MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Capital: ఒకే నగరం.. రెండు రాష్ట్రాలకు రాజధానిలా ఎలా మారింది? ఈ నగరం స్పెషాలిటీ ఏంటి?

Capital: ఒకే నగరం.. రెండు రాష్ట్రాలకు రాజధానిలా ఎలా మారింది? ఈ నగరం స్పెషాలిటీ ఏంటి?

Capital: మన దేశంలో రెండు రాష్ట్రాలకు ఒకటే రాజధాని ఉంది… ఆ రాష్ట్రాలేంటి? అసలు.. ఒకే రాజధానిని రెండు రాష్ట్రాలు ఎంపిక చేసుకోవడం వెనక పరిస్థితులు ఏంటి? మరి పరిపాలన ఏ రాష్ట్రం చేతిలో ఉంటుంది?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 20 2026, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రెండు రాష్ట్రాల రాజధాని..
Image Credit : Geminiai

రెండు రాష్ట్రాల రాజధాని..

రెండు వేర్వేరు రాష్ట్రాలు, రెండు వేర్వేరు ప్రభుత్వాలు.. కానీ రాజధాని మాత్రం ఒకటే. ఇది మరెక్కడో కాదు.. మన దేశంలోనే. పంజాబ్, హర్యానా రాష్ట్రాలు రెండింటికీ ఏకైక రాజధానిగా ఉన్న నగరం చండీగఢ్.. అసలు.. రెండు రాష్ట్రాలకు ఒకే నగరం రాజధానిలా ఎలా మారింది..? భారతదేశంలోని మొదటి ప్లాన్డ్ సిటీగా పిలిచే చండీగఢ్ నగరం కథేంటి? ఈ నగరం ఎందుకు అంత స్పెషల్..? ఈ విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
చండీగఢ్ పేరు అర్థమేంటి?
Image Credit : Geminiai

చండీగఢ్ పేరు అర్థమేంటి?

ఈ ప్రాంతంలో ప్రసిద్ధ చండీ మందిరం ( దుర్గా దేవి గుడి) ఉంది. అలాగే ఇక్కడ ఫేమస్ గఢ్( కోట) కూడా ఉంది. ఈ రెండు పదాలను కలిపి చండీగఢ్ అనే పేరు పెట్టారు.

రాజధానిలా ఎలా మారింది?

1947లో దేశ విభజన జరిగినప్పుడు.. పంజాబ్ పాత రాజధాని ‘లాహోర్’ పాకిస్తాన్ లోకి వెళ్లిపోయింది. దీంతో పంజాబ్ కోసం కొత్త రాజధాని నిర్మించాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు చండీగఢ్ ని రాజధానిగా నియమించారు.

దేశంలోనే తొలి ప్లాన్డ్ సిటీ..

స్వతంత్ర భారత ప్రతిభను ప్రపంచానికి చూపించేలా ఒక ఆధునిక నగరాన్ని కట్టాలని అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అనుకున్నారు.ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ లీ కార్బుసియర్ ఈ నగరానికి ప్లాన్ వేశారు. విచిత్రమేంటంటే.. మనిషి శరీరం ఆధారంగా ఈ నగరాన్ని డిజైన్ చేశారు. క్యాపిటల్ కాంప్లెక్స్ తల భాగంలో, సిటీ సెంటర్ గుండె ఆకారంలో, పార్కులు, చెట్లు ఊపిరితిత్తులు గా విభజించారు. ఇక ఈ నగరాన్ని 'సెక్టర్లు'గా విభజించారు. ప్రతీ సెక్టార్‌లోనే బడులు, మార్కెట్లు, పార్కులు ఉండేలా ప్లాన్ చేశారు. అయితే చండీగఢ్‌లో సెక్టర్ 13 ఉండదు.

33
రెండు రాష్ట్రాలకు ఒకే రాజధానిగా ఎలా మారింది?
Image Credit : Geminiai

రెండు రాష్ట్రాలకు ఒకే రాజధానిగా ఎలా మారింది?

1966లో పంజాబ్ నుండి 'హర్యానా' ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మన తెలుగు రాష్ట్రాలు విడిపోయినట్లే పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలుగా విడిపోయాయి. అయితే.. విభజన తర్వాత చండీగఢ్ మాదంటే మాదని ఇరు రాష్ట్రాలూ పట్టుబట్టాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం ఒక పరిష్కారం కనుగొంది. చండీగఢ్‌ను ఒక కేంద్రపాలిత ప్రాంతంగా (UT) ప్రకటిస్తూ, రెండింటికీ ఉమ్మడి రాజధానిగా చేసింది. పంజాబ్ గవర్నరే చండీగఢ్ నగర ప్రధాన పాలకుడిగా (అడ్మినిస్ట్రేటర్) వ్యవహరిస్తారు.

చండీగఢ్ లో చూడాల్సిన ప్రదేశాలు..

రాక్ గార్డెన్: 'నెక్ చంద్' అనే వ్యక్తి పగిలిన గాజులు, పాత సెరామిక్ పాత్రలు, విసిరేసిన వ్యర్థ పదార్థాలతో ఈ గార్డెన్‌ను చాలా అద్భుతంగా నిర్మించారు.

సుఖ్నా లేక్: కొండల దిగువన ఉండే ఈ సరస్సు సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరంగా గడపడానికి ఎంతో బాగుంటుంది.

ఓపెన్ హ్యాండ్ శిల్పం: లీ కార్బుసియర్ డిజైన్ చేసిన ఓపెన్ హ్యాండ్ శిల్పం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. గ్రీన్ సిటీ: దేశంలోనే అత్యధిక పచ్చదనం, పరిశుభ్రత , క్రమశిక్షణ కలిగిన రోడ్లు ఉన్న నగరాల్లో ఇది ఒకటి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Stomach Growling: ఆకలి వేసినప్పుడు పొట్టలో గుడగుడమనే శబ్దాలు ఎందుకు వస్తాయి?
Recommended image2
Kitchen Shelves: అల్యూమినియం ఫాయిల్‌తో వంటగది షెల్ఫ్‌లను క్లీన్ గా ఉండే చిట్కాలు
Recommended image3
Chitti Mutyalu Mutton Pulav: వీకెండ్ సెట్ చేసే టాప్ నాచ్ మటన్ పులావ్..
Related Stories
Recommended image1
Reverse Waterfall: ఈ వాటర్ ఫాల్ లో నీరు కిందకు రాదు.. పైకి వెళతాయి, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..!
Recommended image2
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved