- Home
- Entertainment
- Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్.. రవితేజ సినిమాకి మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్లు
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్.. రవితేజ సినిమాకి మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్లు
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన `ఇరుముడి` మూవీ విశేష ఆదరణతో దూసుకుపోతుంది. ఈ సినిమాకి ఊహించని కలెక్షన్లు వస్తున్నాయి. వీక్ డేస్‌లోనూ అదిరిపోయే వసూళ్లని రాబట్టడం విశేషం.

డివోషనల్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటున్న ఇరుముడి
రవితేజ ఒకప్పుడు తిరుగులేని స్టార్ గా రాణించారు. వరుస విజయాలతో దూసుకుపోయారు. కానీ ఇటీవల కాలంలో ఆయనకు విజయాలు వరించలేదు. వరుస పరాజయాలు అభిమానులను డిజప్పాయింట్ చేస్తూ వచ్చాయి. అదే సమయంలో రవితేజ కూడా రెగ్యూలర్, రొటీన్ కమర్షియల్ చిత్రాలు చేశారు. అవి ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. దీంతో డిజాస్టర్లుగా నిలిచాయి. అంతేకాదు రవితేజ మార్క్ కామెడీ సినిమాలు కూడా వర్క్ కావడం లేదు. దీంతో రూట్ మార్చారు. కొత్త ప్రయత్నం చేశారు. అదే `ఇరుముడి` మూవీ. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అయ్యప్పస్వామి భక్తుల నేపథ్యంలో డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇందులో హైలైట్‌గా నిలిచాయి.
ఇరుముడికి సోమవారం అదిరిపోయే కలెక్షన్లు
ఈ శుక్రవారం విడుదలైన `ఇరుముడి` మూవీ ప్రారంభం నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా పాటలు, ట్రైలర్, టీజర్ ఆకట్టుకోవడంతో మంచి బజ్ ఏర్పడింది. ఈ మధ్య కాలంలో ఎప్పుడూ లేని విధంగా రవితేజ మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డ్ స్థాయిలో రావడం విశేషం. ఇది సినిమా సక్సెస్‌కి సూచనగా చెప్పొచ్చు. మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది. అయ్యప్ప భక్తులు, డివోషనల్ మూవీస్ ఇష్టపడే వారు సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా ఈ మూవీని థియేటర్లో చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో దీనికి అదిరిపోయే కలెక్షన్లు వస్తున్నాయి. సాధారణంగా వీకెండ్‌లో ఎక్కువ కలెక్షన్లు వస్తాయి. మొదటి వీకెండ్ తర్వాత సోమవారం నుంచి వసూళ్లు పడిపోతాయి. కానీ ఇది సోమవారం కూడా అదిరిపోయే కలెక్షన్లని రాబట్టింది.
ఇరుముడి 4 రోజుల కలెక్షన్లు
`ఇరుముడి` మూవీ 4వ రోజు(సోమవారం) ఇండియాలో రూ.11.90కోట్ల నెట్ కలెక్షన్లని రాబట్టింది. దీంతో ఇండియాలో నాల్గు రోజుల్లో ఈ మూవీకి రూ.72.50కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇండియా నెట్ రూ.62.40కోట్లు . ఇక నాల్గో రోజు ఓవర్సీస్‌లో కోటిన్నర వచ్చాయి. మొత్తంగా నాల్గు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ.87.50కోట్లు రావడం విశేషం. ఈ లెక్కన సినిమాకి సుమారు రూ.44కోట్ల షేర్ వచ్చాయి. ఈ రకంగా చెప్పాలంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ దాటి డబుల్ లాభాలను రాబట్టిందని చెప్పొచ్చు. ప్రస్తుతం సినిమా బాక్సాఫీసు వద్ద జోరు చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా లేదు. వంద దాటి రెండు వందల కోట్ల వైపు వెళ్లినా ఆశ్చర్యం లేదు.
ఇరుముడి బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్
`ఇరుముడి` మూవీకి రూ.40కోట్ల బడ్జెట్ అయినట్టు సమాచారం. థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.20కోట్లు అయ్యిందట. నైజాం రూ.5.50కోట్లకు, సీడెడ్ రూ.2.25కోట్లకు, ఆంధ్రా రూ.8.25కోట్లకు అమ్మారట. ఓవర్సీస్‌లో రెండు కోట్లకు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్లకు సేల్ చేశారట. దీంతో ఈ సినిమా హిట్ కావాలంటే రూ.21కోట్ల షేర్ రావాలి. అంటే సుమారు నలభై కోట్ల గ్రాస్ రావాలి. ఈ మూవీ రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇప్పుడు నిర్మాతలకు, బయ్యర్లకి ఊహించని లాభాలను తీసుకొస్తుంది. అంతేకాదు.. లాభాల పంట పండిస్తోందని చెప్పొచ్చు.

