MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది

వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది

వాషింగ్ మెషీన్ ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉంటుంది. దాన్ని వాడడం వచ్చనుకుంటారు కానీ దాన్ని డేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాము. దీని వల్ల మెషీన్ పాడవడంతో పాటూ దుస్తుల నాణ్యతను కూడా దెబ్బతీస్తాయి. ఆ తప్పులేంటో తెలుసుకోండి.

3 Min read
Author : Haritha Chappa
Published : Aug 19 2026, 05:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వాషింగ్ మెషీన్లో చేయకూడదని తప్పులు
Image Credit : Gemini AI

వాషింగ్ మెషీన్లో చేయకూడదని తప్పులు

ఇప్పుడు ప్రతి ఇంట్లో వాషింగ్ మెషీన్ ఉంది. అందులోనే దుస్తులు ఉతుకుతున్నారు అందరూ. అందులో దుస్తులు వేసి, డిటర్జెంట్ కలిపి, వాష్ మోడ్ సెలెక్ట్ చేస్తే పని అయిపోతుందని అనుకుంటారు ఎంతోమంది. కానీ మెషీన్ వాడకంలో చేసే కొన్ని చిన్న తప్పుల వల్ల బట్టలు సరిగ్గా శుభ్రం కావు. దుస్తులపై డిటర్జెంట్ మరకలు పడొచ్చు. మెషీన్‌లో కూడా అనవసర సమస్యలు రావచ్చు. మనం రోజూ బట్టలు ఉతుకుతున్నా, ఈ చిన్న తప్పులు పట్టించుకోం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మెషీన్‌లో బట్టలు కుక్కేస్తున్నారా?
Image Credit : ChatGPT

మెషీన్‌లో బట్టలు కుక్కేస్తున్నారా?

వాషింగ్ మెషీన్‌లో వేసేటప్పుడు చాలామంది చేసే సాధారణ తప్పు వాటిలో విపరీతంగా దుస్తులు కుక్కేయడం. వాషింగ్ మెషీన్ కెపాసిటీకి మించి బట్టలు నింపేస్తే, అవి డ్రమ్‌లో ఫ్రీగా తిరగలేవు. దీనివల్ల నీళ్లు, డిటర్జెంట్ దుస్తుల్లోకి సరిగ్గా వెళ్లక ఉతికే సామర్థ్యం దెబ్బతింటుంది. ఎక్కువ లోడ్ వల్ల మెషీన్‌లో ఇంబ్యాలెన్స్, స్పిన్ సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి అలా దుస్తులు అధికంగా వేయకండి.

ఎక్కువ డిటర్జెంట్ వేస్తున్నారా?

చాలామంది డిటర్జెంట్ ఎక్కువ వేస్తే దుస్తులకున్న మురికి పోతుందనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. అవసరానికి మించిన డిటర్జెంట్, ఎక్కువ నురుగును సృష్టించి, దుస్తులను సరిగ్గా జాడించకుండా చేస్తుంది. దుస్తులపై డిటర్జెంట్ మరకలు పడటంతో పాటు, మెషీన్ లోపల కూడా పేరుకుపోతుంది. బట్టల పరిమాణం, మురికి, డిటర్జెంట్ తయారీదారు సూచనల ప్రకారం సరైన మోతాదులోనే వాడండి.

దుస్తులన్నీ కలిపి వేయవద్దు

తెలుపు, నలుపు, ఇతర రంగు బట్టలు.. అన్నీ కలిపి వేయడం చాలామందికి సులువుగా అనిపిస్తుంది. కానీ ఈ పద్ధతి వల్ల దుస్తులు రంగులు మారిపోవడం, కొన్ని దుస్తులకు ఇతర రంగులు అతుక్కుపోయి పాడవడం జరుగుతుంది. అంతేకాదు టవల్స్ లాంటి గరుకు ఫ్యాబ్రిక్స్‌ను, డెలికేట్ లేదా సింథటిక్ బట్టలతో కలిపి ఉతకడం కూడా సరైన పద్ధతి కాదు. బట్టల రంగు, ఫ్యాబ్రిక్ రకం, కేర్ లేబుల్ చూసి లోడ్‌ను వేరు చేయడం మంచిది. ముఖ్యంగా తెల్ల బట్టలను వేరుగా, ముదురు రంగు లేదా కలర్ బట్టలను వేరుగా ఉతకాలి.

33
ఇలాంటి వస్తువుల లేకుండా
Image Credit : Getty

ఇలాంటి వస్తువుల లేకుండా

ప్యాంటు లేదా షర్టు జేబుల్లో నాణేలు, సేఫ్టీ పిన్‌లు, తాళాలు, కాగితాలు, టిష్యూల లాంటి వస్తువులు ఉన్నాయో లేవో చెక్ చేయండి. అలాంటి చిన్న వస్తువులు డ్రమ్ లేదా డోర్ సీల్‌లో ఇరుక్కుపోవచ్చు. పదునైన వస్తువులు మెషీన్‌లోని కొన్ని భాగాలను, దుస్తులను పాడుచేయగలవు. అందుకే, దుస్తులను మెషీన్‌లోకి వేసే ముందు అన్ని జేబులనూ ఒకసారి సరిచూసుకోవడం మంచి అలవాటు. ఈ పని మెషీన్ లైఫ్‌కు, దుస్తుల భద్రతకు అవసరం.

వాష్ సైకిల్ పూర్తయ్యాక కూడా తడి దుస్తులను చాలా గంటలపాటు మెషీన్‌లోనే ఉంచడం మంచిది కాదు. డ్రమ్‌లో తేమ ఎక్కువసేపు ఉండటం వల్ల దుర్వాసన, బూజు పట్టే అవకాశం ఉంది. తడి దుస్తుల్లో కూడా ఒకరకమైన వాసన రావచ్చు. వాష్ పూర్తవగానే దుస్తులను త్వరగా బయటకు తీసి ఆరవేయడం చాలా ముఖ్యం. ఫ్రంట్-లోడ్ మెషీన్ వాడేవాళ్లు, వాష్ తర్వాత డోర్‌ను కొద్దిసేపు తెరిచి ఉంచడం వల్ల లోపల గాలి ఆడుతుంది. ఇది మెషీన్ లోపల శుభ్రంగా ఉండటానికి సహాయపడుతుంది.

అన్ని బట్టలనూ ఒకే వాష్ సైకిల్‌లో ఉతకడం కూడా ఒక తప్పే. కాటన్, సింథటిక్, ఉన్ని, సిల్క్, డెలికేట్ ఫ్యాబ్రిక్స్‌కు వేర్వేరు వాషింగ్ అవసరాలు ఉంటాయి. బట్టల కేర్ లేబుల్‌ను చూసి దానికి తగ్గ సైకిల్, టెంపరేచర్‌ను ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు, డెలికేట్ బట్టలను ఎక్కువ అజిటేషన్ లేదా అధిక ఉష్ణోగ్రత ఉన్న సైకిల్‌లో ఉతికితే వాటి నాణ్యత దెబ్బతినొచ్చు. మెషీన్‌లో ఉన్న ప్రతి మోడ్‌కూ ఒక కారణం ఉంది – దానికి తగిన బట్టలకు దాన్ని వాడండి. ఇది బట్టలను కాపాడుతుంది.

బట్టలను శుభ్రంగా ఉంచితే సరిపోదు; బట్టలు ఉతికే మెషీన్‌ను కూడా అప్పుడప్పుడు శుభ్రం చేయాలి. డిటర్జెంట్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నర్, మురికి వంటివి డిటర్జెంట్ ట్రే, డోర్ సీల్, డ్రమ్ భాగాల్లో పేరుకుపోవచ్చు. దీనివల్ల దుర్వాసన, వాషింగ్ పెర్ఫార్మెన్స్‌కు సంబంధించిన సమస్యలు రావచ్చు. మీ మెషీన్‌లో 'టబ్ క్లీన్' / 'ఎకో టబ్ క్లీన్' లాంటి ఫీచర్ ఉంటే, తయారీదారు సూచనల ప్రకారం వాడొచ్చు. క్లీనింగ్ చేసేటప్పుడు మెషీన్‌లో బట్టలు ఉండకూడదు. ప్రత్యేకమైన టబ్-క్లీనింగ్ ప్రొడక్ట్ ఉంటే, దాని సూచనలను పాటించాలి. ఇది మెషీన్ లైఫ్‌ను పెంచుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Poori oil: వేడి నూనెలో ఆ పదార్థాలు వేస్తే పూరీలు, పకోడీలు నూనె పీల్చవా?
Recommended image2
Parenting: మీ పిల్లలు ఎప్పుడూ గొడవ పడుతున్నారా? ఈ 5 చేస్తే వారి మధ్య ప్రేమ పెరగడం పక్కా!
Recommended image3
Ear Cuff Jhumka:చీరలు,లెహంగా మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే ఇయర్ కఫ్ జుంకాలు
Related Stories
Recommended image1
Samosa: సమోసా ఏ దేశంలో పుట్టింది? మనదేశంలోకి ఎప్పుడు, ఎలా అడుగుపెట్టింది?
Recommended image2
Countries: ఈ దేశాలకు అధ్యక్షుడు లేడు, ప్రధాని ఉండరు.. అయినా ప్రజలందరూ హ్యాపీగా బతుకుతున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved