MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?

River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?

River: మన దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. ఏ నది అయినా.. ఎత్తు నుంచి పల్లానికే ప్రవహిస్తుంది. ముందు నుంచి వెనక్కి ప్రవహిస్తుంది. కానీ, వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏదో మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
| Updated : Aug 14 2026, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
River
Image Credit : Chat GPT

River

నదులు ఎప్పుడైనా ఎత్తైన పర్వాతల నుంచి పల్లపు ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంది అదే. కానీ, మన భారత దేశంలో ఒక నది మాత్రం.. చాలా భిన్నంగా ప్రవహిస్తుంది. వినడానికి వింతగా అనిపించినా.. ఈ నది చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది. ఎటు చూసినా ప్రశాంతమైన వాతావరణం, ఒడ్డున వరసగా వందలాది శివాలయాలు.. వాటి మధ్యలో యూటర్న్ తీసుకొని ప్రవహించే ఈ నది చూడటానికి రెండు కళ్లు సరిపోవ. మరి.. ఈ వింత నది ఎక్కడ ఉంది? నిజంగానే వెనక్కి ప్రవహిస్తుందా? దీని వెనక చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ నది మన దేశంలోనే ఉందా?
Image Credit : Chat GPT

ఈ నది మన దేశంలోనే ఉందా?

ఈ నది మన దేశంలోనే ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమయంలో ఉన్న బటేశ్వర్ అనే ఈ ప్రముఖ దేవాలయం వద్ద ఇది కనిపిస్తుంది. ఇక్కడ ప్రవహించే పవిత్రా యమునా నది.. ఇతర నదుల్లా కాకుండా.. వెనక్కి ప్రవహిస్తూ ఉండటం విశేషం.

సాధారణంగా యమునా నది ఉత్తరం నుంచి దక్షిణ-తూర్పు (South-East) దిశగా సాగుతుంది. కానీ బటేశ్వర్ వద్దకు రాగానే నది ఒక్కసారిగా మలుపు తిరిగి వాయువ్య (North-West) దిశగా ప్రవహిస్తుంది. అక్కడ నిలబడి చూసేవారికి నది వెనక్కి ప్రవహిస్తున్నట్లు అనిపించడంతో దీనికి "వెనక్కి ప్రవహించే యమున" అనే పేరు వచ్చింది.

రాజు నిర్మించిన కట్టడా నికి కారణమా?

ఈ నది మలుపు వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. స్థానిక ఆధారాలు, నివేధికల ప్రకారం.. భదావర్ రాజవంశానికి చెందిన రాజు బదన్ సింగ్ కాలంలో యమునా నది ప్రవాహాన్ని ఇక్కడున్న దేవాలయాల పాదాలను తాకేలా మళ్లించేందుకు సుమారు ఒక 'కోసు' పొడవైన అర్ధచంద్రాకార రాతి కట్టను నిర్మించారు.దీని కారణంగా నది వెనక్కి ప్రవహిస్తుందని స్థానికులు నమ్ముతారు.

అయితే ఈ కట్ట వల్ల మాత్రమే నది ప్రవాహం మారిందని చెప్పలేం. నది సహజమైన భౌగోళిక ఆకృతి, అక్కడి భూభాగం, చారిత్రక నిర్మాణం—ఇవన్నీ కలిసి బటేశ్వర్ వద్ద ఒక అర్ధచంద్రాకారపు మలుపును ఏర్పరిచాయి.

33
ఈ ఆలయం ప్రత్యేకత..
Image Credit : ChatGpt

ఈ ఆలయం ప్రత్యేకత..

బటేశ్వర్ కేవలం నది మలుపుతోనే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత పొందింది.యమునా నది ఒడ్డున వరుసగా 101 కంటే ఎక్కువ శివాలయాలు కొలువై ఉన్నాయి. ఉత్తర దిశగా లేదా వాయువ్య దిశగా ప్రవహించే నదులను (ఉత్తరవాహిని) హిందూ ధర్మంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. అందుకే కాశీ లాగే బటేశ్వర్‌ను కూడా పవిత్రమైన పుణ్యక్షేత్రంగా పూజిస్తారు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి సొంత ఊరు కూడా ఈ బటేశ్వరే కావడం మరొక విశేషం.

నిజంగానే నీరు వెనక్కి ప్రవహిస్తుందా? 

యమునా నది తన మొత్తం ప్రయాణ దిశను మార్చుకుని వెనక్కి వెళ్లడం లేదు.కానీ, బటేశ్వర్ వద్ద యమునా నది ఒక పెద్ద అర్ధచంద్రాకార మలుపు (Curved Loop) తీసుకోవడం వల్ల, అక్కడ నిలబడి చూసినప్పుడు నది వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్న భ్రమ కలుగుతుంది. ఆ నదిని చూసిన వారు ఎవరైనా వెనక్కి ప్రవహిస్తుందనే నమ్ముతారు. చూడటానికి అచ్చం అలానే ఉంటుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Recommended image2
Banana: రాత్రిపూట అరటి పండు తింటే ఏమౌతుంది? నిజంగా బరువు పెరుగుతారా?
Recommended image3
Kitchen Hacks: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదా? చేస్తే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Train: సీటు వెతుక్కుని కూర్చొనేలోపే స్టేషన్ వచ్చేస్తుంది.. మన దేశంలో అతి చిన్న రైలు ప్రయాణం..ఎక్కడో తెలుసా?
Recommended image2
సముద్రం మధ్యలో ‘ తియ్యటి నీరు’.. దీని వెనక సీక్రెట్ ఏంటి? శివాజీ మహారాజ్ కి ఇదెలా సాధ్యమైంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved