MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Reverse Waterfall: ఈ వాటర్ ఫాల్ లో నీరు కిందకు రాదు.. పైకి వెళతాయి, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..!

Reverse Waterfall: ఈ వాటర్ ఫాల్ లో నీరు కిందకు రాదు.. పైకి వెళతాయి, జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే..!

Reverse Waterfall: వాటర్ ఫాల్స్ అంటేనే పై నుంచి నీరు కిందకు జారుతుంది. కానీ, కింద నుంచి పైకి నీరు వెళ్లే వాటర్ ఫాల్స్ ఎప్పుడైనా చూశారా? ఈ వింత వాటర్ ఫాల్స్ మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 15 2026, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Reverse Waterfalls
Image Credit : Gemini ai

Reverse Waterfalls

భూమిపై ఉండే ప్రతి వస్తువు కిందకే రావాలి. దీనినే మనం గురుత్వాకర్షణ శక్తి అని అంటాం. చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో మనం చదువుకుంది ఇదే. ఇప్పటి వరకు మీరు చాలా వాటర్ ఫాల్స్ చూసి ఉంటారు. కానీ, మన దేశంలో ఉన్న రివర్స్ వాటర్ ఫాల్ ఎప్పుడైనా చూశారా? ఇక్కడ నీరు కిందకు జారదు.. కింద నుంచి పైకి నీరు వెళుతుంది. ఆ రివర్స్ వాటర్ ఫాల్ గురించి ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఈ జలపాతం ఎక్కడ ఉంది?
Image Credit : Gemini ai

ఈ జలపాతం ఎక్కడ ఉంది?

మహారాష్ట్రలోని పుణే సమీపంలో ఉన్న నానేఘాట్ అనే ప్రసిద్ధ ఘాట్ రోడ్డు ప్రాంతంలో ఈ అద్భుతమైన రివర్స్ వాటర్ ఫాల్స్ ఉంది. సాధారణంగా... ప్రపంచంలో ఎక్కడైనా గ్రావిటివిటీ కారణంగా.. వాటర్ ఫాల్స్ లో వాటర్ పై నుంచి కిందకు జారుతుంది. కానీ.. ఈ నానేఘాట్ లో మాత్రం నీళ్లు కింద పడకుండా.. తుంపర్ల రూపంలో ఆకాశంలోకి ఎగురుతూ కనిపిస్తాయి. ఈ వింత చూడటానికే చాలా మంది ఈ వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్తూ ఉంటారు.

సైంటిఫిక్ కారణం ఏంటి?

ఈ వాటర్ ఫాల్ దగ్గర నీరు కింద పడిపోకుండా పైకి వెళ్లడం వెనక మ్యాజిక్ ఏమీ లేదు. అక్కడ గాలి చాలా ఎక్కువగా ఉంటుంది. నానేఘాట్ ప్రదేశం లోయల మధ్యలో చాలా ఎత్తైన కండల శిఖరాగ్రాన ఉంటుంది. వర్షాకాలంలో ఇక్కడ గాలి వేగం ఊహించనంత చాలా ఎక్కువగా ఉంటుంది. జలపాతం పై నుంచి కిందకు ప్రవహించే నీటి బరువు కంటే, కింద నుంచి లోయ ద్వారా పైకి గాలి స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల... ఆ గాలి ధాటికి.. నీరు పైకి తన్నుతుంది. అందుకే, నీరు కిందకు వెళ్లకుండా పైకి వస్తూ ఉంటుంది.

33
ఈ జలపాతం గురించి మరి కొన్ని ఆసక్తికర విషయాలు...
Image Credit : Gemini ai

ఈ జలపాతం గురించి మరి కొన్ని ఆసక్తికర విషయాలు...

వర్షాకాలంలోనే ఈ అద్భుతం: ఏడాది పొడవునా ఈ వింత చూడలేము. కేవలం వర్షాకాలంలో, గాలుల వేగం ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రమే ఈ 'రివర్స్ వాటర్‌ఫాల్' దృశ్యం మనకు కనపడుతుంది.

భారత్‌లోనే ఏకైక ప్రాంతం కాదు: భారతదేశంలో నానేఘాట్‌తో పాటు మహారాష్ట్రలోని సంధాన్ వ్యాలీ, సతారా ప్రాంతాల్లో, లడఖ్‌లోని కొన్ని లోయల్లో కూడా వర్షాకాలంలో ఇలాంటి దృశ్యాలు అరుదుగా కనిపిస్తాయి.

ట్రెక్కింగ్ లవర్స్ పారడైజ్: చారిత్రాత్మకంగా నానేఘాట్ శాతవాహనుల కాలం నాటి ముఖ్యమైన వ్యాపార మార్గం. ప్రస్తుతం ఈ వింత జలపాతాన్ని చూడటానికి వర్షాకాలంలో వేలాది మంది పర్యాటకులు, ట్రైకర్లు ఇక్కడికి వస్తుంటారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image2
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. ఈ 4 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన పని!
Related Stories
Recommended image1
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
Recommended image2
Train: సీటు వెతుక్కుని కూర్చొనేలోపే స్టేషన్ వచ్చేస్తుంది.. మన దేశంలో అతి చిన్న రైలు ప్రయాణం..ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved