MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • ఎవరు ఎక్కువ ఫుడ్ తింటారు.. పొడవుగా ఉన్నోళ్లా లేక పొట్టోళ్ళా?

ఎవరు ఎక్కువ ఫుడ్ తింటారు.. పొడవుగా ఉన్నోళ్లా లేక పొట్టోళ్ళా?

యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనగానే చాలామందికి కష్టమైన జీకే, కరెంట్ అఫైర్స్ లేదంటే సబ్జెక్ట్ ప్రశ్నలే గుర్తొస్తాయి. కానీ అభ్యర్థి లాజికల్ థికింగ్‌ను పరీక్షించే ప్రశ్నలు కూడా చాలా ఉంటాయి. అలాంటి ఓ ప్రశ్నను ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P | ANI
Published : Aug 25 2026, 04:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పొడవుగా ఉన్నవాళ్లు ఎక్కువ తింటారా?
Image Credit : Chatgpt

పొడవుగా ఉన్నవాళ్లు ఎక్కువ తింటారా?

‘పొడవుగా ఉన్నవాళ్లు ఎక్కువ తింటారా?’ ఈ ప్రశ్న వినగానే చాలామంది వెంటనే ‘అవును’ లేదా ‘కాదు’ అని ఏదో జవాబు చెప్పేస్తారు. కానీ యూపిఎస్సి ఇంటర్వ్యూలో ఇలాంటి లాజికల్ ప్రశ్నకు పైపైన సమాధానం ఇచ్చేయకూడదు. దాని వెనకున్న కారణాలను విశ్లేషించాలి. ఒక వ్యక్తి ఆహార అవసరాలను కేవలం ఎత్తు మాత్రమే నిర్ణయించదు. శరీర పరిమాణం, బరువు, వయసు, లింగం, శారీరక శ్రమ, ఆరోగ్యం వంటి చాలా అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి... ఆలా వివరణతో కూడిన జవాబు చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇలా సమాదానం చెప్పండి
Image Credit : Gemini AI

ఇలా సమాదానం చెప్పండి

ఈ ప్రశ్నకు అభ్యర్థి ఇలా సమాధానం ఇవ్వొచ్చు.. ‘సార్/మేడమ్, పొడవుగా ఉన్నవాళ్లందరూ కచ్చితంగా ఎక్కువ తింటారని చెప్పలేం’. ఆ తర్వాత ఒక వ్యక్తి ఆహార అవసరాలను ప్రభావితం చేసే ఇతర అంశాల గురించి వివరించాలి. ఇలాంటి సమాధానం, మీరు ఒక సమస్యను ఒకే కోణంలో కాకుండా, అన్ని వైపుల నుంచి ఆలోచిస్తారని తెలియజేస్తుంది.

34
మరి ఎవరు ఎక్కువ తింటారు?
Image Credit : ANI

మరి ఎవరు ఎక్కువ తింటారు?

ఉదాహరణకు పొట్టిగా ఉన్నప్పటికీ రోజూ కష్టపడి పనిచేసే వ్యక్తికి ఎక్కువ శక్తి అవసరం. అదే సమయంలో పొడవుగా ఉండి, పెద్దగా శారీరక శ్రమ లేని వ్యక్తికి అంత శక్తి అవసరం ఉండకపోవచ్చు. జీవక్రియ (Metabolism), శరీర బరువు, వయసు, చేసే పని వంటివి కూడా రోజువారీ శక్తి అవసరాలను నిర్ణయిస్తాయి. కాబట్టి ఆహారం విషయంలో ఎత్తు మాత్రమే కొలమానం కాదు అంటూ చాలా డిప్లమాటిక్ గా సమాధానం చెప్పాలి.

44
ఇంటర్వ్యూ టిప్స్
Image Credit : Getty

ఇంటర్వ్యూ టిప్స్

ఇలాంటి ప్రశ్నల ద్వారా ఇంటర్వ్యూ బోర్డు అభ్యర్థి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. తెలిసిన సమాధానాన్ని వెంటనే చెప్పడం కంటే, ప్రశ్న పరిధిని అర్థం చేసుకుని, తార్కికంగా విశ్లేషించడం ముఖ్యం. ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగాల్లో ఒకే సమస్యను బహుళ కోణాల్లో చూసి, ఆధారాలతో నిర్ణయం తీసుకునే సామర్థ్యం చాలా అవసరం.

ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానమిచ్చేటప్పుడు సాధారణీకరించడం (generalize) మంచిది కాదు. ‘పొడవుగా ఉన్నవాళ్లంతా ఎక్కువ తింటారు’ లేదా ‘ఎత్తుకు, ఆహారానికి సంబంధమే లేదు’ అని రెండు తీవ్రమైన అభిప్రాయాలు చెప్పే బదులు, ‘ఎత్తు ఒక కారణం కావచ్చు, కానీ అదే నిర్ణయాత్మక అంశం కాదు’ అని సమతుల్యమైన సమాధానం ఇవ్వాలి.

మొత్తంగా యూపీఎస్సీ ఇంటర్వ్యూలో కొన్నిసార్లు సింపుల్‌గా కనిపించే ప్రశ్నలే మన ఆలోచనా విధానాన్ని పరీక్షిస్తాయి. కాబట్టి ప్రశ్న ఎంత సులభంగా ఉన్నా కంగారు పడకుండా, దాన్ని అర్థం చేసుకుని, తార్కికంగా సమాధానం ఇవ్వడం మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన హ్యుమ‌నాయిడ్ రోబోట్‌.. ఘ‌నంగా ఏఐ ఎడ్యుకేష‌న్ స‌మ్మిట్
Recommended image2
Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
Recommended image3
Government Jobs : నెలకు రూ.86,570 జీతం.. కేవలం పదో తరగతి, ఐటిఐ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు
Related Stories
Recommended image1
UPSC Interview Questions : మొబైల్, సెల్ ఫోన్ కి తేడా ఏమిటి..?
Recommended image2
నెయ్యి, పెరుగు కోసం ఏ గేదెపాలు బెస్ట్..? UPSC ఇంటర్వ్యూలో అడిగే ట్రిక్కీ ప్రశ్నలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved