MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Andhra Pradesh
  • Government Jobs : తెలుగు యువతకు ఇదే కరెక్ట్ టైమ్.. గట్టిగా ట్రై చేస్తే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పిలు అయిపోవచ్చు

Government Jobs : తెలుగు యువతకు ఇదే కరెక్ట్ టైమ్.. గట్టిగా ట్రై చేస్తే డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పిలు అయిపోవచ్చు

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు నిరుద్యోగులకు లక్కీ ఛాన్స్. ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది… ఇందులో గ్రూప్ 1 సర్వీసెస్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.

3 Min read
Author : Arun Kumar P
Published : Sep 15 2026, 01:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఏపీలో ఉద్యోగాల జాతర
Image Credit : AI-Generated (ChatGPT)

ఏపీలో ఉద్యోగాల జాతర

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు వరుస నోటిఫికేషన్లు విడుదలచేసింది. ఇందులో ప్రతిష్ఠాత్మకమైన గ్రూప్-1 సర్వీసెస్ పోస్టులు కూడా ఉన్నాయి… వీటితో పాటు కాలుష్య నియంత్రణ మండలి, ఉద్యానవన శాఖ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సోషల్ వెల్ఫేర్ శాఖల్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

ఒక్క గ్రూప్-1 సర్వీసెస్‌లోనే 163 పోస్టుల భర్తీకి సిద్దమయ్యింది APPSC (ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్). వీటితో పాటు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 40 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టులు, ఉద్యానవన శాఖలో 37 హార్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 8 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు, సోషల్ వెల్ఫేర్ శాఖలో 73 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
గ్రూప్-1 సర్వీసెస్ - 163 ఉద్యోగాలు
Image Credit : Gemini

గ్రూప్-1 సర్వీసెస్ - 163 ఉద్యోగాలు

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రభుత్వ ఉద్యోగాల్లో గ్రూప్-1 సర్వీసెస్ పోస్టులు ముందుంటాయి. తాజాగా మొత్తం 163 పోస్టుల భర్తీకి ఏపిపిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వంటి కీలకమైన పోస్టులు ఉన్నాయి.

పోస్టుల వారిగా వివరాలు 

డిప్యూటీ కలెక్టర్ - 11 పోస్టులు - రూ.61,960 నుండి రూ.1,51,370

అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ - 14 పోస్టులు - రూ.61,960 నుండి రూ.1,51,370

డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP, సివిల్) - 36 పోస్టులు - రూ.61,960 నుండి రూ.1.51,370

డిఎస్పి (కమ్యూనికేషన్) - 03 పోస్టులు - రూ.61,960 నుండి రూ.1,51,370

డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ - 14 పోస్టులు - రూ.61,960 నుండి రూ.1,51,370

రీజనల్ ట్రాన్స్ ఫోర్ట్ ఆఫీసర్ - 03 పోస్టులు - రూ. 57,100 నుండి రూ.1,47,760

డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 01 పోస్టు - రూ.57,100 నుండి రూ.1,47,760

డిప్యూటీ రిజిస్ట్రార్ - 15 పోస్టులు - రూ.57,100 నుండి రూ.1,47,760

మున్సిపల్ కమీషనర్ (గ్రేడ్-2) - 12 పోస్టులు - రూ.54,060 నుండి రూ.1,40,540

అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 02 పోస్టులు - రూ.54,060 నుండి రూ.1,40,540

డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ - 03 పోస్టులు - రూ.54,060 నుండి రూ.1,40,540

అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ - 14 పోస్టులు - రూ.54,060 నుండి రూ.1,40,540

డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ - - 35 పోస్టులు - రూ.65,360 నుండి రూ.1,54,980

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 06-10-2026

దరఖాస్తులకు చివరి తేదీ : 27-10-2025 (రాత్రి 11.59 వరకు అవకాశం)

36
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు - 40 పోస్టులు
Image Credit : Gemini AI

పొల్యూషన్ కంట్రోల్ బోర్డు - 40 పోస్టులు

ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 40 పోస్టులను ఈ నియామకం ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు పే స్కేల్ ఉంటుంది. పర్యావరణ రంగంలో కెరీర్‌ను కొనసాగించాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులకు ఈ ఉద్యోగాలు మంచి అవకాశంగా చెప్పవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 06-10-2026

దరఖాస్తులకు చివరి తేదీ : 27-10-2025 (రాత్రి 11.59 వరకు అవకాశం)

46
హార్టీకల్చర్ ఆఫీసర్ - 37 పోస్టులు
Image Credit : Getty

హార్టీకల్చర్ ఆఫీసర్ - 37 పోస్టులు

ఏపీ ఉద్యానవన శాఖలో కూడా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. హార్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 37 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు పే స్కేల్ లభిస్తుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు హార్టీకల్చర్‌లో నాలుగేళ్ల బీఎస్సీ డిగ్రీ లేదా బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేసి ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి సంబంధిత విద్యార్హతను పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 06-10-2026

దరఖాస్తులకు చివరి తేదీ : 27-10-2025 (రాత్రి 11.59 వరకు అవకాశం)

56
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు
Image Credit : Gemini AI

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉద్యోగాలు

ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో కూడా కీలకమైన పోస్టుల భర్తీకి అవకాశం వచ్చింది. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయిలో మొత్తం 8 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ - 01 పోస్ట్

అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ఫిజిక్స్ - 02 పోస్టులు

అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ కెమిస్ట్రీ - 02 పోస్టులు

అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ బాటనీ - 03 పోస్టులు

అన్ని పోస్టులకు శాలరీ రూ.57,100 నుండి రూ.1,47,760 వరకు ఉంటుంది

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 06-10-2026

దరఖాస్తులకు చివరి తేదీ : 27-10-2025 (రాత్రి 11.59 వరకు అవకాశం)

66
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 73 పోస్టులు
Image Credit : Getty

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ - 73 పోస్టులు

ఏపీ సోషల్ వెల్ఫేర్ శాఖలో కూడా ఉద్యోగాల భర్తీకి ఏపిపిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 73 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు శాలరీ ఉంటుంది. విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల నిర్వహణ వంటి బాధ్యతలకు సంబంధించిన ఈ పోస్టులు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ముఖ్యమైనవే.

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 09-10-2026

దరఖాస్తులకు చివరి తేదీ : 29-10-2025 (రాత్రి 11.59 వరకు అవకాశం)

ఒకేసారి భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు

ఏపీలో ఒకేసారి గ్రూప్-1 వంటి ఉన్నతస్థాయి పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్లు వచ్చాయి... కాబట్టి ఉద్యోగం సాధించేందుకు ఇదే మంచి సమయం. ప్రతి పోస్టుకు విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్షా విధానం వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి పూర్తి నోటిఫికేషన్ విడుదలయ్యాక మీరు ఏ ఉద్యోగాలకు అర్హులో చూసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు తమ విద్యార్హతలకు సరిపోయే పోస్టులను గుర్తించి, సంబంధిత అధికారిక నోటిఫికేషన్‌లో అర్హతలు, రిజర్వేషన్ నిబంధనలు, పరీక్షా విధానం, దరఖాస్తు ప్రక్రియ, చివరి తేదీ వంటి వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే అప్లై చేయడం మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert: ద్రోణి ప్రభావంతో పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షాలు.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ అలర్ట్
Recommended image2
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image3
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Related Stories
Recommended image1
Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు
Recommended image2
Jobs : తెలుగమ్మాయిలకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, సొంత గ్రామంలో గవర్నమెంట్ జాబ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved