MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Post Office: నీటిపై తేలే పోస్టాఫీస్.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?

Post Office: నీటిపై తేలే పోస్టాఫీస్.. మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా?

Post Office: ఇప్పటి వరకు మీరు చాలా పోస్టు ఆఫీసులు చూసి ఉంటారు.. కానీ, నీటిపై తేలాడే పోస్ట్ ఆఫీస్ చూశారా? మన దేశంలో అది ఎక్కడ ఉందో తెలుసా? అసలు.. దీనిని ఎవరు వాడుతున్నారు?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 21 2026, 05:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Floating Post Office
Image Credit : geminiai

Floating Post Office

మన దేశంలో 'పోస్టాఫీసు' అనగానే మైండ్ లోకి ఒక పాత భవనం, ఎర్రటి పోస్ట్‌బాక్స్, లేఖలను సార్ట్ చేసే ఉద్యోగులు గుర్తుకొస్తారు. కానీ, చుట్టూ నీళ్ళు, వెనక మంచు కొండల నడుమ హౌస్‌బోట్‌లో నీటిపై తేలియాడే పోస్టాఫీసును ఎప్పుడైనా చూశారా?

ఇది ఏదో సినిమా దృశ్యం లేదా ఊహాజనిత కథ కాదు! జమ్మూకశ్మీర్‌లోని ప్రసిద్ధ శ్రీనగర్ డల్ లేక్‌పై నిజంగానే ఒక 'ఫ్లోటింగ్ పోస్టాఫీస్' (Floating Post Office) అందుబాటులో ఉంది. ఇప్పటికీ సజావుగా పనిచేస్తూ పర్యాటకులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ పోస్టాఫీసు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథేంటో చూద్దాం:

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అసలు ఎక్కడ ఉంది?
Image Credit : geminiai

అసలు ఎక్కడ ఉంది?

శ్రీనగర్‌లోని ప్రసిద్ధ డల్ లేక్, నెహ్రూ పార్క్ సమీపంలో ఈ వినూత్న పోస్టాఫీస్ ఉంది. బయటి నుంచి చూస్తే ఇది కాశ్మీర్‌లో కనిపించే ఒక సాధారణ సంప్రదాయ హౌస్‌బోట్‌లాగే కనిపిస్తుంది. కానీ, కాస్త దగ్గరగా వెళితే మన 'ఇండియా పోస్ట్' (India Post) పేరు, లోగోలు స్పష్టంగా కనిపిస్తాయి.

ఇది కేవలం పర్యాటకులు వచ్చి ఫొటోలు దిగడానికి పెట్టిన షోపీస్ అనుకుంటే పొరపాటే. సాధారణ పోస్టాఫీసులాగే ఇక్కడ కూడా ఉత్తరాలు, పార్సిళ్లు, పోస్టుకార్డులు పంపవచ్చు.

డల్ లేక్ చుట్టూ ఉండే బోట్ నిర్వాహకులు, వ్యాపారులు, స్థానికులు, పర్యాటకులు రోజూ ఈ సేవలను వాడుకుంటారు.

ప్రత్యేక ముద్ర (Special Stamp): ఇక్కడి నుండి పంపే ప్రతీ పోస్టుకార్డుపై డల్ లేక్ ,షికారా పడవ చిత్రం ఉన్న ప్రత్యేకమైన పోస్టల్ క్యాన్సిలేషన్ స్టాంప్ వేస్తారు. అందుకే పర్యాటకులు కాశ్మీర్ జ్ఞాపకార్థం తమ ప్రియమైన వారికి ఇక్కడి నుంచే ఉత్తరాలు రాస్తుంటారు.

పోస్టులు గమ్యస్థానాలకు ఎలా చేరతాయి?

ఈ పోస్టాఫీసు సిబ్బంది ప్రతిరోజూ సేకరణ చేసిన పోస్టులను సేకరించి శ్రీనగర్‌లోని ప్రధాన కార్యాలయానికి చేరవేస్తారు. అక్కడ నుంచి అవి ఇతర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. అవసరమైతే ఇండియా పోస్ట్ సిబ్బంది స్వయంగా 'షికారా' పడవల్లో వెళ్ళి నీటిపై ఉండే హౌస్‌బోట్లలోని వారికి ఉత్తరాలను డెలివరీ చేస్తారు.

Related Articles

Related image1
Capital: ఒకే నగరం.. రెండు రాష్ట్రాలకు రాజధానిలా ఎలా మారింది? ఈ నగరం స్పెషాలిటీ ఏంటి?
Related image2
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
33
70 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ చరిత్ర..
Image Credit : geminiai

70 ఏళ్లకు పైబడిన సుదీర్ఘ చరిత్ర..

చాలామంది ఈ ఫ్లోటింగ్ పోస్టాఫీస్ 2011లోనే ప్రారంభమైందని అనుకుంటారు. కానీ, 2011లో జరిగింది కేవలం దాని పునరుద్ధరణ (Renovation) మాత్రమే. రికార్డుల ప్రకారం.. 1953లోనే డల్ లేక్ , జీలం నదిపై హౌస్‌బోట్లలో నివసించే ప్రజల కోసం 'ఫ్లోటింగ్ మొబైల్ పోస్టాఫీస్' సేవలు అందుబాటులోకి వచ్చాయి.

1954 నాటికే శ్రీనగర్‌లో ఇటువంటి తేలియాడే పోస్టాఫీసులు మూడు ఉండేవి. అంటే నీటిపై పోస్టల్ సేవలను అందించే ఆలోచనకు ఏకంగా 70 ఏళ్లకు పైగా ఘన చరిత్ర ఉంది.

ఈ హౌస్‌బోట్‌ కేవలం పోస్టాఫీసుగా మాత్రమే కాక, ఒక 'ఫిలాటెలిక్ మ్యూజియం' (Philatelic Museum) గా కూడా సేవలందిస్తోంది. కశ్మీర్ చరిత్రకు సంబంధించిన అరుదైన పాత విక్రయ స్టాంపులు, ప్రత్యేక పోస్టల్ సామగ్రిని పర్యాటకులు ఇక్కడ సందర్శించవచ్చు.

2014లో జమ్మూ కశ్మీర్‌ను ముంచెత్తిన భారీ వరదలకు ఈ ఫ్లోటింగ్ హౌస్‌బోట్ దెబ్బతింది. కానీ, అధికారులు దీని ప్రాముఖ్యతను గుర్తించి మళ్ళీ అత్యంత వైభవంగా పునరుద్ధరించి పూర్వవైభవాన్ని తీసుకువచ్చారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Coconut Water: కొబ్బరి నీళ్లు రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!
Related Stories
Recommended image1
Capital: ఒకే నగరం.. రెండు రాష్ట్రాలకు రాజధానిలా ఎలా మారింది? ఈ నగరం స్పెషాలిటీ ఏంటి?
Recommended image2
River: మన దేశంలో వెనక్కి ప్రవహించే ఏకైక నది ఏది? ఇది ఎలా సాధ్యం..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved