Mosquito Prevention: ఇంట్లో దోమల గోల ఉండకూడదంటే...ఈ చిన్న ట్రిక్స్ బెస్ట్ రిజల్ట్ ఇస్తాయి
Mosquito Prevention: వర్షాకాలం వస్తే చాలు ఇంట్లో దోమల బెడద. నిద్రపోయే టైంలో చెవి దగ్గర గోల, కుడితే వచ్చే దురద. అబ్బో పెద్ద నస. వాటిని తరమడానికి కాయిల్స్, ఎలక్ట్రిక్ రిపెల్లెంట్స్ వాడేస్తాం. అయితే ఇంటి పరిసరాల్లోనే ఈ జాగ్రత్తలు తీసుకుంటే దోమలు పరార్.

ఇంటి చుట్టూ నిల్వ నీరు లేకుండా చూడండి
దోమల నివారించాలంటే ఇదే చాలా ముఖ్యమైన విషయం. నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెట్టి సంతానాన్ని పెంచుకుంటాయి. ఇంటి చుట్టూ ఉన్న చిన్న నీటి గుంటలు, పూల కుండీల కింద ప్లేట్లు, పాత బకెట్లు, వాటర్ కూలర్లు, డ్రైనేజీలు, వర్షపు నీరు చేరే చోట తరచూ క్లీన్ చేసుకోవాలి. కొంచెం నీరు నిలిచినా దోమలు గుడ్లు పెట్టేస్తాయి. అందుకే కనీసం వారానికి రెండుసార్లు శుభ్రం చేయడం మంచిది.
దోమలు రాకుండా మొక్కలు
కొన్ని సువాసన వెదజల్లే మొక్కలను ఇంటి ముందు, కిటికీలు, బాల్కనీ దగ్గర ఉంచడం ద్వారా దోమలు రాకుండా చేయొచ్చు. తులసి, పుదీనా, లెమన్‌గ్రాస్, బంతి వంటి మొక్కలను ఇంటి చుట్టూ పెంచుకోవచ్చు.
సబ్బు నీటితో ట్రాప్
ఇంట్లో దోమలు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఒక చిన్న గిన్నెలో నీరు తీసుకుని కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ కలిపి ఉంచండి. వాటిపై దోమలు పడితే మళ్లీ ఎగరలేవు.
నిమ్మకాయ–లవంగం ట్రిక్
నిమ్మకాయను సగానికి కోసి అందులో కొన్ని లవంగాలను గుచ్చి కిటికీలు, టేబుల్స్ లేదా దోమలు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో పెట్టండి. నిమ్మ, లవంగాల వాసనకు దోమలు పారిపోతాయి.
ఫ్యాన్ గాలి పెంచండి
ఫ్యాన్ గాలి ఎక్కువగా ఉంటే దోమలు మనుషులపై వాలలేవు. అందుకే దోమలు ఎక్కువగా ఉండే సమయంలో గదిలో సీలింగ్ లేదా టేబుల్ ఫ్యాన్‌ను ఉపయోగించడం కొంతవరకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం సమయంలో దోమలు ఎక్కువగా ఉంటాయి. అప్పుడు ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవాలి.

