MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Vaseline Cleaning Hacks: ఆల్ ఇన్ వన్ సొల్యూషన్..ఎంతటి పాత వస్తువునైనా నిమిషాల్లో మెరిసిపించేస్తుంది

Vaseline Cleaning Hacks: ఆల్ ఇన్ వన్ సొల్యూషన్..ఎంతటి పాత వస్తువునైనా నిమిషాల్లో మెరిసిపించేస్తుంది

Vaseline Cleaning Hacks: వ్యాజిలిన్ చర్మానికే కాదు..ఇంట్లో వస్తువులను మెరిపించేస్తుంది, తలుపులకు చెద, కిచెన్ జిడ్డుగా ఉందని టెన్షన్ పడుతున్నారా? ఎక్కువ ఆలోచించకండి. కెమికల్స్ అవసరం లేదు. కాస్త వేడి నీళ్లు, వ్యాజిలిన్ ఉంటే చాలు.. ఇల్లు తళతళలాడుతుంది.

1 Min read
Author : Nandini Arava
Published : Sep 17 2026, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఆల్ ఇన్ వన్ సొల్యూషన్
Image Credit : Getty

ఆల్ ఇన్ వన్ సొల్యూషన్

పాత చెక్క తలుపులు, జిడ్డు పట్టిన కిచెన్ క్యాబినెట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, లెదర్ బ్యాగులను క్లీన్ చేయడానికి ఖరీదైన కెమికల్స్ కొనక్కర్లేదు. చలికాలంలో పెదాలకు రాసుకునే 'వ్యాజిలిన్' చాలు.సూపర్ ఆల్-ఇన్-వన్ క్లీనింగ్ లిక్విడ్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
మ్యాజిక్ లిక్విడ్ తయారీ విధానం
Image Credit : gemini ai

మ్యాజిక్ లిక్విడ్ తయారీ విధానం

ఒక గిన్నెలో బాగా మరిగిన వేడి నీళ్లను తీసుకోండి. అందులో పావు చెంచా (1/4 స్పూన్) వ్యాజిలిన్ వేసి బాగా కరిగించండి. ఆ నీళ్లను చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక శుభ్రమైన కాటన్ బట్టను ఆ నీళ్లలో ముంచి, నీళ్లు లేకుండా గట్టిగా పిండేయండి. ఈ లిక్విడ్‌తో ఏమేం క్లీన్ చేయొచ్చో తెలుసా?

37
గ్యాస్ స్టవ్ తుప్పు పట్టదు
Image Credit : AI

గ్యాస్ స్టవ్ తుప్పు పట్టదు

గ్యాస్ పొయ్యి, స్టవ్ రింగులను దీంతో క్లీన్ చేస్తే జిడ్డు వదలడమే కాదు.. ఆ రింగులు తుప్పు (Rust) పట్టకుండా ఉంటాయి.

47
చెక్క తలుపులకు కొత్త మెరుపు
Image Credit : gemini ai

చెక్క తలుపులకు కొత్త మెరుపు

దుమ్ము పట్టి కళావిహీనంగా మారిన చెక్క తలుపులను ఈ బట్టతో తుడిస్తే చాలు. వెంటనే వార్నిష్ లేదా పాలిష్ చేసినట్లుగా కొత్తగా మెరిసిపోతాయి.

57
జిడ్డు పట్టిన కిచెన్ క్యాబినెట్లు
Image Credit : Freepik

జిడ్డు పట్టిన కిచెన్ క్యాబినెట్లు

కిచెన్ క్యాబినెట్ డోర్లు, డ్రాయర్ల మీద ఉండే వంట జిడ్డు, నూనె మరకలను ఈ లిక్విడ్ క్షణాల్లో మాయం చేస్తుంది. వాటికి సరికొత్త లుక్ ఇస్తుంది. దీని వాసనకు వంటగది దరిదాపుల్లోకి బొద్దింకలు రావు.

67
మిక్సీ, ఫ్రిడ్జ్, ఇతర వస్తువులు
Image Credit : Instagram

మిక్సీ, ఫ్రిడ్జ్, ఇతర వస్తువులు

ఫ్రిడ్జ్, మిక్సీ గ్రైండర్ లేదా డిష్ వాషర్లను తుడవడానికి ఖరీదైన క్లీనర్లు వద్దు. ఈ బట్టతో తుడిస్తే అవి తళతళా మెరుస్తాయి.

ఇంకా మురికి పట్టిన స్విచ్ బోర్డులు, నల్లగా మారిన స్విచ్ బోర్డులను ఈ బట్టతో సున్నితంగా తుడిస్తే చాలు, వెంటనే కొత్తవాటిలా క్లీన్ అవుతాయి.

77
లెదర్ బ్యాగులు, సూట్‌కేసులు
Image Credit : pixabay

లెదర్ బ్యాగులు, సూట్‌కేసులు

దుమ్ము పట్టిన లెదర్ హ్యాండ్ బ్యాగులు, సూట్‌కేసులు, ట్రావెల్ బ్యాగులను దీంతో తుడిస్తే వాటి చర్మం పాడవదు. పైగా పాత మెరుపు తిరిగి వస్తుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Banana: రాత్రిపూట అరటి పండు తింటే ఏమౌతుంది? నిజంగా బరువు పెరుగుతారా?
Recommended image2
Kitchen Hacks: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదా? చేస్తే ఏమవుతుంది?
Recommended image3
Bread Idli: పప్పు నానబెట్టక్కర్లేదు.. పిండి రుబ్బక్కర్లేదు.. నిమిషాల్లో బ్రెడ్‌ ఇడ్లీ రెడీ!
Related Stories
Recommended image1
Curd: ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పాడవ్వదని తింటున్నారా? మీరు మాత్రం ఈ తప్పు చేయకండి
Recommended image2
Garlic Naan Recipe: మెత్తగా, బటర్ ఫ్లేవర్‌తో గార్లిక్ నాన్..నోట్లో వేసుకోగానే దూదిలా కరిగిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved