MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మహా తుపానుగా మారుతోందా? ఈ ప్రాంతాలకు అలర్ట్

Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. మహా తుపానుగా మారుతోందా? ఈ ప్రాంతాలకు అలర్ట్

Weather Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతోందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరించారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 17 2026, 09:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏపీ, తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయంటే?
Image Credit : Chatgpt

ఏపీ, తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయంటే?

బంగాళాఖాతంలో వెదర్ సీన్ సడెన్‌గా మారిపోయింది. వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలంగా మారి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. తుపానులు వచ్చే అవకాశాలను కూడా ప్రస్తావించింది. ఈ ప్రభావంతో తూర్పు, మధ్య భారతంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం పూర్తిగా కూల్ అయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉత్తరాంధ్ర తీరానికి విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్
Image Credit : ANI

ఉత్తరాంధ్ర తీరానికి విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్

ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తాంధ్రపై స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న నాలుగైదు రోజుల పాటు ఉత్తరాంధ్ర తీరం వెంట గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో భయంకరమైన ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉంది. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారి పెద్ద ఎత్తున అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన జాలర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సురక్షిత ప్రాంతాలకు, తీరానికి తిరిగి రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Related Articles

Related image1
Famous Temples in South India: సౌత్ ఇండియాలో జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన టాప్ 5 హిందూ దేవాలయాలు
Related image2
Nagupamu In Dream: నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది?
35
ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాల్లో వర్షాలు?
Image Credit : ANI

ఆంధ్రప్రదేశ్‌లో ఏ జిల్లాల్లో వర్షాలు?

అల్పపీడనం, రుతుపవన ద్రోణి కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పోలవరం, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

అలాగే మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, మార్కాపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదయ్యే అవకాశం ఉంది.

45
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్
Image Credit : Gemini

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్

తెలంగాణలోనూ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వాయవ్య బంగాళాఖాతం నుంచి విస్తరించిన రుతుపవన ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ విడుదల చేసింది.

ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ పరిసర ప్రాంతాల్లో వర్ష ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండనుంది. ప్రస్తుతం ఖరీఫ్ సాగులో ఉన్న రైతులకు ఈ చినుకులు ఎంతో ఊరటనివ్వనున్నాయి.

55
వర్షాలు.. ప్రజలకు జాగ్రత్తలు
Image Credit : Chatgpt

వర్షాలు.. ప్రజలకు జాగ్రత్తలు

ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

• చెట్ల కింద, పాతబడిన భవనాలు, కరెంట్ స్తంభాలు, హోర్డింగుల కింద నిలబడకూడదు.

• వర్షం పడుతున్న సమయంలో ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా ఉంచడం మంచింది.

• ప్రస్తుతం అత్యంత భారీ వర్షాల హెచ్చరికలు లేకపోయినా, ఈదురుగాలుల వల్ల చిన్నపాటి ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
అమరావతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
Recommended image2
Now Playing
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations
Recommended image3
Now Playing
లోకేష్ ని ఆకట్టుకున్న పుంగనూరు జాతి పొట్టి ఆవులు | Nara Lokesh | Punganur Cows | Independence Day
Related Stories
Recommended image1
Famous Temples in South India: సౌత్ ఇండియాలో జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన టాప్ 5 హిందూ దేవాలయాలు
Recommended image2
Nagupamu In Dream: నాగుపాము కలలో కనిపిస్తే ఏమవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved