MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • ఇండియాలో ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అదిరిపోతాయి

ఇండియాలో ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అదిరిపోతాయి

ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి క్రిస్మస్ పండుగ సోమవారం నాడు వచ్చింది. అంటే మీకు లాంగ్ వీకెండ్ లభిస్తుంది. అందుకే ఈ క్రిస్మస్ ను మీరు అందమైన ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీకు తెలుసా? మన ఇండియాలో కొన్ని ప్రదేశాల్లో క్రిస్మస్ వేడుకలు అదిరిపోతాయి. దీన్ని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు కూడా.  

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Dec 20 2023, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image: Getty Images

Image: Getty Images

క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు.. చాలా ఆఫీసులకు సెలవులు ఉన్న నెల ఒక్క డిసెంబరే. అయితే ఈ ప్రత్యేకమైన రోజే మీకు లీవ్ దొరకడమంటే కష్టమే. ఈ సారి క్రిస్మస్ పండుగ డిసెంబర్ 25 అంటే సోమవారం నాడు వస్తుంది. అది లాంగ్ వీకెండ్. అంటే తిరిగే వారికి ఇది మంచి సమయమన్న మాట. అంటే మీరు శుక్రవారం ఆఫీసు అయిపోయిన తర్వా త క్రిస్మస్ ట్రిప్ కు ఎంచక్కా వెళ్లొచ్చు. మీకు తెలుసా? ఇండియాలోని కొన్ని ప్రదేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను బాగా జరుకుంటారు. అవేంటో తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

గోవా

గోవాను  ఇష్టపడనివారు ఉండదు. నిజానికి గోవా సీజన్లతో సంబంధం లేకుండా ఎప్పుడూ సందడిగా ఉంటుంది. కానీ డిసెంబర్ లో యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఈ నెల స్టార్టింగ్ లోనే ఇక్కడికొచ్చి న్యూ ఇయర్ తర్వాత వెళ్తుంటారు. గోవా మధ్యలో.. అందమైన రాత్రి మీకు ఎంతో మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి ఫీలింగ్ ను మీరు ఎప్పుడూ చూడరు. కానీ క్రిస్మస్ పండుగను కూడా ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడి చర్చిలే కాదు.. వీధులు, భవనాలను కూడా రంగురంగుల లైట్లతో అలంకరిస్తారు. ఇది గోవా అందాన్ని మరింత పెంచుతుంది. 
 

35
Image: Getty Images

Image: Getty Images

పాండిచ్చేరి

పాండిచ్చేరిని భారతదేశం "లిటిల్ ఫ్రాన్స్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఫ్రెంచ్ వారు ఇక్కడ చాలా కాలం పాలించారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో క్రైస్తవులు నివసిస్తున్నారు. అందుకే క్రిస్మస్ వేడుకలు ఇక్కడ కూడా ఘనంగా జరుగుతాయి. మీరు క్రిస్మస్ లాంగ్ వీకెండ్ లో ఇక్కడకు రావడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవలసిన మరెన్నొ గొప్ప ప్రదేశాలు ఉన్నాయి. 
 

45
kerala

kerala

కేరళ

చాలా మంది ఇండియన్స్ కు కేరళ అంటే చాలా చాలా ఇష్టం. జీవితంలో ఒక్క సారైనా కేరళకు వెళ్లిరావాలనుకుంటారు. అందుకే మీరు కూడా చాలా కాలంగా ఇక్కడికి వెళ్లాలని ఆలోచిస్తుంటే.. ఈ క్రిస్మస్ కు కేరళకు వెళ్లిరండి. ఇక్కడ క్రైస్తవులు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. అందుకే మీరు ఇక్కడ ఉన్న ప్రతి చర్చిలో ఈ పండుగ ప్రకాశాన్ని చూడొచ్చు.
 

55

సిక్కిం

ఈశాన్యంలో ఉన్న సిక్కిం లో కూడా మీరు క్రిస్మస్ వేడుకలను చూడొచ్చు. సిక్కింలో డిసెంబర్ నెలలో చలి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సీజన్ లో ఇక్కడ ఎన్నో అందమైన ప్రదేశాలను చూడొచ్చు. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
క్రిస్మస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Recommended image2
Coconut Water: కొబ్బరి నీళ్లు రోజూ తాగితే ఏమవుతుందో తెలుసా?
Recommended image3
Watch: అంబానీ కోడలు రాధిక మర్చంట్ వాచ్ ఖరీదు ఎంతో తెలుసా? ఒక్క వాచ్ ఖరీదుతో లైఫ్ సెటిల్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved