MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Train: సీటు వెతుక్కుని కూర్చొనేలోపే స్టేషన్ వచ్చేస్తుంది.. మన దేశంలో అతి చిన్న రైలు ప్రయాణం..ఎక్కడో తెలుసా?

Train: సీటు వెతుక్కుని కూర్చొనేలోపే స్టేషన్ వచ్చేస్తుంది.. మన దేశంలో అతి చిన్న రైలు ప్రయాణం..ఎక్కడో తెలుసా?

Train: రైలు ఎక్కి, మన సీటు నెంబర్ ఎక్కడ ఉందా అని చూసుకొని.. జస్ట్ అలా కూర్చున్నామో లేదో.. మనం దిగే స్టేషన్ వచ్చేస్తుంది. కేవలం 7 నిమిషాల్లో రైలు ప్రయాణం ముగుస్తుంది. ఇది ఎక్కడో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 13 2026, 12:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Train Journey
Image Credit : Geminiai

Train Journey

మన దేశంలో ఎక్కువ మంది ఇష్టపడే ప్రయాణాల్లో రైలు ప్రయాణం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. లాంగ్ జర్నీ చేయాలి అంటే చాలు.. ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటారు. అంతేకాదు.. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లాలన్నా.. రైలు ఎక్కుతాం. అసలు.. మన దేశంలో రైలు ప్రయాణం అంటేనే లాంగ్ జర్నీ, గంటల కొద్దీ ముచ్చట్లు, బోగీల్లో తినుబండారాలే గుర్తుకు వస్తాయి. కొన్ని రైలు ప్రయాణాలు అయితే రోజుల పాటు సాగుతాయి. కానీ, మనం సరిగ్గా ట్రైన్ లో కూర్చొనే లేపే దిగాల్సిన స్టేషన్ వస్తే..? ఒక పాట వినేలోగా రైలు దిగాల్సి వస్తే..? ఇలాంటి వింత ప్రయాణం మన దేశంలో కూడా ఉంది. కేవలం 3 కిలోమీటర్ల దూరం, 7 నిమిషాల సమయంలో ముగిసే రైలు ప్రయాణం సాగుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మన దేశంలోనే అతి చిన్న రైలు ప్రయాణం ఎక్కడంటే...
Image Credit : Geminiai

మన దేశంలోనే అతి చిన్న రైలు ప్రయాణం ఎక్కడంటే...

ఈ అతి చిన్న రైలు ప్రయాణం మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉంది. నాగ్ పూర్ జంక్షన్ నుంచి అజ్నీ వరకు సాగుతుంది. ఈ రైలు ప్రయాణం కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే సాగుతుంది. సాధారణంగా 7 నుంచి 9 నిమిషాలు మాత్రమే ఈ రైలు ప్రయాణిస్తుంది. 1853లో ప్రారంభమైన భారతదేశపు మొదటి ప్రయాణికుల రైలు బొంబాయి నుంచి థానే వరకు 34 కిలో మీటర్లు సాగింది. అప్పట్లో ఇదే అతి చిన్న ప్రయాణం అనుకునేవారు. కానీ, నాగ్ పూర్- అజ్నీ రూట్ అంతకంటే 10 రెట్లు చిన్నదిగా రికార్డు సృష్టించింది.

Related Articles

Related image1
Skeleton Lake : ఈ నదిలో కుప్పలు తెప్పలుగా మానవ అస్థిపంజరాలు.. ఎవరివి ఇవన్నీ..?
Related image2
Most Expensive Plant: బంగారం కంటే ఖరీదైన మొక్క ఇది, ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
33
కేవలం 3 కిలోమీటర్ల కే రైలు ఎవరు ఎక్కుతున్నారు..?
Image Credit : gemini

కేవలం 3 కిలోమీటర్ల కే రైలు ఎవరు ఎక్కుతున్నారు..?

కేవలం 3 కిలో మీటర్ల దూరం కోసం అసలు ఎవరు రైలు ఎక్కుతారు అనుకోవచ్చు. కానీ, అక్కడ నివసించే వేలాది మంది ప్రతిరోజూ ఈ రైలు ఎక్కుతూనే ఉంటారు. నాగ్ పూర్ నగరంలో ఉద్యోగాలు, కాలేజీలు, ఇతర వ్యాపారాల కోసం వెళ్లేవారు ఈ రైలు ప్రయాణం చేస్తూనే ఉంటారు. రోడ్డు ప్రయాణం చాలా రద్దీగా ఉంటుందని, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని.. ఈ రైలు ప్రయాణాన్ని వారు ఎంచుకుంటారు. కేవలం 7 నిమిషాల్లో తమ డెస్టినేషన్ చేరుకుంటామని.. వీరు ఈ రైలు ఎక్కుతూ ఉంటారు.

ఈ రైలు ప్రయాణం టికెట్ ధర ఎంతంటే...

ఈ అత్యంత తక్కువ రైలు ప్రయాణం టికెట్ ధరలు వింటే మాత్రం షాక్ అయిపోతారు. ప్రయాణం చిన్నగా ఉన్నా.. టికెట్ ధర మాత్రం ఎక్కువగానే ఉంటుంది.

జనరల్ క్లాస్: ₹60

స్లీపర్ క్లాస్: ₹145 నుండి ₹175 వరకు

AC 3-టైర్: ₹555

AC 2-టైర్: ₹760

AC 1st క్లాస్: ₹1,255

అంటే... కేవలం 7 నిమిషాల ప్రయాణానికి రూ.1255 ఖర్చు పెట్టేవారు కూడా ఉన్నారు అని అర్థం. లాంగ్ జర్నీలకు మారుపేరుగా మన భారత రైల్వేలో.. ఈ అత్యంత షార్ట్ జర్నీ కూడా ఉండటం విశేషం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Rings: రూ.1000 లోపు అద్భుత డిజైన్లలో వెండి ఉంగరాలు
Recommended image2
Salt: ఉప్పు వంట కోసమే కాదు.. ఇంట్లో ఉన్న సమస్యలను కూడా పోగొడుతుందట
Recommended image3
Curry Leaves: రోజూ ఈ ఒక్క ఆకు తిన్నా చాలు.. ఎన్ని లాభాలో?
Related Stories
Recommended image1
Skeleton Lake : ఈ నదిలో కుప్పలు తెప్పలుగా మానవ అస్థిపంజరాలు.. ఎవరివి ఇవన్నీ..?
Recommended image2
Most Expensive Plant: బంగారం కంటే ఖరీదైన మొక్క ఇది, ఎక్కడ దొరుకుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved