MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Jobs
  • Bank Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ సాధించాలని కలగంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు

Bank Jobs : ప్రభుత్వ బ్యాంకులో జాబ్ సాధించాలని కలగంటున్నారా? అయితే ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు

నిరుద్యోగ యువతకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ఈ బ్యాంకుల్లో పనిచేసేందుకు 1538 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Aug 11 2026, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
స్టేట్ బ్యాంకులో ఉద్యోగాల జాతర
Image Credit : Asianet News

స్టేట్ బ్యాంకులో ఉద్యోగాల జాతర

Banking Jobs : బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు యువతకు లక్కీ ఛాన్స్. ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏకంగా 1538 జూనియర్ అసోసియేట్ ఖాళీలను భర్తీ చేయనుంది… ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేసింది. స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు… కాబట్టీ మీ బ్యాంక్ జాబ్ కలను నెరవేర్చుకునేందకు ఇదే మంచి సమయం.

బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్దమయ్యే యువతీయువకులు, అర్హత గల అభ్యర్థులు ఈనెల (ఆగస్టు) 27వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది… కాబట్టి చివరి నిమిషం వరకు ఆగకుండా అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అప్లై చేయడం మంచిది.

ఎస్బిఐ లో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కనీస వయస్సు 20 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 28 ఏళ్లు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని వర్గాలకు (ఎస్సి, ఎస్టి, దివ్యాంగులు, ఇతర రిజర్వేషన్ కలిగినవారికి) వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎస్బిఐ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ
Image Credit : Getty

ఎస్బిఐ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు పొందేందుకు కావాల్సిన విద్యార్హతలు, రిజర్వేషన్, ఇతర అర్హతల పూర్తి వివరాల కోసం దరఖాస్తు చేసే ముందు ఎస్బీఐ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ను తప్పకుండా చెక్ చేసుకోవాలి. అన్ని అర్హతలు ఉంటేనే దరఖాస్తు చేసుకొండి.

ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ఎంపిక ప్రక్రియ పలు దశల్లో జరుగుతుంది. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇది 100 మార్కులకు, గంట వ్యవధితో ఉండే ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష. తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.

ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారు మెయిన్స్ పరీక్షకు హాజరుకావొచ్చు. ఈ మెయిన్స్ పరీక్షను అక్టోబర్ లేదా నవంబర్ నెలలో నిర్వహించనున్నట్లు SBI నోటిఫికేషన్ లో తెలిపారు. పరీక్ష తేదీలపై తుది ప్రకటనను ఎస్బీఐ అధికారికంగా విడుదల చేస్తుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు సర్టిపికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ అనంతరం జాబ్ ఫైనల్ చేస్తారు.

33
ఎస్బిఐ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల దరఖాస్తు విధానం
Image Credit : ChatGPT

ఎస్బిఐ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల దరఖాస్తు విధానం

కొంతమంది అభ్యర్థులకు స్థానిక భాషా పరీక్ష ఉంటుంది. 10వ లేదా 12వ తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదవని వారు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో ఆ భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకునే నైపుణ్యాలను పరీక్షిస్తారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక కెరీర్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వ్యక్తిగత, విద్యా వివరాలను సరిగ్గా నమోదు చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. తర్వాత దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి, అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.

దరఖాస్తు చేశాక రిజిస్టర్డ్ ఈమెయిల్, మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. హాల్ టికెట్, ఇతర అప్‌డేట్స్ వాటికే వస్తాయి. ఆగస్టు 27లోపు దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి, త్వరపడటం మంచిది. బ్యాంకు ఉద్యోగాల కోసం కలగనే తెలుగు యువతకు ఇది మంచి అవకాశం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Railway Jobs : డిగ్రీ పాసయితే చాలు రైల్వేలో జాబ్... వెంటనే అప్లై చేసుకొండి
Recommended image2
హైద‌రాబాద్‌లో సంద‌డి చేసిన హ్యుమ‌నాయిడ్ రోబోట్‌.. ఘ‌నంగా ఏఐ ఎడ్యుకేష‌న్ స‌మ్మిట్
Recommended image3
Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది
Related Stories
Recommended image1
Telangana Jobs: తెలంగాణలో భారీగా ఉద్యోగాలు.. నాలుగు నోటిఫికేషన్లు విడుదల
Recommended image2
Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved