- Home
- Jobs
- Govt Job : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, ఎగ్జామ్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
Govt Job : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, ఎగ్జామ్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
భారత తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉద్యోగాలకు కావాల్సిన విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, దరఖాస్తు ప్రక్రియ వంటి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగం?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు శుభవార్త. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. దీని ప్రకారం… దేశవ్యాప్తంగా 23,757 ఖాళీలను భర్తీ చేయనున్నారు… ఇందులో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1336 పోస్టులున్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఖాళీలను పరిశీలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధికంగా 917 పోస్టులు… తెలంగాణలో 419 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, అర్హతలు, జీతం, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
పోస్టులు
ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానంగా ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
1. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM)
2. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM)
3. గ్రామీణ డాక్ సేవక్ (GDS)
పోస్టల్ జాబ్స్ అర్హతలు..
విద్యార్హతలు : పోస్టల్ జాబ్స్ కు అప్లై చేసుకునే అభ్యర్థులు గుర్తింపుపొందిన బోర్డు నుంచి 10వ తరగతి పాసైతే చాలు.
వయోపరిమితి : 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు కనీసం 18 ఏళ్లు, గరిష్ఠంగా 40 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC, ST, OBC వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
షెడ్యూల్ క్యాస్ట్/షెడ్యూల్ ట్రైబ్ (SC/ST) - 5 ఏళ్ల సడలింపు
ఇతర బలహీన వర్గాలు (OBC) 3 ఏళ్ల సడలింపు
జనరల్ దివ్యాంగులకు - 10 ఏళ్లు సడలింపు
ఓబిసి దివ్యాంగులకు 13 ఏళ్లు... ఎస్సి, ఎస్టీ దివ్యాంగులకు 15 ఏళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు
1. OTR రిజిస్ట్రేషన్ : ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19, సాయంత్రం 5 గంటల వరకు.
2. ఆన్‌లైన్ దరఖాస్తు : సెప్టెంబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం… సెప్టెంబర్ 21, సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు సమయం ఉంది.
3. దరఖాస్తు సవరణ : సెప్టెంబర్ 23 నుంచి సెప్టెంబర్ 24న సాయంత్రం 5 గంటల వరకు అవకాశం.
గమనిక : పాత GDS రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ ఈసారి చెల్లదు. అందరూ కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలని తపాలా శాఖ స్పష్టం చేసింది.
ఎంపిక విధానం, శాలరీ
ఈ GDS ఉద్యోగాలకు రాత పరీక్ష గానీ, ఇంటర్వ్యూ గానీ ఉండదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను నేరుగా ఎంపిక చేస్తారు.
జీతం
బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM) పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు జీతం ఉంటుంది.
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM) పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు జీతం ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి?
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అన్ని డాక్యుమెంట్లతో https://indiapostgdsonline.gov.in/ అనే అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
SC/ST/PWD/మహిళా/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ఫీజు లేదు. మిగతా అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

