MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్

Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అజ్ఞాతవాసి చిత్రం తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. 48 గంటల్లో నష్టాలని భర్తీ చేయాలి అన్నప్పుడు ఎలా గడిచింది అనే విషయాన్ని త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 27 2026, 07:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Trivikram Srinivas
Image Credit : Asianet News

Trivikram Srinivas

టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి అగ్ర హీరోలకు త్రివిక్రమ్ అదిరిపోయే హిట్లు ఇచ్చారు. త్రివిక్రమ్ పెన్ను నుంచి వచ్చే డైలాగులు తూటాల్లా పేలుతుంటాయి. త్రివిక్రమ్ కెరీర్ లో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన అజ్ఞాతవాసి చిత్రం త్రివిక్రమ్ తో పాటు పవన్ అభిమానులకు కూడా బిగ్గెస్ట్ డిసప్పాయింట్ మెంట్ అనే చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫెయిల్యూర్ తర్వాత నెలకొన్న పరిస్థితులు
Image Credit : Facebook / trivikram

ఫెయిల్యూర్ తర్వాత నెలకొన్న పరిస్థితులు

భారీ అంచనాలతో వచ్చిన అజ్ఞాతవాసి చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. భారీ నష్టాలని మిగిల్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని చినబాబు (రాధాకృష్ణ) నిర్మించారు. ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత నెలకొన్న పరిస్థితుల గురించి, ఎదురుకొన్న సవాళ్ల గురించి త్రివిక్రమ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దాని నుంచి తాను ఏం చేర్చుకున్నానో వివరించారు.

35
కడుతున్న ఇల్లు ఆపేశాను
Image Credit : our own

కడుతున్న ఇల్లు ఆపేశాను

నా అనుభవం ప్రకారం ఫెయిల్యూర్ ఎప్పుడు మరింత బాధగా మారుతుంది అంటే.. దానిని దాచినప్పుడే. ఉదాహరణ చెబుతాను. నేను ఇల్లు కడుతున్న సమయంలో అజ్ఞాతవాసి సినిమా తీశాను. అది ఫెయిల్ అయింది. 24 గంటల్లో నా రెమ్యునరేషన్ మొత్తం తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది. నిర్మాత ప్రాఫిట్ లో కొంత మొత్తం వెనక్కి ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారు కొంత రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేశారు. 48 గంటల్లో అందరికీ సెటిల్ చేసేశాం.

45
భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Image Credit : our own

భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్

అప్పటికి నా పిల్లలు ఇంకా చిన్నవాళ్లు. స్కూల్ కి వెళ్లే వయసు. అయినప్పటికీ నా భార్య పిల్లలని కూర్చోబెట్టి చెప్పాను. అజ్ఞాతవాసి సినిమా ఫెయిల్ అయింది. కాబట్టి మనం కడదాం అనుకుంటున్నా ఇల్లు ఆపేస్తున్నా. మీకు ఏమైనా సమస్యా అని అడిగాను. ఒక వేళ ఏదైనా తేడా జరిగితే దానిని అమ్మేస్తాను కూడా అని చెప్పా. మాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు కూడా బావుంది కదా అని నా భార్య పిల్లలు అన్నారు.

55
అందుకే ఫెయిల్యూర్ ని దాచకూడదు
Image Credit : Asianet News

అందుకే ఫెయిల్యూర్ ని దాచకూడదు

దీనితో నా భారం అక్కడితో తగ్గిపోయింది. ఆ తర్వాత హ్యాపీగా భోజనం చేసి పడుకున్నాం. నేను ఒక యజమానిగా దానిని దాచిపెట్టి ఎలాగోలా మేనేజ్ చేద్దాం అని అనుకుని ఉంటే అంతా కాంప్లికేటెడ్ అయ్యేది. ఫెయిల్యూర్ విషయం ప్రపంచానికే తెలుసు. కాబట్టి నా ఫ్యామిలీకి తెలియకుండా ఎలా ఉంటుంది. కానీ చెప్పడం నా ధర్మం. నేను చెప్పాను కాబట్టే ఇది అంత పెద్ద ఇష్యూ కాదని వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నారు అని త్రివిక్రమ్ తెలిపారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi First Salary: చిరంజీవి ఫస్ట్ సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?
Recommended image2
418 Movie Trailer: సెన్సార్ బోర్డును వణికించినట్రైలర్.. 418 రిలీజ్ డేట్ ఫిక్స్!
Recommended image3
Trisha: 40 ఏళ్లు దాటాక విటమిన్ డి కోసం త్రిష ఏం చేస్తోందో తెలుసా? ఇది ఎందుకంత ముఖ్యం?
Related Stories
Recommended image1
Toxic: టాక్సిక్ మూవీ ఎఫెక్ట్, గీతూ మోహన్ దాస్ పై ట్రోలింగ్.. దిల్ రాజు మనసులో అనుకున్న మాటలే నిజమయ్యాయా ?
Recommended image2
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved