MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Happy Life Tips: మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలా? ఈ 5 రూల్స్ పాటిస్తే చాలు!

Happy Life Tips: మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలా? ఈ 5 రూల్స్ పాటిస్తే చాలు!

Happy Life Tips: ఎప్పుడూ సంతోషంగా, ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందుకోసం జీవితంలో పెద్ద మార్పులు చేయాల్సిన పని లేదు. కొన్ని చిన్న మార్పులు కూడా పాజిటివిటీ, ఆనందాన్ని పెంచుతాయి. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Sep 12 2026, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హ్యాపీ లైఫ్ కోసం సింపుల్ టిప్స్
Image Credit : our own

హ్యాపీ లైఫ్ కోసం సింపుల్ టిప్స్

సాధారణంగా అందరి జీవితం ఒకేలా ఉండదు. కొందరు కష్ట సమయాల్లో కూడా చాలా ధైర్యంగా, సంతోషంగా, పాజిటివ్‌గా ఉంటారు. కానీ మరికొందరు చిన్న విషయాలకే బాధపడిపోతుంటారు. నిజానికి మన సంతోషం చాలాసార్లు మన పరిస్థితులపై కాకుండా.. వాటిని మనం ఎలా స్వీకరిస్తామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని చిన్న చిన్న అలవాట్లు మన జీవితాన్ని మరింత ఆనందంగా మార్చగలవు. అలాంటి 5 సింపుల్ రూల్స్ మీకోసం. ఒకసారి ట్రై చేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫ్యామిలీ కోసం టైం కేటాయించడం
Image Credit : Getty

ఫ్యామిలీ కోసం టైం కేటాయించడం

మన జీవితానికి కుటుంబమే బలమైన పునాది. ఎలాంటి షరతులు లేకుండా మనల్ని ప్రేమించేది, మనకు అండగా ఉండేది వాళ్లే. జీవితంలో ఒడిదొడుకులు ఎదురైనప్పుడు, కుటుంబం మనకు ధైర్యాన్నిస్తుంది. కుటుంబంతో గడిపే సమయం మన మానసిక ఆనందాన్ని పెంచుతుంది. అందుకే, రోజూ మీ కుటుంబంతో కాస్త సమయం గడపడం అలవాటు చేసుకోవాలి.

36
నిజమైన స్నేహితులతో టచ్‌లో ఉండటం
Image Credit : Unsplash

నిజమైన స్నేహితులతో టచ్‌లో ఉండటం

ఎలాంటి స్వార్థం లేకుండా మనల్ని ప్రేమించేవాళ్లే నిజమైన స్నేహితులు. సంతోషంలో మనతో పాటు నవ్వే స్నేహితులు, కష్టాల్లో మనకు అండగా నిలబడి ధైర్యం చెబుతారు. కానీ, నిజమైన స్నేహం దానంతట అదే ఏర్పడదు. దానికి నిరంతర శ్రద్ధ, నమ్మకం అవసరం. మంచి స్నేహితులు కూడా కుటుంబంలాగే మన జీవితాన్ని ప్రకాశవంతం చేస్తారు.

46
సంతృప్తినిచ్చే పని చేయడం
Image Credit : Getty

సంతృప్తినిచ్చే పని చేయడం

డబ్బు, విజయం మాత్రమే జీవితాన్ని పరిపూర్ణం చేయవు. మీరు చేసే పనికి ఒక అర్థం, ఒక లక్ష్యం ఉందని అనిపించినప్పుడు, నిజమైన సంతృప్తిని పొందుతారు. అందుకే, పనిని కేవలం బాధ్యతగా భావించకుండా.. అందులో ఒక అర్థాన్ని, సంతృప్తిని వెతుక్కోవాలి. చిన్న చిన్న విజయాలకు కూడా మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, జీవితంపై సంతృప్తిని కలిగిస్తుంది.

56
ఆధ్యాత్మికత
Image Credit : Freepik

ఆధ్యాత్మికత

సంతోషకరమైన జీవితానికి కుటుంబం, స్నేహితులు, పని మాత్రమే సరిపోవు. మనకంటే పెద్దదైన శక్తి ఏదో ఉందని నమ్మాలి. ఈ భావన ఆధ్యాత్మికత ద్వారా రావచ్చు. ప్రకృతిలో సమయం గడపడం, జీవితం గురించి లోతుగా ఆలోచించడం ద్వారా కూడా రావచ్చు. విశాలమైన ఆకాశాన్ని చూడటం, ప్రకృతి మధ్య గడపడం లేదా ప్రశాంతంగా కూర్చుని ఆలోచించడం మీకు అంతర్గత శాంతిని ఇస్తుంది. మన సమస్యలు జీవితంలో చాలా చిన్నవని గ్రహించినప్పుడు, కష్టాలను చూసే దృక్పథం మారుతుంది.

66
ఫోన్‌ ని దూరం పెట్టడం
Image Credit : Gemini AI

ఫోన్‌ ని దూరం పెట్టడం

ఈ రోజుల్లో మన సంతోషానికి ఫోన్లే పెద్ద అడ్డంకిగా మారాయి. కుటుంబంతో కూర్చున్నా మన దృష్టి మొబైల్ స్క్రీన్‌పైనే ఉంటుంది. స్నేహితులతో ఉన్నా నోటిఫికేషన్లు చెక్ చేస్తూనే ఉంటాం. డిజిటల్ పరికరాల మితిమీరిన వాడకం గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ ఫోన్‌లోనే మునిగిపోవడం మనల్ని చుట్టూ ఉన్నవాళ్లకు, మన సంబంధాలకు దూరం చేస్తుంది. మొబైల్‌కు దూరంగా ఉంటే, మీరు కచ్చితంగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Bali Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో బాలీ ఇయర్ రింగ్స్
Recommended image2
Gold Nose Pin: అరగ్రాములో వచ్చే అందమైన ముక్కుపుడక డిజైన్లు ఇవిగో!
Recommended image3
Train: ఒక్క స్టేషన్ లో కూడా ఆగకుండా..528 కిలో మీటర్లు ప్రయాణించే నాన్ స్టాప్ రైలు..!
Related Stories
Recommended image1
Telugu Saying: లోకువ మొగుడికి నూకల జావ! ఈ సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
Recommended image2
Vinayaka Chavithi 2026: వినాయక చవితి నాడు కచ్చితంగా చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved