Bird: దాహంతో ప్రాణం పోయేలా ఉన్నా కూడా నీటిపై ముట్టని పక్షి ఇది.. ఎందుకో తెలుసా?
Bird: మనుషులతో పాటు పక్షులకు కూడా నీరు ప్రాణాధారమే. దాదాపు అన్ని పక్షులు ఎక్కడ నీరు దొరికినా వెంటనే తాగేస్తాయి. కానీ, ఓ పక్షి మాత్రం ప్రాణం పోతున్నా కూడా నేల మీద నీటిని ముట్టదు. ఎందుకో తెలుసా?

Chataka Bird
దప్పికతో ప్రాణం పోతున్నా సరే.. నేల మీద పడిన ఒక్క నీటి చుక్కను కూడా తాగకుండా, కేవలం ఆకాశం నుంచి పడే తొలి వర్షపు చుక్కల కోసం నెలల తరబడి నిరీక్షించే ఒక అరుదైన పక్షి మన భూమిపై ఉంది ఉంటే నమ్ముతారా? వినడానికి వింతగా ఉన్నా.. ఇది నిజం. ఆ పక్షే.. ‘ చాతక పక్షి’. ఈ పక్షి అలా ఎందుకు చేస్తుందో ఇప్పుడు చూద్దాం....
ఆఫ్రికా నుంచి మన దేశానికి వలస వచ్చే పక్షి ఇది..
ప్రతీ సంవత్సరం నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యే సమయానికి, ఈ చాతక పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణించి ఆఫ్రికా ఖండం నుంచి భారతదేశానికి వలస వస్తాయి. మన దేశంలో వర్షాలు పడబోతున్నాయనడానికి వీటి రాకను ఒక పక్కా సంకేతంగా స్థానికులు భావిస్తారు.
నేల మీద నీటిని ఎందుకు తాగదు..?
ఈ పక్షికి ఉన్న అత్యంత విచిత్రమైన అలవాటు ఏమిటంటే..ఇది సరస్సులు, నదులు లేదా చెరువుల్లో ఉండే నేల నీటిని అస్సలు తాగదు. పక్షి నోటి నిర్మాణం, దాని సహజసిద్ధమైన ప్రవర్తన ప్రకారం, ఇది కేవలం ఆకాశం నుండి కురిసే వర్షపు బిందువులను మాత్రమే నేరుగా తన నోటితో పట్టుకుని తాగుతుంది. వర్షం పడనంత వరకు ఇది తన దాహాన్ని ఆపుకుని, ఆకాశం వైపు చూస్తూ నిరీక్షిస్తుంది. అందుకే సంస్కృతంలో దాహం కోసం నిరీక్షించే వారిని 'చాతక పక్షి'తో పోలుస్తారు.
సొంత గూడు కూడా కట్టుకోని పక్షి..
ఈ పక్షికి ఉన్న మరో ఆసక్తికరమైన లక్షణం... ఇది కోకిల జాతికి చెందింది. కాబట్టి ఇది సొంతంగా గూడు కట్టుకోదు.వర్షకాలంలో తన గుడ్లను ఇతర చిన్న పక్షుల గూళ్లలో రహస్యంగా పెట్టి వదిలేస్తుంది.ఆ వేరే పక్షులే వీటి గుడ్లను పొదిగి, పిల్లలను పెంచుతాయి.
వర్షపు నీరు దొరక్కపోతే ఏమవుతుంది? వర్షాలు లేని సమయంలో ఇది తన శరీరానికి అవసరమైన తేమను ఆకులు, చెట్లపై ఉండే చిన్న చిన్న పురుగులు, కీటకాలను తినడం ద్వారా పొందుతుంది. కానీ ద్రవ రూపంలో నీటిని తాగాల్సి వస్తే మాత్రం కేవలం వర్షపు చుక్కల పైనే ఆధారపడుతుంది.

