MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Healthy Diet After 30: వయసు 30 దాటిందా? ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉండటమే మంచిది!

Healthy Diet After 30: వయసు 30 దాటిందా? ఈ ఫుడ్స్‌కి దూరంగా ఉండటమే మంచిది!

Healthy Diet After 30: 30 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో చాలా మార్పులు మొదలవుతాయి. ఈ సమయంలో మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతుంది. నిపుణుల ప్రకారం 30 తర్వాత ఏ ఆహారాలను తగ్గించాలి, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 29 2026, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
30 ఏళ్లు దాటాక తినకూడని ఆహారాలు
Image Credit : gemini ai

30 ఏళ్లు దాటాక తినకూడని ఆహారాలు

వయసు 30 దాటాక, ఒకప్పటిలా ఏది తిన్నా శరీరం తట్టుకుంటుంది అనుకోవద్దు. వయసు పెరిగే కొద్దీ బరువు, రక్తపోటు, షుగర్ లెవెల్స్, గుండె ఆరోగ్యం వంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం ఇష్టమైన ఫుడ్స్ అన్నీ మానేయాలని కాదు, కానీ కొన్ని రకాల ఫుడ్స్ కి దూరంగా ఉండడం మంచిది. అవేంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్
Image Credit : magnific

చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్

చక్కెర ఎక్కువగా ఉండే కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, జ్యూస్‌లను తరచుగా తాగడం మానుకోవాలి. అధిక చక్కెర అనవసరమైన కేలరీలను పెంచి, బరువు పెరగడానికి కారణమవుతుంది. అంతేకాదు, ఇది చర్మంలోని కొల్లాజెన్‌తో కలిసి ముడతలకు దారితీస్తుంది. వీటికి బదులుగా చక్కెర లేని నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగొచ్చు.

35
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు
Image Credit : magnific

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలు

చిప్స్, స్నాక్స్, ఇన్‌స్టంట్ నూడిల్స్, ఊరగాయలు, ప్రాసెస్ చేసిన మాంసం వంటి వాటిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివి తరచుగా తింటే రక్తపోటు పెరిగి, గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే ఉప్పు వాడకాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. WHO సిఫార్సు ప్రకారం, పెద్దలు రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి. ఇలాంటి స్నాక్స్‌కు బదులు ఉడికించిన గింజలు, పప్పులు, పండ్లు తినడం మంచిది.

45
ప్రాసెస్ చేసిన మాంసం
Image Credit : magnific

ప్రాసెస్ చేసిన మాంసం

మాంసాన్ని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఐరన్, విటమిన్ B12 వంటి పోషకాలను అందించడంలో మాంసాహారం సహాయపడుతుంది. కానీ ప్రాసెస్ చేసిన మాంసం ఎక్కువగా తినడం మంచిదికాదు. వీటిలో ఉప్పు, సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వీటికి బదులు చేపలు, గుడ్లు, పప్పు ధాన్యాలు వంటి ఇతర ప్రొటీన్ ఫుడ్స్ తినడం మంచిది.

55
వేయించిన ఆహారాలు
Image Credit : magnific

వేయించిన ఆహారాలు

వడ, బజ్జీ, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి డీప్-ఫ్రైడ్ ఫుడ్స్, కొన్ని బేకరీ ఐటమ్స్ తరచుగా తింటే చెడు కొలెస్ట్రాల్ పెరిగి, మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే, బ్రెడ్, మైదా పరోటా, పూరీ, పాస్తా, బిస్కెట్లు త్వరగా చక్కెరగా మారి, ఆకలిని పెంచి, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతాయి.

సాధారణంగా వయసు 30 దాటాక జీవక్రియ నెమ్మదిస్తుంది. దీనివల్ల రక్తపోటు, LDL కొలెస్ట్రాల్, బ్లెడ్ షుగర్ వంటివి క్రమంగా పెరగడం మొదలవుతుంది. కాబట్టి, కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల అధిక బరువు, గుండె, రక్తపోటు, షుగర్ వ్యాధి వంటి సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooking Tips: కూర వండే ముందు.. కూరగాయల్ని ఎలా శుభ్రం చేయాలి?
Recommended image2
Nita Ambani: స్వదేశీ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నీతా అంబానీ..బనారసి చీరలో లుక్ అదుర్స్
Recommended image3
లిప్‌స్టిక్‌ ఇష్టం లేకపోతే దానికి బదులు వీటిని వాడండి
Related Stories
Recommended image1
Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
Recommended image2
Weight Loss Foods: బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved