Cholesterol: ఇవి చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతయ్ జాగ్రత్త..
Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే.. గుండెపోటు, స్ట్రోక్, డయాబెటీస్ వంటి ఎన్నో ప్రమాదకరమైన రోగాలొచ్చే అవకాశం ఉంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.

చెడు కొలెస్ట్రాల్ ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం, స్ట్రోక్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను ఎల్లప్పుడూ నియంత్రణలోనే ఉంచుకోవాలి.
cholesterol
అయితే కొన్ని రకాల ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ ను దారుణంగా పెంచుతాయి. వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొవ్వు మాంసాలను నివారించండి
మాంసాహారంలో ఖనిజాలు, ప్రోటీన్లు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు వీటిలో సంతృప్త కొవ్వులు కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటాయి. ఇవన్నీ చెడు కొలెస్ట్రాల్ ను విపరీతంగా పెంచుతాయి.
స్వీట్ ఐటమ్స్
పంచదారతో చేసిన స్వీట్ ఐటమ్స్ కూడా కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణమవుతాయి. అందుకే వీటిని వీలైనంత వరకు తగ్గించాలి. షుగర్ తో చేసిన ఆహారాలకు బదులుగా పండ్లను ఎక్కువగా తినండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి కూడా.
ఫైబర్ ఎక్కువగా ఆహారాలను తినండి
సంతృప్త కొవ్వుల ఆహారాలను పూర్తిగా తగ్గించి.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. ఇవి శరీరం పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో ఎంతో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే మాత్రం గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.
రోజువారి ఆహారంలో వీటిని చేర్చండి
ఆపిల్స్, అవిసె గింజలు, ఓట్స్, చియా విత్తనాలు, బీన్స్, బార్లీ వంటి ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ ను తొందరగా తగ్గిస్తాయి. అలాగే కరిగే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోండి
మీ రోజు వారి ఆహారంలో సంతృప్త కొవ్వు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ ను పెంచుతాయి. వీటికి బదులుగా ఇతర ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోండి. ఇందుకోసం అవొకాడో, గింజలు, విత్తనాలను తీసుకోండి.
ఈ కూరగాయలను తినండి
కూరగాయలు కూడా చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి. ఇందుకోసం కాలీఫ్లవర్, బ్రోకలి వంటి ఆహారాలను చేర్చండి. ఈ కూరగాయలను చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా అడ్డుపడతాయి.