్యంతో సేవలు అందించనుంది. అందులో 300 ఐసీయూ బెడ్లు, 400 జనరల్ బెడ్లు, 388 ఎమర్జెన్సీ బెడ్లు, 30 డయాలసిస్ పడకలతో పాటు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, పెన్షనర్లు, మెడికల్ టూరిజం కోసం ప్రత్యేకంగా 264 బెడ్లు సిద్ధం చేశారు. ప్రారంభ దశలో 582 పడకలతో వైద్య సేవలు మొదలై, అక్టోబర్ నాటికి పూర్తిస్థాయి 1082 బెడ్స్ అందుబాటులోకి వస్తాయి.

ప్రధానంగా నాలుగు విభాగాలు 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'

1. కార్డియాక్ సైన్సెస్ (గుండె సంబంధిత రంగాలు)

2. రీనల్ సైన్సెస్ (కిడ్నీ వైద్యం, నెఫ్రాలజీ, యూరాలజీ)

3. ట్రాన్స్ప్లాంటేషన్ (అవయవ మార్పిడి చికిత్సలు)

4. ట్రామా సైన్సెస్ (అత్యవసర ప్రమాద చికిత్సలు)

వీటితో పాటు న్యూరాలజీ, న్యూరోసర్జరీ, కార్డియోథొరాసిక్, ఆర్థోపెడిక్స్, గ్యాస్ట్రో సైన్సెస్ సహా మొత్తం 37 విభాగాలు ఇక్కడ ఉన్నాయి. త్వరలోనే మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ వంటి మరిన్ని విభాగాలు తోడవనున్నాయి. ఆసుపత్రి నిర్వహణ కోసం ప్రభుత్వం ఇప్పటికే 2,360 పోస్టులను మంజూరు చేయగా, అందులో 1,633 పోస్టులు వైద్యులకు సంబంధించినవే కావడం విశేషం.

46
ఏఐ న్యూమాటిక్ ట్యూబ్ టెక్నాలజీ.. భారత్‌లోనే మొదటిసారి
Image Credit : X/DamodarCilarapu

ఏఐ న్యూమాటిక్ ట్యూబ్ టెక్నాలజీ.. భారత్‌లోనే మొదటిసారి

దేశంలోనే ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో లేని విధంగా, సనత్‌నగర్ టిమ్స్‌లో ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా రోగుల బ్లడ్ శాంపిల్స్, అత్యవసర మందులు, రిపోర్టులను ల్యాబ్‌లు, వార్డులు, ఫార్మసీ మధ్య కేవలం 1 నుండి 2 నిమిషాల్లో వేగంగా పంపవచ్చు. దీనివల్ల నమూనాలు కలెక్ట్ చేయడానికి పట్టే సమయం భారీగా తగ్గి, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడటం తేలికవుతుంది.

అంతేకాకుండా, ఇక్కడ 3.0 టెస్లా ఎంఆర్‌ఐ, 128-స్లైస్ సీటీ స్కాన్, అడ్వాన్స్‌డ్ మ్యామోగ్రఫీ, ఐదు ఎక్స్‌రే యంత్రాలు సహా అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి. 24 గంటల అంబులెన్స్ సేవలు, బెడ్ దగ్గర నుంచే సిబ్బందిని పిలిచే నర్స్ కాలింగ్ సిస్టమ్ అందుబాటులో ఉన్నాయి.

56
ప్రయాణికులకు, అటెండెంట్లకు సౌకర్యాలు
Image Credit : Getty

ప్రయాణికులకు, అటెండెంట్లకు సౌకర్యాలు

మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) డిజైన్-బిల్డ్ పద్ధతిలో నిర్మించిన ఈ కాంప్లెక్స్ ఐజీబీసీ గోల్డ్ రేటింగ్ సాధించింది. ఇందులో వర్షపు నీటి నిల్వ, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ద్వారా దాదాపు 75 శాతం నీటిని రీసైకిల్ చేసి పచ్చదనం పెంచడానికి ఉపయోగిస్తారు.

రోగుల బంధువులు వేచి ఉండటానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఆరు అంతస్తుల ధర్మశాల (200 మంది అటెండెంట్లకు వసతి) నిర్మించారు. మల్టీలేవల్ పార్కింగ్ సదుపాయం, 30 మృతదేహాలను ఉంచగలిగే మార్చురీ సామర్థ్యం ఇక్కడ ఉన్నాయి. మే 1, 2026 నుంచి ప్రారంభమైన ఓపీ ట్రయల్ రన్‌లో రోజుకు 300 మంది దాకా సేవలు పొందగా, ఆసుపత్రి పూర్తిస్థాయిలో నడిస్తే నిత్యం 4,000 మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందవచ్చని అంచనా వేస్తున్నారు.

66
గాంధీ, ఉస్మానియాలపై తగ్గనున్న ఒత్తిడి
Image Credit : X/TelanganaHealth

గాంధీ, ఉస్మానియాలపై తగ్గనున్న ఒత్తిడి

నిమ్స్ (NIMS) తరహాలోనే స్వయం ప్రతిపత్తి హోదాతో పనిచేసే ఈ ఆసుపత్రి అందుబాటులోకి రావడం వల్ల హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ఆసుపత్రులపై ఉన్న తీవ్ర ఒత్తిడి తగ్గుతుంది. పేద ప్రజలు లక్షల రూపాయల కార్పొరేట్ బిల్లుల భయం లేకుండా, అత్యున్నత స్థాయి ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని పొందే గొప్ప అవకాశం సనత్‌నగర్ ఎంసీఆర్ టిమ్స్ ద్వారా లభించనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
KCR : బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళతారు సరే.. ఇంతకీ కేసీఆర్ వెళతారా, లేదా?
Recommended image2
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image3
Now Playing
Revanth Reddy Full Speech At Nakirekal Meeting | Asianet News Telugu
Related Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మహా తుపానుగా మారుతోందా? ఈ ప్రాంతాలకు అలర్ట్
Recommended image2
Nagupamu In Dream: నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved