MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Mutton Keema Bonda: మటన్ కీమాతో క్రిస్పీ బోండాలు..పిల్లలు, పెద్దలు లొట్టలేసుకొని తింటారు!

Mutton Keema Bonda: మటన్ కీమాతో క్రిస్పీ బోండాలు..పిల్లలు, పెద్దలు లొట్టలేసుకొని తింటారు!

Mutton Keema Bonda: పిల్లలకు ఏదైనా కొత్తగా, రుచిగా చేసి పెట్టాలనుకుంటున్నారా? అయితే నోరూరించే మటన్ కీమా బోండాలు ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు వీటిని ఇష్టంగా తింటారు. మరి ఈ టేస్టీ మటన్ కీమా బోండాలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 27 2026, 06:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మటన్ కీమా బోండాలు
Image Credit : Asianet News

మటన్ కీమా బోండాలు

మటన్‌ని ఎప్పుడూ కర్రీ, ఫ్రై, బిర్యానీ చేసి బోర్ కొట్టిందా? ఈసారి కాస్త వెరైటీగా, అందరికీ నచ్చేలా మటన్ కీమా బోండాలు తయారు చేసి చూడండి. మటన్ కీమాకు మసాలాలు జోడించి బోండాల్లా తయారు చేసి వేయిస్తే బయట క్రిస్పీగా, లోపల మెత్తగా, రుచిగా ఉంటాయి. ఒక్కసారి ప్లేట్‌లో పెట్టారంటే పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుంటూ తినేస్తారు. సాయంత్రం టైమ్ స్నాక్‌గా ఇది చక్కగా సరిపోతుంది. మరి నోరూరించే ఈ మటన్ కీమా బోండాలను ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ కీమా బోండా చేయడానికి, ముందుగా కీమాను శుభ్రంగా కడిగి ఉడికించుకోవాలి. కుక్కర్‌లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కీమాను మెత్తగా ఉడికించాలి. ఉడికిన తర్వాత నీళ్లు వంపేసి, కీమాను పొడిపొడిగా చేసుకోవాలి. పిల్లలు తినడానికి వీలుగా కైమాను చిన్నగా ఉండేలా చూసుకోవాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తయారీ విధానం
Image Credit : Asianet News

తయారీ విధానం

ఇప్పుడు ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్‌ రంగులోకి మారగానే కారం, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా కలపాలి. పిల్లల కోసం కాబట్టి కారం తక్కువగా వేసుకోవాలి. తర్వాత ఉడికించిన కీమాను వేసి, మసాలాతో బాగా కలిపి కొన్ని నిమిషాలు వేయించాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.

34
శనగ పిండితో..
Image Credit : Asianet News

శనగ పిండితో..

ఇప్పుడు బోండాల కోసం పిండిని రెడీ చేసుకోవాలి. దీనికోసం శనగపిండిలో కొద్దిగా బియ్యప్పిండి, ఉప్పు, పసుపు, తగినన్ని నీళ్లు పోసి గట్టిగా కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా, కీమా ఉండలను పట్టుకునే విధంగా ఉండేలా చూసుకోవాలి.

ఆ తర్వాత వేయించి పెట్టుకున్న కీమా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్రతి ఉండను శనగపిండిలో బాగా ముంచి, వేడి నూనెలో వేసి మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేవరకు వేయించాలి. మంట ఎక్కువగా పెడితే పైన మాడిపోయి, లోపల ఉడకదు. కాబట్టి మీడియం మంట మీదే నెమ్మదిగా వేయించాలి.

44
పుదీనా చట్నీతో తింటే..
Image Credit : Asianet News

పుదీనా చట్నీతో తింటే..

గోల్డెన్ బ్రౌన్‌ రంగులోకి వచ్చాక బోండాలను నూనెలోంచి తీసి, టిష్యూ పేపర్‌పై వేస్తే అదనపు నూనె పోతుంది. వేడివేడిగా సర్వ్ చేస్తేనే ఆ కరకరలాడే రుచి పిల్లలకు బాగా నచ్చుతుంది. వీటిని పుదీనా చట్నీ లేదా కొబ్బరి చట్నీతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. కీమాలో ప్రోటీన్లు, పోషకాలు ఉన్నా, ఇది నూనెలో వేయించిన స్నాక్ కాబట్టి మితంగా తినడం మంచిది.

ఇంట్లో దొరికే సింపుల్ పదార్థాలతోనే కీమా బోండాలను టేస్టీగా తయారుచేసుకోవచ్చు. సాయంత్రం పూట పిల్లలకు ఇష్టమైన డ్రింక్స్‌తో ఈ బోండాలను సర్వ్ చేస్తే, వాళ్లు ఇష్టంగా తింటారు. రుచి, ఆరోగ్యం నిండిన ఈ ఈజీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Vinayaka Chavithi 2026 Telugu Wishes: వినాయక చవితికి మీ స్నేహితులకు ఇలా తెలుగులో శుభాకాంక్షలు చెప్పండి
Recommended image2
Gold Rings: 1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు
Recommended image3
Stone Anklets: కలర్ స్టోన్ పట్టీల డిజైన్లు.. చీరలపై చక్కగా నప్పుతాయి
Related Stories
Recommended image1
Telugu Saying: అంతా మనవాళ్లే కానీ.. అన్నానికి రమ్మనే వాళ్లు లేరు! ఈ కాలానికి తగ్గ సామెత!
Recommended image2
Soft Idli: మెత్తటి, దూదిలాంటి ఇడ్లీల కోసం సింపుల్ టిప్స్ ఇవిగో!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved