MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?

Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?

Toxic Day 1 collections: రకింగ్ స్టార్ యశ్ నటించిన రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ టాక్సిక్.. రిలీజ్ అయిన మొదటి రోజే నెగిటీవ్ టాక్ తెచ్చుకున్న ఈమూవీ కలెక్షన్ల విషయంలో మాత్రం సంచలనం సృష్టించింది. ఫస్ట్ డే ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 27 2026, 07:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్..
Image Credit : X/@KvnProductions

దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్..

పాన్-ఇండియా రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups). ఈ మూవీ బుధవారం భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఊహించినట్లే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తూ కొత్త చరిత్రను లిఖించింది. 'కె.జి.యఫ్: చాప్టర్ 2' (K.G.F: Chapter 2)భారీ విజయం తర్వాత యశ్ బిగ్ స్క్రీన్‌పైకి కనిపించిన మూవీ ఇది. గీతు మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ చిత్రంతో మొదటి రోజే భారతదేశంలో రూ. 100 కోట్ల నెట్ కలెక్షన్ మార్కును దాటేశాడు యశ్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఫస్ట్ డే 140 కోట్ల కలెక్షన్స్..
Image Credit : X/@KvnProductions

ఫస్ట్ డే 140 కోట్ల కలెక్షన్స్..

Sacnilk విశ్లేషణల ప్రకారం, 'టాక్సిక్' చిత్రం భారతదేశంలో తన మొదటి రోజున అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ. 101.10 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఒకేసారి విడుదల కాగా, ప్రపంచ వ్యాప్తంగా టాక్సిక్ గ్రోస్ కలెక్షన్ ఏకంగా రూ. 140 కోట్లకు చేరుకున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

35
భాషల వారీగా టాక్సిక్ మొదటి రోజు నెట్ వసూళ్లు
Image Credit : X/@KvnProductions

భాషల వారీగా టాక్సిక్ మొదటి రోజు నెట్ వసూళ్లు

హిందీ: రూ. 55.00 కోట్లు

కన్నడ: రూ. 23.30 కోట్లు

తెలుగు: రూ. 16.00 కోట్లు

తమిళం: రూ. 5.50 కోట్లు

మలయాళం: రూ. 1.30 కోట్లు

మొత్తం ఇండియా నెట్ కలెక్షన్: రూ. 101.10 కోట్లు

టాక్సిక్ భారీ ఓపెనింగ్‌తో యశ్ తన బాక్సాఫీస్ స్టామినాను మరోసారి నిరూపించుకున్నారు. 'కె.జి.యఫ్: చాప్టర్ 2' చిత్రంతో మొదటి రోజే రూ. 100 కోట్ల ఓపెనింగ్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన యశ్, ఇప్పుడు 'టాక్సిక్' ద్వారా వరుసగా రెండోసారి ఆ మైలురాయిని చేరుకున్న స్టార్ హీరోగా నిలిచారు. రాబోయే రోజుల్లో 'రామాయణ' సినిమా కూడా ఇదే స్థాయి విజయం సాధిస్తే, అతి తక్కువ సమయంలో వరుసగా మూడు రూ. 100 కోట్ల ఓపెనర్లు సాధించిన మొదటి ఇండియన్ స్టార్‌గా యశ్ సరికొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.

45
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టాక్సిక్..
Image Credit : X

భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టాక్సిక్..

టాక్సిక్’ సినిమాని KVN ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె.నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మించారు. ‘KGF 2’ తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న యశ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో.. అంచనాలు భారీగా పెరిగి... ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరిగింది. తెలుగు థియేట్రికల్ హక్కులను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 108 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారట. కర్ణాటక సుమారు రూ.100 కోట్లు, తమిళం రూ.50 కోట్లు, ఓవర్ సీస్ రూ.75 కోట్లు, హిందీతో సహా మిగతా రెస్టాఫ్ ఇండియా రూ.100 కోట్లకు అమ్మినట్లుగా సమాచారం. ఓవరాల్ గా టాక్సిక్ 450 కోట్ల భారీ టార్గెట్ తో బరిలో దిగినట్టు తెలుస్తోంది. ఫస్ట్ డేనే 100 కోట్ల నెట్ రాబట్టిన ఈమూవీ ఓవర్ ఆల్ గా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

55
ఎవరెవరు నటించారు...
Image Credit : X/ KVN Productions

ఎవరెవరు నటించారు...

గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో యశ్ సరసన కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషీ హీరోయిన్లుగా నటించారు. నయనతార యశ్ కు అక్క పాత్రలో కనిపించారు. ఇక అక్షయ్ ఒబెరాయ్, సుదేవ్ నాయర్ కూడా ముఖ్యమైన పాత్రలు పోషించారు. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ అందించిన విలక్షణమైన కథనం, హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, యశ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జెజె పెర్రీ (JJ Perry) పనిచేయడం సినిమాకు అంతర్జాతీయ స్థాయిని తీసుకువచ్చింది. అయితే ఈమూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నెగిటీవ్ టాక్ తెచ్చుకుంది. టార్చర్ తప్పించి సినిమాలో ఏం లేదని, రొమాన్స్ ఎక్కువైందని, కథ లేదు, సినిమా బాలేదంటూ.. రివ్యూలు రావడంతో యశ్ అభిమానులు మండిపడ్డారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi First Salary: చిరంజీవి ఫస్ట్ సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?
Recommended image2
418 Movie Trailer: సెన్సార్ బోర్డును వణికించినట్రైలర్.. 418 రిలీజ్ డేట్ ఫిక్స్!
Recommended image3
Trisha: 40 ఏళ్లు దాటాక విటమిన్ డి కోసం త్రిష ఏం చేస్తోందో తెలుసా? ఇది ఎందుకంత ముఖ్యం?
Related Stories
Recommended image1
Nayanthara : 31 కోట్ల ఇల్లు.. స్టూడియో, ఖరీదైన ఫ్లాట్లు.. నయనతార ఆస్తుల చిట్టా ఎంత పెద్దదో తెలుసా?
Recommended image2
Venkatesh: తొమ్మిదేళ్ల నరకం.. వెంకటేష్ సినిమాతో అప్పులు ఊబి నుంచి బయటపడ్డ నటుడు, ఎమోషనల్ కామెంట్స్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved