MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Rakhi: అక్క లేదా చెల్లెలు లేకపోతే రాఖీ ఎవరు కట్టాలి? చరిత్ర చెప్పే నిజాలు ఇవే

Rakhi: అక్క లేదా చెల్లెలు లేకపోతే రాఖీ ఎవరు కట్టాలి? చరిత్ర చెప్పే నిజాలు ఇవే

Raksha Bandhan: రక్త సంబంధానికే కాకుండా భావ బంధాలకు కూడా అద్దం పట్టే పండుగ రాఖీ పూర్ణిమ. అయితే సొంత సోదరి లేనివారు రాఖీ పండుగను ఎలా జరుపుకోవాలి, ఎవరి చేత రాఖీ కట్టించుకోవాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 27 2026, 09:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సొంత సోదరి లేకపోతే రాఖీ పండుగ జరుపుకోకూడదా?
Image Credit : Gemini

సొంత సోదరి లేకపోతే రాఖీ పండుగ జరుపుకోకూడదా?

రాఖీ పండుగ వస్తోందంటే చాలు ప్రతి ఇంట్లో సందడి మొదలవుతుంది. అయితే "మాకు సొంత అక్కా చెల్లెళ్లు లేరు, మరి రాఖీ ఎవరు కట్టాలి?" అనే డౌట్ చాలా మంది అబ్బాయిల్లో ఉంటుంది. నిజానికి రాఖీ అనేది కేవలం ఒకే కడుపున పుట్టిన రక్త సంబంధానికే పరిమితం కాదు. ఇది ప్రేమ, రక్షణ, పరస్పర గౌరవానికి ప్రతీక. కాబట్టి సొంత సోదరి లేనంత మాత్రాన పండుగ ఆగిపోవాల్సిన అవసరం లేదు. కజిన్ సిస్టర్స్, చిన్నప్పటి నుంచి అక్కలా, చెల్లిలా భావించే ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేదా ఆత్మీయుల చేత రాఖీ కట్టించుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎవరు రాఖీ కట్టవచ్చు? సంప్రదాయాలు ఏం చెప్తున్నాయి?
Image Credit : magnific

ఎవరు రాఖీ కట్టవచ్చు? సంప్రదాయాలు ఏం చెప్తున్నాయి?

అక్కా చెల్లెలు లేని వారు ఎవరి చేత రాఖీ కట్టించుకోవచ్చో చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు.

కజిన్స్: మేనమామ, అత్త, బాబాయి లేదా పిన్ని కూతుళ్లను మన సంప్రదాయంలో సొంత సోదరీమణులతో సమానంగా భావిస్తారు.

సోదరిగా భావించే స్నేహితురాలు: చిన్నప్పటి నుంచి మీతో పెరిగిన లేదా మిమ్మల్ని అన్నగా భావించే స్నేహితురాలి చేత రాఖీ కట్టించుకోవచ్చు.

గురువులు లేదా పూజారులు: కొన్ని ప్రాంతీయ ఆచారాల ప్రకారం మిమ్మల్ని సన్మార్గంలో నడిపించే గురువులకు కూడా రక్షాసూత్రం కడతారు.

దేవుడికి సమర్పించడం: ఎవరూ అందుబాటులో లేకపోతే ఇష్టదైవానికి పూజ చేసి రాఖీ సమర్పించి, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం.

Related Articles

Related image1
Indias Shortest Train Journey: 7 నిమిషాల్లోనే ముగిసే రైలు ప్రయాణం ఇది !
Related image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
35
చరిత్రలో నిలిచిన రాఖీ కథలు: ద్రౌపది నుంచి హుమాయున్ వరకు
Image Credit : chatgpt

చరిత్రలో నిలిచిన రాఖీ కథలు: ద్రౌపది నుంచి హుమాయున్ వరకు

రాఖీ బంధం ఎంత పవిత్రమైనదో చెప్పడానికి పౌరాణిక, చారిత్రక ఘట్టాలే నిదర్శనం. వాటిని గమనిస్తే..

శ్రీకృష్ణుడు - ద్రౌపది: మహాభారతంలో కృష్ణుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీర కొంగు చించి కట్టింది. దానికి ప్రతిఫలంగా ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో శ్రీకృష్ణుడు ఆమెను కాపాడి అండగా నిలిచాడు.

ఇంద్రుడు - శచీదేవి: భవిష్య పురాణం ప్రకారం రాక్షసులతో యుద్ధంలో విజయం సాధించడానికి ఇంద్రుడికి ఆయన భార్య శచీదేవి పవిత్ర రక్షాసూత్రాన్ని కట్టింది.

రాణీ కర్ణావతి - హుమాయున్: 1535లో మేవార్ రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాణి కర్ణావతి మొఘల్ చక్రవర్తి హుమాయున్‌కు రాఖీ పంపింది. ఒక హిందూ రాణి పంపిన రాఖీ గౌరవాన్ని కాపాడేందుకు హుమాయున్ తన సైన్యాన్ని రక్షణగా పంపాడు.

45
రవీంద్రనాథ్ ఠాగూర్ తెచ్చిన సామాజిక విప్లవం
Image Credit : Gemini AI

రవీంద్రనాథ్ ఠాగూర్ తెచ్చిన సామాజిక విప్లవం

1905లో బెంగాల్ విభజన సమయంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రక్షాబంధన్‌ను ఒక గొప్ప సామాజిక ఉద్యమంగా మలిచారు. హిందువులు, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందించడానికి, అందరూ ఒకరికొకరు రాఖీలు కట్టుకోవాలని పిలుపునిచ్చారు. మతాలు, వర్గాలు, రక్త సంబంధాలకు అతీతంగా మానవత్వమే ముఖ్యం అని చాటిచెప్పడానికి రాఖీని ఒక గొప్ప ఆయుధంగా వాడారు.

55
ఇంట్లో రాఖీ పండుగను సింపుల్‌గా, అర్థవంతంగా ఎలా జరుపుకోవాలి?
Image Credit : Asianet News

ఇంట్లో రాఖీ పండుగను సింపుల్‌గా, అర్థవంతంగా ఎలా జరుపుకోవాలి?

సోదరి దూరంగా ఉన్నా లేదా లేకపోయినా పండుగ ఆత్మ కోల్పోకుండా జరుపుకోవచ్చు. ముందుగా ఇంట్లో దీపం వెలిగించి, దేవుడికి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత కజిన్ లేదా అక్కలా భావించే వ్యక్తితో తిలకం దిద్ది, అక్షతలు వేసి, రాఖీ కట్టించుకుని స్వీట్లు తినిపించుకోవాలి. ఒకవేళ ఎవరూ లేకపోతే గుడిలో పూజ చేసి దేవుడికి రక్షాసూత్రం సమర్పించి, ఇంట్లోని పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే చాలు. రాఖీ పండుగలో ముఖ్యం దారం కాదు, దాని వెనుక ఉన్న పవిత్రమైన భావం అని పండితులు చెబుతున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi: 90s లో పెద్ద పెద్ద మెరుపుల రాఖీలు గుర్తున్నాయా? తక్కువ కాస్ట్ తో.. చేతినిండా కనిపించే రాఖీల తీపిజ్ఞాపకాలు..
Recommended image2
World's Largest Snake: బాబోయ్ 250 కేజీల పామా? ప్రపంచంలోనే అతిపెద్ద పాము ఏదో తెలుసా?
Recommended image3
Boys vs Girls Height : మహిళల కంటే మగవాళ్లే ఎక్కువ పొడవు పెరుగుతారు? కారణమేంటో తెలుసా?
Related Stories
Recommended image1
Indias Shortest Train Journey: 7 నిమిషాల్లోనే ముగిసే రైలు ప్రయాణం ఇది !
Recommended image2
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved