MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Skincare Tips: ముఖం ఎప్పుడూ అందంగా ఉండాలంటే ఉదయం ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

Skincare Tips: ముఖం ఎప్పుడూ అందంగా ఉండాలంటే ఉదయం ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

Skincare Tips: ముఖం అందంగా, కాంతివంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు చర్మానికి ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా ఉదయం పూట అస్సలు చేయకూడని ముఖ్యమైన తప్పుల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 21 2026, 05:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
స్కిన్ కేర్ లో చేయకూడని తప్పులు
Image Credit : Getty

స్కిన్ కేర్ లో చేయకూడని తప్పులు

ఉదయం లేవగానే ముఖం కడుక్కొని, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ రాసుకోవడం చాలామందికి అలవాటు. అయితే సరైన ప్రొడక్ట్స్ వాడటమే కాదు, వాటిని ఎలా వాడుతున్నామన్నది కూడా ముఖ్యమే. తప్పుడు పద్ధతులు చర్మం సహజ రక్షణ పొరను దెబ్బతీస్తాయి. ముఖ్యంగా ఉదయం పూట స్కిన్ కేర్ విషయంలో చేయకూడని తప్పులేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ముఖాన్ని ఎక్కువగా కడగడం
Image Credit : Getty

ముఖాన్ని ఎక్కువగా కడగడం

ముఖం శుభ్రంగా ఉండాలని పదేపదే కడగడం మంచిది కాదు. ఇలా ఎక్కువగా కడగడం వల్ల చర్మంలోని సహజ నూనెలు పోయి, చర్మం పొడిబారిపోతుంది, దురద వస్తుంది. ఉదయాన్నే సున్నితమైన క్లెన్సర్‌తో కడిగితే సరిపోతుంది. ముఖ్యంగా పొడి చర్మం, సెన్సిటివ్ చర్మం ఉన్నవాళ్లు గాఢమైన క్లెన్సర్లకు దూరంగా ఉండాలి.
38
మాయిశ్చరైజర్‌ వాడకపోవడం
Image Credit : Getty

మాయిశ్చరైజర్‌ వాడకపోవడం

జిడ్డు చర్మం ఉన్నవాళ్లకు మాయిశ్చరైజర్ అవసరం లేదని చాలామంది అనుకుంటారు. కానీ జిడ్డు చర్మానికి కూడా తేమ అవసరం. చిక్కటి క్రీములకు బదులుగా, మీ చర్మానికి సరిపోయే లైట్‌వెయిట్ లేదా జెల్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవచ్చు.

48
సన్‌స్క్రీన్‌ వాడకపోవడం
Image Credit : Getty

సన్‌స్క్రీన్‌ వాడకపోవడం

ఎండ ఎక్కువగా ఉన్నప్పుడే సన్‌స్క్రీన్ వాడాలని చాలామంది అనుకుంటారు. కానీ, రోజూవారీ స్కిన్‌కేర్‌లో సన్‌స్క్రీన్ చాలా ముఖ్యమైంది. బయటకు వెళ్లినప్పుడే కాదు, రోజూ వాడేలా మీ చర్మానికి సరిపోయే సన్‌స్క్రీన్‌ను ఎంచుకోవడం మంచిది. అలాగే ఎక్కువసేపు బయట ఉండాల్సి వస్తే, సన్‌స్క్రీన్‌ను తగినంతగా అప్లై చేయడం, అవసరాన్ని బట్టి మళ్లీ అప్లై చేసుకోవడం కూడా ముఖ్యం.

58
ఒకేసారి ఎక్కువ ప్రొడక్ట్స్ వాడటం
Image Credit : Getty

ఒకేసారి ఎక్కువ ప్రొడక్ట్స్ వాడటం

త్వరగా మంచి ఫలితాలు రావాలని చాలామంది రకరకాల సీరమ్‌లు, యాక్టివ్ ప్రొడక్ట్స్‌ను ఒకేసారి వాడేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఇరిటేషన్, పొడిబారడం లేదా ఎర్రబడటం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా రెటినాయిడ్లు, యాసిడ్స్ వంటి బలమైన యాక్టివ్ పదార్థాలు ఉన్న ప్రొడక్ట్స్‌ను ఉపయోగించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా ఏదైనా స్కిన్‌కేర్ ప్రొడక్ట్‌ను ప్రారంభించినప్పుడు, ఒకేసారి చాలా ఉత్పత్తులు ఉపయోగించకుండా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వాడటం మంచిది. ఇలా చేస్తే ఏ ప్రొడక్ట్‌ వల్ల చర్మానికి ఇబ్బంది కలుగుతుందో కూడా సులభంగా గుర్తించవచ్చు.

68
తరచుగా ఎక్స్‌ఫోలియేట్ చేయడం
Image Credit : Getty

తరచుగా ఎక్స్‌ఫోలియేట్ చేయడం

మృత కణాలను తొలగించడానికి ఎక్స్‌ఫోలియేషన్ కొందరికి ఉపయోగపడుతుంది. కానీ రోజూ లేదా తరచుగా స్క్రబ్ చేయడం చర్మం బయటి రక్షణ పొరను దెబ్బతీస్తుంది. మీ చర్మ తత్వాన్ని, వాడే ప్రొడక్ట్‌ను బట్టి ఎక్స్‌ఫోలియేట్ ఎలా చేయాలో నిర్ణయించుకోవాలి.

78
సరైన ప్రొడక్ట్స్ ఎంచుకోకపోవడం
Image Credit : Getty

సరైన ప్రొడక్ట్స్ ఎంచుకోకపోవడం

అందరికీ ఒకేరకమైన స్కిన్‌కేర్ ప్రొడక్ట్స్ సరిపోవు. పొడి చర్మం, జిడ్డు చర్మం, సెన్సిటివ్ చర్మం.. ఇలా ఒక్కొక్కరి అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే, ఇతరులు వాడుతున్నారని గుడ్డిగా ఫాలో అవ్వకుండా, మన చర్మ తత్వాన్ని అర్థం చేసుకొని ప్రొడక్ట్స్ ఎంచుకోవడం ఉత్తమం.

88
సాధారణ స్కిన్‌కేర్
Image Credit : Getty

సాధారణ స్కిన్‌కేర్

ఉదయం పూట స్కిన్‌కేర్ రొటీన్ మరీ క్లిష్టంగా ఉండాల్సిన అవసరం లేదు. సున్నితమైన క్లెన్సర్, చర్మానికి సరిపోయే మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్.. ఈ మూడింటినీ సరిగ్గా వాడితే చాలు. అవసరాన్ని బట్టి మాత్రమే అదనపు సీరమ్‌లు లేదా ఇతర ప్రొడక్ట్స్ వాడటం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: జస్ట్ 3 గ్రాముల్లోనే వచ్చే బంగారు చెవిపోగులు
Recommended image2
Amla: రోజుకో ఉసిరికాయ తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
Recommended image3
Silver Benefits: చిన్నారులకు వెండి వస్తువులు వేయడం వల్ల ఇన్ని లాభాలా?
Related Stories
Recommended image1
Chanakya Niti: చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తి ఈ 5 విషయాలను ఎవరికీ చెప్పడు!
Recommended image2
Parenting: మగపిల్లలు తండ్రిని చూసి నేర్చుకునే 5 ముఖ్యమైన విషయాలు ఇవే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved