Telugu

ఈ సింపుల్ టిప్స్ తో బియ్యానికి పట్టిన పురుగులు మాయం!

Telugu

బిర్యానీ ఆకు, లవంగాలు

బియ్యం డబ్బాలో 4-5 బిర్యానీ ఆకులు లేదా 8-10 లవంగాలు వేయాలి. వాటి ఘాటైన వాసన పురుగులకు నచ్చదు. దీంతో అవి వెంటనే పారిపోతాయి.

Image credits: social media
Telugu

పొట్టు తీయని వెల్లుల్లి

పొట్టు తీయని 5-6 వెల్లుల్లి రెబ్బలను బియ్యం మధ్యలో అక్కడక్కడా వేయాలి. వెల్లుల్లి పూర్తిగా ఎండిపోయాక, వాటిని తీసేసి కొత్త రెబ్బలు పెట్టాలి. దీని ఘాటు వాసనకు పురుగులు దూరంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

వేపాకులతో మ్యాజిక్

ఎండిన వేపాకులను ఒక పలుచని కాటన్ క్లాత్‌లో కట్టి బియ్యం డబ్బాలో పెట్టాలి. వేపలో ఉండే సహజ క్రిమిసంహారక గుణాలు బియ్యంలో పురుగులు చేరకుండా అడ్డుకుంటాయి.

Image credits: Getty
Telugu

ఎండుమిర్చి వాడకం

బియ్యం డబ్బాలో 3-4 ఎండు మిరపకాయలు వేయాలి. మిరపకాయల ఘాటైన వాసనకు బియ్యంలో దాక్కున్న పురుగులు బయటకు వచ్చేస్తాయి.

Image credits: Getty
Telugu

ఎండలో ఆరబెట్టడం

బియ్యంలో పురుగుల బెడద మరీ ఎక్కువగా ఉంటే, బియ్యాన్ని ఒక క్లాత్‌పై పోసి 2-3 గంటల పాటు ఎండలో ఆరబెట్టాలి. వేడికి తట్టుకోలేక పురుగులు వాటంతట అవే బయటకు వెళ్లిపోతాయి.

Image credits: pixabay

పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? ఇండియన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?

Earrings: 1 గ్రాము బరువులో అదిరిపోయే ఇయర్ రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్

Golden Bangles: పండగల వేళ.. మీ చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు

Mangalsutra Designs: మెడ నిండుగా కనిపించే మంగళసూత్రాలు.. చూస్తే ఫిదా!