MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Chicken: చికెన్ కూర వండేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. కూర రుచి పాడౌతుంది..!

Chicken: చికెన్ కూర వండేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. కూర రుచి పాడౌతుంది..!

Chicken: చికెన్ కూర ఎప్పుడు వండినా ఒకే రుచి రావడం లేదా? ఒక్కో సారి అసలు కూర ఎంత బాగా చేయాలని చూసినా, ఎన్ని మసాలాలు వేసినా కూడా రుచి రావడం లేదా? అయితే, మీరు చేసే కొన్ని తప్పులే కారణం.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 17 2026, 10:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
చికెన్ కూర రుచి పెంచాలంటే ఏం చేయాలి?
Image Credit : Getty

చికెన్ కూర రుచి పెంచాలంటే ఏం చేయాలి?

సండే వస్తే చాలు కమ్మగా చికెన్ తినడానికే అందరూ ఇష్టపడతారు. కానీ, చికెన్ రుచిగా వండటం అందరికీ రాదు. కాస్త తేడా వచ్చినా చికెన్ గట్టిగా, డ్రైగా మారిపోతుంది. లేదా.. పైన ఉడికినట్లు అనిపించినా.. లోపల సరిగా ఉడకదు. అయితే, తెలిసీ తెలియకుండా చేసే కొన్ని తప్పుల కారణంగానే చికెన్ కూర రుచి పాడైపోతుంది. మరి, ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1. ఫ్రోజెన్ చికెన్ వాడటం
Image Credit : Getty

1. ఫ్రోజెన్ చికెన్ వాడటం

తాజా చికెన్‌లో తేమ ఎక్కువగా ఉండి వండినప్పుడు జ్యూసీగా వస్తుంది. ఫ్రోజెన్ చేసిన చికెన్ అంటే.. ప్యాక్ చేసిన చికెన్ తన సహజ తేమను కోల్పోయి డ్రైగా మారుతుంది. వీలైనంత వరకు ఫ్రెష్ చికెన్ మాత్రమే వాడటానికి ప్రయత్నించండి.

2.బోన్ లెస్ చికెన్.. 

కేవలం బోన్‌లెస్ ముక్కల కంటే ఎముకలతో ఉన్న థైస్ వంటి భాగాల్లో కొవ్వు శాతం సరిపడా ఉంటుంది. ఇది వండేటప్పుడు కరిగి ముక్కకి మంచి ఫ్లేవర్‌ను, తేమను ఇస్తుంది. కేవలం బోన్ లెస్ కూర వండితే పెద్దగా రుచిగా ఉండకపోవచ్చు.

3. చికెన్‌ను నీళ్లతో కడగడం 

చికెన్‌ను నీళ్లతో కడిగితే పరిశుభ్రం అవుతుందని చాలామంది అనుకుంటారు. కానీ అలా చేయడం వల్ల చికెన్‌పై ఉండే హానికర బ్యాక్టీరియా వంటగదిలోని పాత్రలు, సింక్, ఉపరితలాలకు వ్యాపించి కలుషితం అవుతుంది. సరిగ్గా ఉడికించడం వల్ల మాత్రమే చికెన్‌లోని బ్యాక్టీరియా నశిస్తుంది.

33
4. మ్యారినేషన్ చేయకపోవడం..
Image Credit : Getty

4. మ్యారినేషన్ చేయకపోవడం..

తొందరలో చికెన్‌ను నానబెట్టకుండా నేరుగా వండేస్తుంటారు. చికెన్‌ను ఉప్పు, పెరుగు, నిమ్మరసం, మసాలాలతో మ్యారినేట్ చేయడం వల్ల ముక్కలకు మసాలా బాగా పట్టి, వండినప్పుడు పొడిగా మారకుండా జ్యూసీగా ఉంటుంది.

5. చికెన్ ముక్కలు కట్ చేయడం..

చికెన్ బ్రెస్ట్ ముక్కలు చాలా మందంగా ఉంటాయి. వాటిని అలాగే వండితే పైన ఉడికి, లోపల పచ్చిగా ఉండే అవకాశం ఉంది. అందుకే మీట్ హ్యామర్‌తో ముక్కను సమాన మందంలో ఉండేలా కట్ చేసుకోవాలి. ముుక్క సమానంగా ఉంటే.. మంచిగా ఉడుకుతుంది.

6. స్కిన్ లెస్ చికెన్..

చికెన్ పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా రావాలంటే స్కిన్ ఉంచడం మంచిది. స్కిన్ లోపలి తేమ బయటకు పోకుండా కాపాడి, చికెన్ కారమెలైజ్ అవ్వడానికి సహాయపడుతుంది.

ఫ్రోజెన్ చికెన్..

ఫ్రోజెన్ చికెన్‌ను గది ఉష్ణోగ్రత వద్ద బయట పెట్టకూడదు. దానివల్ల బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. చికెన్ ఐస్ కరగడానికి చల్లని నీళ్లలో ఉంచడం, మైక్రోవేవ్ చేయడం లేదా వండటానికి ఒక రోజు ముందే ఫ్రిజ్‌లోని కింది అరలో ఉంచడం సరైన పద్ధతి.

సమాన పరిమాణంలో ముక్కలు కోయకపోవడం

చికెన్ వండేటప్పుడు అన్ని ముక్కలు ఒకే పరిమాణంలో (Size) ఉండేలా చూసుకోవాలి. పెద్దవి, చిన్నవి కలిపి వండితే కొన్ని ముక్కలు ఎక్కువ ఉడికిపోయి, మరికొన్ని పచ్చిగా ఉండిపోతాయి.

బాణలిపై మూత పెట్టకపోవడం

చికెన్ ఉడుకుతున్నప్పుడు పాత్రపై తప్పనిసరిగా మూత పెట్టాలి. ఆవిరి బయటకు పోకుండా లోపలే బంధించబడటం వల్ల ఆ తేమతో చికెన్ ఎండిపోకుండా, చాలా సాఫ్ట్‌గా ఉడుకుతుంది.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ ఇంట్లో వండే చికెన్ ప్రతిసారీ రెస్టారెంట్ స్టైల్‌లో పర్ఫెక్ట్‌గా, టేస్టీగా కుదురుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Coin Necklace:పట్టుచీరల మీదకు మీ అందాన్ని పెంచే కాసుల నక్లెస్ డిజైన్లు
Recommended image2
Banana: రాత్రిపూట అరటి పండు తింటే ఏమౌతుంది? నిజంగా బరువు పెరుగుతారా?
Recommended image3
Kitchen Hacks: ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కలిపి నిల్వ చేయకూడదా? చేస్తే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Mutton: మటన్ కొంటున్నారా? తాజా, లేతగా ఉన్న మటన్ ఎంచుకోవడానికి బెస్ట్ చిట్కాలు
Recommended image2
Jowar Roti: జొన్న రెట్టె, రాగి రొట్టే చేస్తుంటే విరిగిపోతున్నాయా? ఈ ఒక్క చిట్కాతో పర్ఫెక్ట్ గా, సాఫ్ట్ గా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved