MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Relationship
  • పెళ్లంటేనే పారిపోతున్నారా? మీరూ అందులో ఒకరా? ఎందుకో తెలుసా...?

పెళ్లంటేనే పారిపోతున్నారా? మీరూ అందులో ఒకరా? ఎందుకో తెలుసా...?

పెళ్లంటేనే పారిపోతున్నారా? ఎక్కడ బంధనాల్లో ఇరుక్కుపోవాల్సి వస్తుందో అని భయపడుతున్నారా? బాధ్యతలు తలమీద నాట్యం చేస్తాయని ఇబ్బంది పడుతున్నారా? అయితే అది మీ రాశి ప్రభావమే... 

2 Min read
Author : Bukka Sumabala
Published : Dec 09 2022, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

కొంతమంది వివాహం చేసుకోవాలనే ఆలోచననే తట్టుకోలేరు. పెళ్లితో మరొకరితో జీవితాన్ని పంచుకోవాలని.. కలిసి నడవాలన్న ఆలోచన కూడా వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. జీవితాంతం ఒక వ్యక్తితో ముడిపడి ఉండాలనే ఆలోచన వారిని విపరీతంగా భయపెడుతుంది. అందుకే పెళ్లి అన్న ప్రతీసారి కుంగిపోతారు. ఏదో ఒక వంకతో పెళ్లిని ఎత్తగొడుతుంటారు. అయితే, అది మీ తప్పు కాదు. మీ రాశిలోనే ఆ తేడా ఉందట.. దీన్ని సరిచేయచ్చు అంటున్నారు జ్యోతిష్య శాస్త్రవేత్తలు. అలాంటి రాశులేవో.. వాటిలో మీ రాశి ఉందో చెక్ చేయండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కుంభం (Aquarius)
ఈ రాశివారు చాలా స్వేచ్ఛా జీవులు. అందుకే ఒక వ్యక్తికి పరిమితం కావడానికి ఇష్టపడరు. వీరి ఉద్దేశ్యంలో ఓ వ్యక్తిని పెళ్లి పేరుతో జీవితాంతం కట్టిపడేయడం చాలా దారుణమైన విషయం. అందుకే పెళ్లి అంటేనే భయపడతారు. అందుకే వీలైనంత వరకు వివాహం అంటేనే.. అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తారు.

37

మిథునం (Gemini)
మిథునరాశివారు సరదాగా ఉండడానికి ఇష్టపడతారు. అందరితో తొందరగా కలిసిపోతారు. కానీ జీవితాంతం ఒక వ్యక్తితో కలిసి ప్రయాణించడం వీరికి ఇష్టం ఉండదు. ఒకసారి పెళ్లి అయితే తాము అంతకు ముందు ఉన్నంత సరదాగా, ఫ్రీగా ఉండలేమని భావిస్తారు. అందుకే పెళ్లి అంటే భయపడతారు. పెళ్లి నిర్ణయాన్నే దూరంగా తోసేస్తారు. 

47

ధనుస్సు (Sagittarius)
వీరి దృష్టిలో పెళ్లి అంటేనే సమస్యల వలయం.. అందుకే పెళ్లి తమకు కుదిరే పని కాదని అనుకుంటారు. పెళ్లి చేసుకుంటే బాధ్యతగా ఉండాలి, కట్టుబడి ఉండాలి..అనే భావనే వీరు తట్టుకోలేరు. భయాందోళన కలిగిస్తుంది. 

 

57

సింహం (Leo)
వివాహం వీరిని భయపెడుతుంది. వివాహ బంధంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం కష్టంగా ఉంటుంది. ఆ భయం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకే పెళ్లి అంటే అనాసక్తి చూపుతారు. పెళ్లి చేసుకుని పెద్దవారిలా వ్యవహరించడాన్ని ఊహించుకోలేరు.

67

మకరం (Capricorn)
మీరు మీ మనస్సును పెళ్లినుంచి మళ్లించడానికి మీ దృష్టి అంతా మీ కెరీర్‌పై పెడతారు. ఎవరితోనైనా వివాహం జరగడం మీకు చాలా పెద్ద భారంగా అనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు దానిని నివారించడానికి ప్రయత్నిస్తారు. అయితే పెద్దగా బాధ్యత లేకుండా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురైతే దానికి కట్టుబడి ఉంటారు.

77

పెళ్లి అంటేనే పారిపోయే రాశులు ఇవి అయితే... పెళ్లిని ఇష్టపడే రాశులు కొన్ని ఉన్నాయి. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, తుల, వృశ్చికం, మీన రాశివారు వివాహ ఆలోచనను ఇష్టపడతారు. పెళ్లి చేసుకుంటే ఓ వ్యక్తి తమకు జీవితాంతం తోడుగా ఉంటారనే ఆలోచన వారికి  చాలా ఇష్టం.

About the Author

BS
Bukka Sumabala
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Recommended image2
Love Signs: ఒక అమ్మాయి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమిస్తోందని చెప్పకనే చెప్పే 7 సీక్రెట్ సిగ్నల్స్ ఇవే
Recommended image3
Relationship : మీ తల్లి, భార్య గొడవపడితే ఏం చేయాలి? చాణక్య పరిష్కారాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved