MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సాయంత్రం స్నాక్స్ కు బదులు ఈ గింజలు తినండి

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సాయంత్రం స్నాక్స్ కు బదులు ఈ గింజలు తినండి

బరువు తగ్గడం అనుకున్నంత సులువు కాదు. కానీ కొన్ని టిప్స్ ను ఫాలో అయితే మాత్రం పక్కాగా బరువు తగ్గొచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని గింజలు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 22 2022, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
weight loss

weight loss


బరువు పెరగడం సులువే. కానీ తగ్గడం అంత ఈజీ కాదు. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. కొన్ని ఆహార నియమాలను పాటిస్తే మాత్రం బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలంటే ఆయిలీ ఫుడ్స్ ను, ఫాస్ట్ ఫుడ్ ను, జంక్ ఫుడ్ ను తినకూడదు. వీటితో పాటుగా బరువు తగ్గేందుకు సహాయపడే కొన్ని ఆహారాలను రోజూ తినాల్సి ఉంటుంది. ఇందులో నట్స్ కూడా ఉన్నాయి. సాయంత్రం స్నాక్స్ కు బదులుగా కొన్ని నట్స్ ను తింటే సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
almond

almond

బాదం పప్పులు

ఈ జాబితాలో బాదం పప్పులను ముందుంటాయి. బాదం పప్పుల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. అలాగే దీనిలో కాల్షియం, ఐరన్,  కొవ్వు ఆమ్లాలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బాదం పప్పులు శరీరంలో హెచ్ డిఎల్ (మంచి కొలెస్ట్రాల్ ) కొలెస్ట్రాల్ ను పెంచి ఎల్ డిఎల్ (చెడు) కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. బాదంపప్పులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు. బాదం పప్పులు మీ శరీరానికి శక్తిని కూడా అందిస్తాయి. ఇవి మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. దీంతో మీరు అతిగా తినలేరు. దీనివల్ల బరువు తగ్గడం సులువు అవుతుంది.

34

పిస్తా పప్పులు

ఫైబర్ అధికంగా ఉండే పిస్తాపప్పులు బరువు తగ్గాలనుకునే వారు తినగలిగే ఉత్తమ గింజల్లో ఒకటి. పిస్తాల్లో కాల్షియం, ఐరన్, జింక్ లు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటుగా విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్  కె, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి విటమిన్లు కూడా ఇందులో ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పిస్తాపప్పులు కూడా జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. 100 గ్రాముల పిస్తాలో 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పిస్తాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఎలాంటి భయాలు పెట్టుకోకుండా తినొచ్చు. 
 

44

వాల్ నట్స్

బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ గుప్పెడు వాల్ నట్స్ తినడం మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే వాల్ నట్స్ లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వాల్ నట్స్ ఆకలిని నియంత్రిస్తాయి. దీంతో మీరు అతిగా తిని బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. ఈ గింజలు మంచి కొలెస్ట్రాల్ ను కూడా పెంచుతాయి. దీంతో ఆటోమెటిక్ గా  శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ప్రతిరోజూ గుప్పెడు వాల్ నట్స్ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Shelves: అల్యూమినియం ఫాయిల్‌తో వంటగది షెల్ఫ్‌లను క్లీన్ గా ఉండే చిట్కాలు
Recommended image2
Chitti Mutyalu Mutton Pulav: వీకెండ్ సెట్ చేసే టాప్ నాచ్ మటన్ పులావ్..
Recommended image3
Cockroaches: ఇంట్లో బొద్దింకలు తిరుగుతున్నాయా? ఇదొక్కటి చేస్తే.. మళ్లీ ఇంట్లో బొద్దింకలు తిరగవు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved