MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Home Decor: సెంటు సీసాలు పడేయకండి..ఇలా చేస్తే మీ ఇల్లు రాయల్ లుక్ లో మెరిసిపోతుంది

Home Decor: సెంటు సీసాలు పడేయకండి..ఇలా చేస్తే మీ ఇల్లు రాయల్ లుక్ లో మెరిసిపోతుంది

Home Decor: సెంటు అయిపోగానే ఆ బాటిల్ పడేస్తున్నారా? అయితే ఇకపై వృథా చేయకండి. వాటితోనే ఇంటికి రాయల్, గ్రాండ్ లుక్ తీసుకురావొచ్చు. చూసివాళ్లంతా వావ్ అంటారు.

2 Min read
Author : Nandini Arava
Published : Aug 29 2026, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెంటు అయిపోగానా ఆ బాటిల్ పడేస్తున్నారా?
Image Credit : chat GPT

సెంటు అయిపోగానా ఆ బాటిల్ పడేస్తున్నారా?

సెంటు అయిపోగానే ఆ బాటిల్ పడేసేముందు ఇలా చేయండి. పొడవుగా, సన్నని మూతి ఉన్న పెర్ఫ్యూమ్ బాటిళ్లు చిన్న పూలు పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. ముందుగా బాటిల్‌ లోపల ఉన్న స్మెల్, మిగిలిపోయిన లిక్విడ్‌ను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి, కొన్ని చిన్న పూలు లేదా మొక్కల కాడలను అందులో పెట్టొచ్చు. దీన్ని బెడ్‌రూమ్ టేబుల్, కిటికీ పక్కన లేదా ఆఫీస్ డెస్క్‌పై పెడితే చాలా అందంగా కనిపిస్తుంది. వేర్వేరు ఆకారాల్లో ఉన్న రెండు, మూడు బాటిళ్లను కలిపి పెడితే లుక్ ఇంకా బాగుంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూమ్ ఫ్రెషనర్ డిఫ్యూజర్
Image Credit : chat GPT

రూమ్ ఫ్రెషనర్ డిఫ్యూజర్

ఖాళీ పెర్ఫ్యూమ్ బాటిల్‌ను సింపుల్‌గా రూమ్ ఫ్రెషనర్‌గా మార్చేయొచ్చు. బాటిల్‌ను శుభ్రం చేశాక, అందులో డిఫ్యూజర్‌కు వాడే నూనె పోసి, కొన్ని రీడ్ స్టిక్స్ (పుల్లలు) పెట్టాలి. ఈ పుల్లలు నూనెను పీల్చుకుని, గది అంతా నెమ్మదిగా సువాసనను వెదజల్లుతాయి. దీనికి కరెంట్ అవసరం లేదు. అయితే, కేవలం నీళ్లు, ఎసెన్షియల్ ఆయిల్ కలిపి వాడటం అన్ని బాటిళ్లకు సురక్షితం కాదు. సరైన డిఫ్యూజర్ ఆయిల్‌ను వాడటమే మంచిది.
35
ఫెయిరీ లైట్ బాటిల్
Image Credit : chat GPT

ఫెయిరీ లైట్ బాటిల్

ట్రాన్స్ ప్రెంట్ గా ఉండే గాజు పెర్ఫ్యూమ్ బాటిల్ ఉంటే, దాన్ని చిన్న డెకరేటివ్ లైట్‌గా మార్చొచ్చు. బ్యాటరీతో పనిచేసే మినీ LED లేదా కార్క్ ఫెయిరీ లైట్లను బాటిల్ లోపల పెట్టాలి. రాత్రిపూట ఈ లైట్లను ఆన్ చేస్తే, గాజులోంచి కనిపించే చిన్న దీపాలు చాలా అందంగా ఉంటాయి. దీన్ని బెడ్‌రూమ్ టేబుల్, పుస్తకాల అర లేదా హాల్‌లో పెట్టొచ్చు. బ్యాటరీ, వైర్లు సురక్షితంగా ఉన్నాయో లేదో చూసుకుని, పిల్లలకు అందని చోట పెట్టడం మంచిది.

45
డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్
Image Credit : chat GPT

డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజర్

వెడల్పాటి మూతి ఉన్న చిన్న పెర్ఫ్యూమ్ బాటిళ్లను ఉంగరాలు, చెవిపోగులు, హెయిర్ క్లిప్పులు, బాబీ పిన్‌ల వంటి చిన్న వస్తువులను సర్దుకోవడానికి వాడొచ్చు. దీనివల్ల డ్రెస్సింగ్ టేబుల్‌పై వస్తువులు చిందరవందరగా పడి ఉండవు. బాటిల్ డిజైన్ అందంగా ఉంటే, అదనపు అలంకరణ అవసరం లేదు. కావాలనుకుంటే, బయటవైపు స్టిక్కర్లు లేదా రిబ్బన్లు అంటించి మరింత అందంగా మార్చుకోవచ్చు.
55
బాటిల్‌ను ఎలా శుభ్రం చేయాలి?
Image Credit : Getty

బాటిల్‌ను ఎలా శుభ్రం చేయాలి?

పాత పెర్ఫ్యూమ్ బాటిల్‌లో స్మెల్, నూనె మరకలు ఉండే అవకాశం ఉంది. అందుకే మళ్లీ వాడే ముందు బాటిల్‌ను బాగా కడిగి, శుభ్రమైన నీటితో చాలాసార్లు కడిగి, పూర్తిగా ఆరబెట్టడం ముఖ్యం. మూత లేదా స్ప్రే భాగాన్ని బలవంతంగా తీయడానికి ప్రయత్నించకండి. ముఖ్యంగా గాజు బాటిళ్లు ఓపెన్ చేసినప్పుడు పగిలి గాయాలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooking Tips: కూర వండే ముందు.. కూరగాయల్ని ఎలా శుభ్రం చేయాలి?
Recommended image2
Nita Ambani: స్వదేశీ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నీతా అంబానీ..బనారసి చీరలో లుక్ అదుర్స్
Recommended image3
లిప్‌స్టిక్‌ ఇష్టం లేకపోతే దానికి బదులు వీటిని వాడండి
Related Stories
Recommended image1
Laundry Tips: టవల్స్, బెడ్ షీట్స్ కలిపి ఉతికే అలవాటు ఉందా? అయితే ఇది తెలుసుకోండి
Recommended image2
Mandi Chicken Biryani: ఇంట్లోనే ఈజీగా పొగలు కక్కే చికెన్ మండి బిర్యానీ..ముక్క కూడా మిగలదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved