MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: పసిఫిక్ లో 2 తుపాన్లు.. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అలర్ట్

Weather Update: పసిఫిక్ లో 2 తుపాన్లు.. ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు అలర్ట్

Weather Update: పసిఫిక్ మహాసముద్రంలో రెండు తుపాన్లు ఒకేసారి ఏర్పడటంతో పాటు, ఇటు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తోడుకావడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తీవ్రమయ్యే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. పలు ప్రాంతాలకు అలర్ట్ కొనసాగుతోంది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 21 2026, 08:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ అలర్ట్: ఈ జిల్లాల్లో పిడుగులు, 50 కిమీ వేగంతో ఈదురు గాలులు.. బయటకు వస్తే రిస్కే
Image Credit : Gemini AI

బిగ్ అలర్ట్: ఈ జిల్లాల్లో పిడుగులు, 50 కిమీ వేగంతో ఈదురు గాలులు.. బయటకు వస్తే రిస్కే

ప్రపంచవ్యాప్తంగా వాతావరణ వ్యవస్థలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ఎల్ నినో సగటున 30 శాతం వరకు బలపడటంతో సముద్రాల ఉపరితల జలాలు విపరీతంగా వేడెక్కుతున్నాయి. ప్రస్తుతానికి పసిఫిక్ మహాసముద్రంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న 'లాలా' (Lala) తుపాను, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న 'సాడెల్' తుపాను భయపెడుతున్నాయి. ఇవి కాకుండా అదే పసిఫిక్ ప్రాంతంలో మరో 2 వాయుగుండాలు, 5 అల్పపీడనాలు కేంద్రీకృతమై ఉన్నాయి. సముద్రాలు వేడెక్కడం వల్ల ఏర్పడిన ఈ గ్లోబల్ పరిస్థితుల ఎఫెక్ట్ మన తెలుగు రాష్ట్రాలపైనా పడింది. నైరుతి రుతుపవనాల్లో తేమ తగ్గిపోవడంతో సాధారణ వర్షపాతం నెమ్మదించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆగస్టు 28 వరకు జల్లులు
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఆగస్టు 28 వరకు జల్లులు

గ్లోబల్ గా వేడి పెరుగుతున్నప్పటికీ, స్థానికంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు ఉపశమనం లభించనుంది. ఆగస్టు 21 నుంచి ఈ నెల 28 వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వాతావరణం మారనుంది. ఆగస్టు 21 నుంచి 26 వరకు కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ, తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) స్పష్టం చేసింది. ఇటీవలి వాయుగుండం ప్రస్తుతం మధ్యప్రదేశ్ వైపునకు బలహీనపడి వెళ్లినప్పటికీ, కొత్త అల్పపీడన ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతుంది.

Related Articles

Related image1
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Related image2
Bananas: సూపర్‌మార్కెట్‌లో 10 రోజులు ఉండే అరటిపండ్లు.. ఇంట్లో 2 రోజులకే ఎందుకు పాడవుతాయి? సీక్రెట్ హ్యాక్స్ ఇవే
35
తెలంగాణ వెదర్ అప్‌డేట్: 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Image Credit : Gemini

తెలంగాణ వెదర్ అప్‌డేట్: 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉండి, మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో జల్లులు పడే అవకాశం ఉంది. సగటు ఉష్ణోగ్రతలు 28°C నుండి 34°C మధ్య నమోదు కానున్నాయి. తేమ శాతం 46% నుండి ఉత్తర జిల్లాల్లో 60% పైగా ఉండటంతో ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గంటకు 37 కిలోమీటర్ల వేగంతో చల్లని ఈదురుగాలులు వీస్తాయి. వర్ష సూచన నేపథ్యంలో ఐఎమ్‌డీ తెలంగాణలోని 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

• ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు: ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్.

• హైదరాబాద్, ఇతర ప్రాంతాలు: హైదరాబాద్‌లో 28°C-30°C ఉష్ణోగ్రతలతో సాయంత్రం వేళల్లో తేలికపాటి జల్లులు పడతాయి. వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల్, సిద్దిపేట జిల్లాల్లో కూడా అక్కడక్కడా వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

45
ఆంధ్రప్రదేశ్ పరిస్థితి: పిడుగులు, ఈదురుగాలుల హెచ్చరిక
Image Credit : Gemini

ఆంధ్రప్రదేశ్ పరిస్థితి: పిడుగులు, ఈదురుగాలుల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం వెచ్చగా, అధిక తేమతో (46%) కూడి ఉంటుంది. పగటి ఉష్ణోగ్రతలు 33°C నుండి 36°C (తిరుపతిలో 38°C వరకు) నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 35 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. తీర ప్రాంతాల్లో భారీ అలలు వచ్చే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది.

• భారీ వర్షాలు & పిడుగుల హెచ్చరిక: పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

• మోస్తరు వర్షాలు: కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయి.

• ఇతర ప్రాంతాలు: విజయవాడ, రాయలసీమ, మిగిలిన కోస్తా జిల్లాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తాయి.

55
రైతులకు బిగ్ అలర్ట్: ఎల్ నినో ఎఫెక్ట్ తో ప్రత్యామ్నాయ సాగు బాట
Image Credit : Gemini

రైతులకు బిగ్ అలర్ట్: ఎల్ నినో ఎఫెక్ట్ తో ప్రత్యామ్నాయ సాగు బాట

అల్పపీడనాలు వస్తున్నప్పటికీ, ఎల్ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది నైరుతి రుతుపవనాల నుంచి అందాల్సిన స్థాయిలో భారీ వర్షాలు పడలేదు. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో కొత్త ఆవర్తనాలు ఏర్పడటానికి మరో వారం పైనే సమయం పట్టేలా ఉంది. ఆగస్టు నెలాఖరు వరకు అత్యత భారీ వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదు. సెప్టెంబర్‌లో ఈశాన్య రుతుపవనాలు పుంజుకుంటే తప్ప వర్షపాత లోటు భర్తీ కాదు.

భూగర్భ జలాలు అడుగంటి, సాగునీరు అందక పంటలు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో రైతులు కేవలం వర్షాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ నీటి మార్గాలను చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్షాభావ పరిస్థితులపై అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు వేసేలా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇక వర్షాలు, ఉరుములు వచ్చే సమయంలో బైక్‌లపై ప్రయాణించేవారు వేగవంతమైన గాలుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. చెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల కింద నిలబడకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు తెలిపారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Recommended image2
Now Playing
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP
Recommended image3
Now Playing
విద్యార్థుల గ్రాండ్ వెల్ కమ్ కి మంత్రి నారాలోకేష్ ఫిదా | Nara Lokesh Vizianagaram School Visite
Related Stories
Recommended image1
WTC: టీమిండియా ముందు 8 టెస్టులు.. ఫైనల్ చేరాలంటే ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
Recommended image2
Bananas: సూపర్‌మార్కెట్‌లో 10 రోజులు ఉండే అరటిపండ్లు.. ఇంట్లో 2 రోజులకే ఎందుకు పాడవుతాయి? సీక్రెట్ హ్యాక్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved