MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • మెత్తని పరుపులపై కాదు.. నేలపై పడుకోండి.. ఎన్నో లాభాలను పొందుతారు

మెత్తని పరుపులపై కాదు.. నేలపై పడుకోండి.. ఎన్నో లాభాలను పొందుతారు

ఖరీదైన, మెత్తని పరుపులపై పడుకోనిదే కొందరికైతే నిద్రే రాదు. కానీ వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేవు తెలుసా.. నేలపై పడుకోవడం వల్ల వెన్ను నొప్పి నుంచి ఎన్నో సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 18 2022, 10:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మెత్తని పరుపులపై పడుకోగాలనే తొందరగా నిద్రొస్తుంది. అందుకే ప్రస్తుతం అందరూ మెత్తని పరుపులపైనే నిద్రపోతున్నారు. మరీ కొందరికైతే పరుపు లేనిదే నిద్రకూడా పట్టదు. కానీ ఇలాంటి అలవాటు అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. మన శరీరానికి మెత్తగా ఉండే పరుపులు చేసే నష్టం అంతా ఇంతా కాదు. వీటిపై పడుకోవడం వల్ల ఉదయం బాగా అలసిపోయినట్టుగా ఉంటుది. కాళ్లు, చేతులు, పాదాలు బాగా నొప్పి పెడతాయి. వెన్ను నొప్పి కూడా ఉంటుంది. నిజానికి ఈ సమస్యలు మీరు నిద్రపోయే ప్లేస్, పరుపు కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. దీనిపై పడుకోవడం వల్ల శరీరంలో తిమ్మిరి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో పరుపుపై పడుకోవడం కంటే నేలపై పడుకోవడమే మంచిదంటున్నారు నిపుణుల. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

నేలపై ఎలా పడుకోవాలి

ముందుగా మీరు పడుకునే ప్లేస్ ను క్లీన్ చేయండి. ఆ నేలపై చాప లేదా మెత్తని బెడ్ షీట్ ను వేసి పడుకోండి. కుడివైపున తిరిగి పడుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది. ఎడమవైపున పడుకుంటే కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. జీర్ణం కూడా తొందరగా అవుతుంది. నేలపై పడుకోవడం వల్ల రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడుకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది. అయితే కొంతమందికి మాత్రం కడుపు మీద పడుకునే అలవాటు ఉంటుంది. నేలపై కడుపు మీద పడుకోవడం వల్ల నడుము, వీపు, భుజం నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 

37
Sleeping on the floor

Sleeping on the floor

నేలపై పడుకోవడం వల్ల వెన్ను నొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అందుకే వెన్ను నొప్పితో బాధపడేవారు నేలపై పడుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహానిస్తుంటారు. 

47
Sleeping on the floor

Sleeping on the floor

పరుపులపై నిద్రపోయే కొంతమందికి సరిగ్గా నిద్రపట్టదు. ఒకవేళ పడుకున్న వెంటనే నిద్రపోయినా.. సగం రాత్రి మెలుకువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే పరుపుపై పడుకునే అలవాటు ఉన్నవారు నేలపై పడుకుంటే మొదట్లో కాస్త ఇబ్బంది కలిగినా.. రానురాను అలవాటు అవుతుంది. నేలపై పడుకోవడం వల్ల హాయిగా నిద్రపోతారు కూడా. 

57
Sleeping on the floor

Sleeping on the floor

ఫ్లోర్ ఉష్ణోగ్రత చాలా చల్లగా ఉంటుంది. అందుకే వేసవిలో చాలా మంది నేలపైనే నిద్రపోవడానికి ఇష్టపడతారు. నేలపై పడుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.

67
Sleeping on the floor

Sleeping on the floor

నేలపై పడుకుంటే మీ మెదడు విశ్రాంతి మోడ్ లో ఉంటుంది. ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.  ఇది మాత్రమే కాదు నేలపై పడుకోవడం కూడా మీ శరీర భంగిమను మెరుగుపరుస్తుంది.

77
Sleeping on the floor

Sleeping on the floor

వెన్నునొప్పిలో ఇబ్బంది పడేవారు, నడుముకు శస్త్రచికిత్స చేయించుకున్నవారు నేలపై పడుకోవడం మంచిది కాదు. గర్భిణీ స్త్రీలు కూడా నేలపై పడుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే చలి కాలంలో కూడా నేలపై పడుకోకూడదు. ముందే ఫ్లోర్ చల్లగా ఉండటం.. దానిపై పడుకుంటే జలుబు చేస్తుంది. వృద్ధులు కూడా నేలపై పడుకోకూడదు. అలాగే ఎముకల నొప్పి ఉన్నవారు, ఏదో ఒక రకమైన అలర్జీ, ఆర్థరైటిస్ లేదా బోలు ఎముకల వ్యాధి సమస్యలు ఉన్నవారు కూడా నేలపై పడుకోకూడదని ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Protein Dosa: నార్మల్ కాదు.. ఈ ప్రోటీన్ దోశ ట్రై చేయండి.. అదిరిపోయే టేస్ట్, హెల్దీ కూడా..!
Recommended image2
Parenting: కూతురు ప్రతి విషయం షేర్ చేసుకోవాలంటే పేరెంట్స్ చేయాల్సిన 5 పనులు ఇవే!
Recommended image3
బిర్యానీ, పులావ్‌లలో ఉప్పు తగ్గి చప్పగా ఉన్నాయా? నిమిషంలో ఉప్పును సరిచేసే సింపుల్ ట్రిక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved