MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Wrinkles: వయసు పెరుగుతుంటే ముఖంపై ముడతలు వస్తున్నాయా? ఇలా చేస్తే ముడతలు మాయం

Wrinkles: వయసు పెరుగుతుంటే ముఖంపై ముడతలు వస్తున్నాయా? ఇలా చేస్తే ముడతలు మాయం

Wrinkles: ఎన్ని ఖరీదైన క్రీములు రాసినా కూడా ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయా? మార్కెట్లో దొరికే క్రీములను మార్చడానికి ముందు... కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. అప్పుడే.. మీ వయసు తగ్గి.. యవ్వనంగా కనిపిస్తారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 12 2026, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Skin Care
Image Credit : freepik

Skin Care

వయసు పెరుగుతుంటే.. మన శరీరంలో మార్పులు రావడం చాలా సహజం. మరీ ముఖ్యంగా.. ముఖంపై ముడతలు లాంటివి చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. వయసు పెరుగుతుంటే.. ఇలాంటివి రావడం చాలా కామన్ అనుకొని వదిలేస్తారు. లేదంటే.. మార్కెట్లో దొరికే క్రీములన్నీ కొనేసి.. అన్నీ ముఖానికి పూసేస్తూ ఉంటారు. ఇవన్నీ రాసిన తర్వాత కూడా పెద్దగా ఉపయోగం లేదు అని మీరు భావిస్తే.. ఆ క్రీములను మార్చడం కాకుండా.. మీరు రోజూ రెగ్యులర్ గా చేసే కొన్ని పనులను చేయడం ఆపేయాలి. అప్పుడు.. ప్రయోజనం క్లియర్ గా కనపడుతుంది. మరి, మార్చుకోవాల్సిన అలవాట్లు ఏంటో చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మంచి నిద్ర...
Image Credit : Getty

మంచి నిద్ర...

చాలా మంది ఏదో ఒక పని కారణంగా తమ నిద్రను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సరిగా నిద్ర లేకపోతే.. చర్మ కణాలు దెబ్బ తింటాయి. ముఖ్యంగా చర్మం కాంతి హీనంగా మారుతుంది. కంటి కింద నల్లటి వలయాలు ,ముడతలు రావడం మదలౌతాయి. అందుకే.. ఈ అలవాటు మార్చుకొని.. రోజుకి కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి.

నీరు తాగడం.. చాలా మంది నిర్లక్ష్యం చేసే మరో పని నీరు తాగడం. పనిలో పడి చాలా మంది మంచినీరు తాగడం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీని వల్ల.. చర్మానికి నీరు సరిగా అందకపోవడం వల్ల చర్మం తేమ కోల్పోయి పొడిగా మారుతుంది. పొడిబారిన చర్మం త్వరగా సాగిపోయి ముడతలు పడే అవకాశం ఉంటుంది. అందుకే.. ఈ పొరపాటు చేయకూడదు. వీలైనంత వరకు ఎక్కువ నీటిని తాగాలి. అప్పుడు చర్మం తాజాగా తేమగా ఉంటుంది.

33
సన్‌స్క్రీన్ వాడకపోవడం:
Image Credit : Getty

సన్‌స్క్రీన్ వాడకపోవడం:

ఎండలోకి వెళ్లినప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు సన్‌స్క్రీన్ వాడకపోతే, UV కిరణాలు చర్మంలోని కొల్లాజెన్ పొరను దెబ్బతీసి త్వరగా ముసలితనం వచ్చేలా చేస్తాయి.

మితిమీరిన తీపి పదార్థాలు: చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల 'గ్లైకేషన్' ప్రక్రియ జరిగి చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్, ఎలాస్టిన్ ప్రోటీన్లు నాశనమవుతాయి. దీని వల్ల కూడా ముఖంపై తొందరగా ముడతలు వచ్చేస్తాయి.

ధూమపానం, ఆల్కహాల్: స్మోకింగ్ వల్ల చర్మానికి ఆక్సీజన్ అందదు, ఆల్కహాల్ చర్మంలోని తేమను విపరీతంగా తగ్గిస్తుంది. ఈ అలవాట్లు మార్చుకోకపోతే.. చర్మం పై ముడతలు వచ్చేస్తాయి.

దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి: ఎక్కువగా ఒత్తిడికి గురైనప్పుడు 'కార్టిసోల్' అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది చర్మ కణజాలాన్ని దెబ్బతీసి ముడతలను వేగవంతం చేస్తుంది. వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోవాలి.

రాత్రివేళ ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం: రోజంతా పేరుకుపోయిన దుమ్ము, మురికి లేదా మేకప్‌ను తొలగించకుండా పడుకోవడం వల్ల చర్మ రంధ్రాలు పూడుకుపోయి మెరుపు కోల్పోతుంది. ముడతలు కూడా వచ్చేస్తాయి. అందుకే.. రాత్రి పడుకునే ముందు కచ్చితంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ అలవాట్లు మార్చుకుంటే...ముఖంపై ముడతలు తగ్గించి మీరు ఎక్కువ రోజులు యవ్వనంగా కనిపిస్తారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Water: బియ్యం నీటిని ఇలా వాడితే ముఖం మెరిసిపోవడం పక్కా!
Recommended image2
Coriander Water: ధనియాల నీరు ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది, ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Recommended image3
Mutton Biryani: రెస్టారెంట్ స్టైల్ మటన్ బిర్యానీ.. వంట రాని వాళ్లు కూడా ఈజీగా చేసేయొచ్చు!
Related Stories
Recommended image1
Onion Peel: ఉల్లి తొక్కలు పడేస్తున్నారా? ఇన్ని రకాలుగా వాడొచ్చే తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
Recommended image2
Coriander Water: ధనియాల నీరు ఇలా వాడితే.. జుట్టు వేగంగా పెరుగుతుంది, ప్రతిరోజూ ఇదొక్కటి చేస్తే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved