MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • ఆపిల్ సైడర్ వెనిగర్ నిజంగా బరువును తగ్గిస్తుందా..?

ఆపిల్ సైడర్ వెనిగర్ నిజంగా బరువును తగ్గిస్తుందా..?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆపిల్ సైడర్ వెనిగర్ బరువును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అయితే ఎలా పడితే అలా తీసుకుంటే మాత్రం ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 18 2022, 09:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

బరువు తగ్గడం అంత సులువు కాదు. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. ఆయిలీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లకు దూరంగా ఉంటూ.. ఆరోగ్యకరమైన ఆహారాలను తింటే.. మీరు బరువు తగ్గుతారు. అయితే బరువు తగ్గేందుకు ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా బరువును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ తిన్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చూస్తుందని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. గ్లూకోజ్ తక్కువగా పెరిగితే శరీరంలో ఎక్కువ ఇన్సులిన్ తయారు చేయాల్సిన అవసరం లేదు. తక్కువ ఇన్సులిన్ వల్ల శరీరం ఎక్కువ కొవ్వును విచ్చిన్నం చేస్తుంది. దీనివల్ల మీరు బరువు తగ్గుతారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఆపిల్ సైడర్ వెనిగర్ ఆకలిని తగ్గించే గుణాలను కూడా కలిగి ఉంటుంది. భోజనం చేయడానికి ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ ను తాగితే.. ఎక్కువగా తినే అవకాశం ఉండదు. అందులోనూ ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. 

38

ఆపిల్ సైడర్ వెనిగర్ తో ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ.. దీన్ని వైద్యుడు లేదా పోషకాహార నిపుణుడి పర్యవేక్షణలోనే తాగాలని నిపుణులు చెబుతున్నారు. దీనితో పాటుగా రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి. ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకోవడంతో పాటుగా హెల్తీ, సమతుల్య ఆహారాన్ని తినాలి. బరువు తగ్గేందుకు ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి. 
 

48

ఆపిల్ సైడర్ వెనిగర్ చాలా ఆమ్లంగా ఉంటుంది. అందుకే దీన్ని డైరెక్ట్ గా తాగకూడదు. ఒకవేళ తాగితే మీ దంతాల ఎనామిల్ దెబ్బతినడంతో పాటుగా పొట్ట కూడా దెబ్బతింటుంది. దీనిని పలుచగా చేసి తీసుకోవచ్చు. ఇందుకోసం ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక కప్పు నీటిలో కలిపి తాగొచ్చు. 

58

ఆపిల్ సైడర్ వెనిగర్ ను మోతాదుకు మించి తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనిని వివిధ పద్ధతుల్లో తీసుకోవచ్చు. అయితే దీనిని మీరు సలాడ్ కు డ్రెస్సింగ్ లా ఉపయోగించొచ్చు. 

68

భోజనం చేసిన వెంటనే తాగకూడదు

మీరు భోజనం చేసిన వెంటనే ఆపిల్ సైడర్ వెనిగర్ ను తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకుంటే దీని వల్ల జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి. తిన్న తర్వాత దీన్నితాగాలనుకుంటే కనీసం 20 నిమిషాల గ్యాప్ ఇచ్చి  తాగండి. అయితే భోజనానికి ముందు దీన్ని తాగడం ఆరోగ్యానికి మంచిది. 
 

78

ఎక్కువగా తాగకూడదు

బరువు తగ్గుతామని ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎక్కువగా తాగే వారు కూడా ఉంటారు. అయితే దీన్ని మోతాదుకు మించి తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది కడుపులో మంటను పుట్టిస్తుంది. అందుకే తక్కువ పరిమాణంలోనే తీసుకోండి. రోజుకు రెండు టేబుల్ స్పూన్త కంటే ఎక్కువగా తాగకండి. అది కూడా పలుచగా చేసుకునే తాగాలి. 

88

నిద్రపోయే ముందు తాగకూడదు

ఆపిల్ సైడర్ వెనిగర్ ను నిద్రపోయే ముందు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. దీనివల్ల మీ గొంతు, అన్నవాహిక దెబ్బతింటుంది. రాత్రి డిన్నర్ చేసే ముందు తాగితే మంచిది. అయితే ఇది తాగిన తర్వాత 30 నిమిషాల గ్యాప్ ఇచ్చి తినడం మంచిది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Protein Dosa: నార్మల్ కాదు.. ఈ ప్రోటీన్ దోశ ట్రై చేయండి.. అదిరిపోయే టేస్ట్, హెల్దీ కూడా..!
Recommended image2
Parenting: కూతురు ప్రతి విషయం షేర్ చేసుకోవాలంటే పేరెంట్స్ చేయాల్సిన 5 పనులు ఇవే!
Recommended image3
బిర్యానీ, పులావ్‌లలో ఉప్పు తగ్గి చప్పగా ఉన్నాయా? నిమిషంలో ఉప్పును సరిచేసే సింపుల్ ట్రిక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved