MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Train: వీసా, పాస్ పోర్టు లేకుండా ఈ రైలు ఎక్కనివ్వరు.. మన దేశంలోనే విచిత్రమైన రైల్వే స్టేషన్ ఇది..!

Train: వీసా, పాస్ పోర్టు లేకుండా ఈ రైలు ఎక్కనివ్వరు.. మన దేశంలోనే విచిత్రమైన రైల్వే స్టేషన్ ఇది..!

Train: విమానంలో విదేశీ ప్రయాణం చేయాలంటే మనకు వీసా, పాస్ పోర్టు కావాలి. కానీ, మన దేశంలో తిరిగే రైలు ఎక్కడానికి కూడా వీసా, పాస్ పోర్టు అవసరమయ్యే రైలు ప్రయాణం ఒకటి ఉందని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 14 2026, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వింత రైల్వే స్టేషన్..
Image Credit : Gemini ai

వింత రైల్వే స్టేషన్..

మన దేశంలో రైలు ప్రయాణం చేయాలంటే సాధారణంగా జనరల్ రైలు టికెట్ లేదా, రిజర్వేషన్ టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ, భారత దేశంలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ కి వెళ్లాలన్నా.. అక్కడ రైలు ఎక్కాలన్నా కచ్చితంగా.. పాస్ పోర్టు, వీసా ఉండాల్సిందే. మన దేశంలో లోపల విమాన ప్రయాణం చేయడానికి కూడా వీసా, పాస్ పోర్టు అవసరం లేదు. కేవలం, విదేశీ ప్రయాణం చేయాలంటేనే మనకు ఇవి కావాలి.. అలాంటిది.. మరి, రైల్వే స్టేషన్ లో అడుగుపెట్టడానికి కూడా వీసా, పాస్ పోర్టు అడిగే స్టేషన్ ఎక్కడ ఉంది? అక్కడ ఆ రూల్ ఎందుకు ఉంది? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏమిటా స్టేషన్? ఎక్కడుంది?
Image Credit : X

ఏమిటా స్టేషన్? ఎక్కడుంది?

ఈ ప్రత్యేకమైన విధివిధానాలు ఉన్న ప్రదేశమే పంజాబ్ రాష్ట్రంలో, భారత్-పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న 'అట్టారీ శ్రీ గురు రామ్‌దాస్ జీ రైల్వే స్టేషన్' (Attari Railway Station). భారత్, పాకిస్తాన్ మధ్య నడిచే చారిత్రాత్మక 'సమ్‌జౌతా ఎక్స్‌ప్రెస్' రైలు ఇది. ఈ రెండు దేశాలు కనెక్ట్ అయ్యి ఉండే రైలు ఇది.

33
ఎందుకీ కఠినమైన నిబంధనలు?
Image Credit : Gemini ai

ఎందుకీ కఠినమైన నిబంధనలు?

పాస్‌పోర్ట్, వీసా తప్పనిసరి: సాధారణంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉండే రక్షణ, తనిఖీ వ్యవస్థలు ఈ రైల్వే స్టేషన్‌లో ఉంటాయి. సరిహద్దు దాటి ప్రయాణించే రైలు కావడంతో, ప్రయాణికుల వద్ద కచ్చితంగా పాస్‌పోర్ట్ , వీసా ఉంటేనే స్టేషన్ పరిసరాలోనికి అనుమతిస్తారు.

కేవలం పాకిస్తానీయులకు మాత్రమే ఈ రూల్ ఉంటుంది అనుకుంటే పొరపాటే. భారతీయులకు కూడా కఠిన నిబంధనలు ఉంటాయి. మన దేశ పౌరులు కూడా ఎటువంటి అనుమతి పత్రాలు లేదా ముందస్తు పోలీస్ పర్మిషన్ లేకుండా ఈ స్టేషన్ ప్రాంగణంలోకి అడుగుపెడితే చట్టరీత్యా తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలా అక్రమంగా ప్రవేశిస్తే వారిపై 14 ఫారినర్స్ యాక్ట్ కింద కేసు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది.

కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ చెకింగ్: స్టేషన్ లోపలే కస్టమ్స్ క్లియరెన్స్, ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు ఉంటాయి. ప్రయాణికులు రైలు ఎక్కడానికి ముందే వారి బ్యాగులను, పత్రాలను కఠినంగా తనిఖీ చేస్తారు.

అత్యంత కట్టుదిట్టమైన సరిహద్దు భద్రతా బలగాల (BSF) పర్యవేక్షణలో ఉండే ఈ అట్టారీ రైల్వే స్టేషన్ ప్రయాణం, భారతీయ రైల్వే చరిత్రలోనే ఒక విచిత్రమైన, అరుదైన అనుభూతిగా నిలిచిపోతుంది!

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026 Telugu Wishes: వినాయక చవితికి మీ స్నేహితులకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి
Recommended image2
Gold Rings: 1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు
Recommended image3
Stone Anklets: కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి
Related Stories
Recommended image1
Train: ఒక్క స్టేషన్ లో కూడా ఆగకుండా..528 కిలో మీటర్లు ప్రయాణించే నాన్ స్టాప్ రైలు..!
Recommended image2
Train: సీటు వెతుక్కుని కూర్చొనేలోపే స్టేషన్ వచ్చేస్తుంది.. మన దేశంలో అతి చిన్న రైలు ప్రయాణం..ఎక్కడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved