MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • గోర్లు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా తినండి..

గోర్లు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని ఖచ్చితంగా తినండి..

కొన్ని ఆహారాలు గోర్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.  గోర్ల సమస్యలను కూడా ఈ ఆహారాలు పోగొడుతాయి. ముఖ్యంగా ఇవి గోర్లు అందంగా కనిపించేలా చేస్తాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 28 2023, 10:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మన శరీరంలోని చాలా భాగాలు మన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తాయి. వీటి మాదిరిగానే మన గోర్లు కూడా మన అంతర్గత ఆరోగ్యాన్ని తెలుపుతాయన్న సంగతి మీకు తెలుసా? అందుకే గోర్లను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. చాలా మంది అప్పుడప్పుడు మానిక్యూర్ తప్ప, గోర్ల సంరక్షణ కోసం ఏమీ చేయరు. అయితే కొంతమంది ఆడవారికి, మగవారికి గోర్ల రంగు మారుతుంది. లేదా గోర్లు విరిగిపోతుంటాయి. గోర్లు మీ చర్మం, కళ్ళు, జుట్టు  మాదిరిగానే మీ ఆరోగ్య స్థితిని కూడా సూచిస్తాయి. నిలువు రేఖలు ఉన్న లేత గోర్లు రక్తహీనత లేదా పొడిబారడానికి సంకేతమంటున్నారు నిపుణులు. నీలి రంగు గోర్లు మీ రక్తంలో తగినంత ఆక్సిజన్ లేదని సూచిస్తాయి. మీ గోర్లు సన్నగా, ఎప్పుడూ విరిగిపోతే మీరు తగినంత విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లను తీసుకోవడం లేదని అర్థం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గోర్ల ఆరోగ్యాన్ని పెంచడానికి  ఎలాంటి ఆహారాలను, సప్లిపెంట్లను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గుడ్లు

గుడ్లు సంపూర్ణ ఆహారం. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ డి తోపాటుగా ప్రోటీన్లు  ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు దీనిలో విటమిన్ బి 12, ఐరన్, బయోటిన్ కంటెంట్ అధికంగా ఉంటాయి. ఇవి  గోళ్లను మందంగా చేస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. అందుకే మీ రోజువారి ఆహారంలో గుడ్లను తప్పకుండా చేర్చండి. గుడ్లు మీ మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

36
leafy vegetables

leafy vegetables

ఆకు కూరలు

ఆకుకూరల్లో కాల్షియం,  ఐరన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఆకు కూరలు పోషకాల పవర్ హౌస్. బచ్చలికూర, కాలే, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి  పెళుసైన గోళ్ళను నివారిస్తాయి. గోర్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

46

చేపలు

చేపలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. చేపల్లో ప్రోటీన్లు, సల్ఫర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి గోర్లను తేమగా ఉంచడానికి సహాయపడతాయి. చేపలు గోళ్ళ మృదుత్వాన్ని కూడా పెంచుతాయి. అంతేకాదు ఇవి సన్నని, పెలుసుగా ఉండే గోర్లను నివారిస్తాయి. చేపలు బహుముఖమైనవి. అలాగే వీటిని ఎన్నో విధాలుగా వండుకోవచ్చు. చేపల కూర నుంచి చేపల పులుసు,  డీప్ ఫ్రైడ్ వరకు ఎన్నో విధాలు వండొచ్చు. చేపలను తినడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. 
 

56
nails

nails

బ్రూవర్ ఈస్ట్, గోధుమ జెర్మ్

గోర్లు ఆరోగ్యంగా పెరిగేందుకు అవసరమైన బి-విటమిన్, జింక్ లు బ్రూవర్ ఈస్ట్, గోధుమ జెర్మ్ లో పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. బ్రూవర్ ఈస్ట్ సాకరోమైసెస్ సెరెవిసియా అని పిలువబడే ఫంగస్ ఎండిన వెర్షన్. ఈ రెండూ గోర్లను ఆరోగ్యంగా, అందంగా చేయడానికి సహాయపడతాయి. 
 

66

ఇవే కాకుండా.. శరీరంలో సిలికా, జింక్, బి విటమిన్లను శరీరంలో పెంచడానికి బయోటిన్ అధికంగా ఉండే సోయా, సోయా ఉత్పత్తులను చేర్చాలి. కెల్ప్, స్పిరులినా వంటి మూలికలను కూడా జోడించాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mosquito Prevention: ఇంట్లో దోమల గోల ఉండకూడదంటే...ఈ చిన్న ట్రిక్స్ బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి
Recommended image2
Rice Weevils: ఈ సింపుల్ టిప్స్ తో బియ్యానికి పట్టిన పురుగులు మాయం!
Recommended image3
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved