MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • చింతపండుతో ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే షాక్ అవుతారు..

చింతపండుతో ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే షాక్ అవుతారు..

ఎముకలు బలహీనంగా ఉన్నా.. కీళ్ల నొప్పులు బాధపెడుతున్నా చింతపండు గుజ్జును లేదా చింతగింజలను లేదా చింతాకు సారాన్ని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. ఎందుకంటే చింతపండు ఈ సమస్యలను తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 01 2023, 04:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
tamarind

tamarind

మన ఆహారపు అలవాట్ల వల్లే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ఎముకలు కూడా బలహీనపడతాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. వీటిలో చింతపండు ఒకటి. పోషకాలు అధికంగా ఉండే చింతపండు, గుజ్జు, విత్తనాలు, చింతాకు సారాలు జీవనశైలి రుగ్మతలను తగ్గిస్తాయి. చింతపండులోని పోషకాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన పరిశోధనా వ్యాసం ప్రకారం.. చింతపండు గుజ్జు, విత్తనాలు, ఆకులు న్యూట్రాస్యూటికల్ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. చింతపండు గుజ్జును ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో మూలికా ఔషధంగా ఉపయోగిస్తారు. ఇందులో నేచురల్ ఫైటోకెమికల్ కాంపోనెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చింతపండు గుజ్జులో ఉండే పాలిసాకరైడ్ల నుంచి ఒక ప్రత్యేక రసాన్ని జామ్, జెల్లీ, జున్ను తయారీలో ఉపయోగిస్తారు. చింత గింజల నుంచి పెక్టిన్ తయారవుతుంది. ఎన్నో దేశాల్లో చింతచెట్టు ఆకులను రోజువారీ ఆహారంలో భాగంగా కూడా ఉపయోగిస్తారు.

36

పోషక పదార్ధాలు

జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ప్రకారం.. చింత పండులో ఫినోలిక్, యురోనిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం, టార్టారిక్ ఆమ్లం, పెక్టిన్ లు ఉంటాయి. ఈ గుజ్జులో మ్యూసిలేజ్, గ్లైకోసైడ్లు, అరబినోజ్, జిలోజ్, గ్లూకోజ్, గెలాక్టోస్ సమ్మేళనాలు కూడా ఉంటాయి. వీటితో పాటు క్యాల్షియం, కాపర్, ఐరన్, కాడ్మియం, మాంగనీస్, ఆర్సెనిక్, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, జింక్ వంటి ముఖ్యమైన మూలకాలు కూడా ఉంటాయి.  చింతపండు గుజ్జులో టార్టారిక్ ఆమ్లం, సిట్రిక్ ఆమ్లం, ఎసిటిక్ ఆమ్లం, మాలిక్ ఆమ్లం, సుక్సినిక్ ఆమ్లం అలాగే ఫార్మిక్ ఆమ్లం, అమైనో ఆమ్లాలతో సహా కొన్ని ముఖ్యమైన సేంద్రీయ ఆమ్లాలు ఉంటాయి. 

46

ఎముకల ఆరోగ్యం బలపడుతుంది

సైన్స్ రిపోర్ట్ నేచర్ సెర్చ్ జర్నల్ లో ప్రచురితమైన ఒక పరిశోధన కథనం ప్రకారం.. చింతపండు మెగ్నీషియానికి గొప్ప మూలం. దీనిలో ఇతర మొక్కల ఆధారిత ఆహారాల కంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. 100 గ్రాముల చింతపండు సారంలో 35-170 మి.గ్రా కాల్షియం ఉంటుంది. ఈ రెండు ఖనిజాలు ఎముకల ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. బోలు ఎముకల వ్యాధి, ఎముక పగుళ్లను నివారించడానికి సహాయపడుతుంది. 

56

సైన్స్ రిపోర్ట్ నేచర్ సెర్చ్ జర్నల్ ప్రకారం.. ఎముకలపై చింతపండు గుజ్జు, విత్తనాల ప్రభావాన్ని మైసూర్ విశ్వవిద్యాలయంలో పరిశీలించారు. దీని ప్రకారం ఈ ఔషధ మొక్కను ఇప్పటికే ఆయుర్వేదంలో ఆర్థరైటిస్ చికిత్సలో ఉపయోగిస్తున్నారు. ఆర్థరైటిస్ ఎముక, మృదులాస్థిని ప్రభావితం చేస్తుంది. చింతగింజల సారాలు, చింత పండు గుజ్జు మృదులాస్థి, ఎముకలను రక్షించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. 

66

ఇది వాపును కూడా తగ్గిస్తుంది. చింతపండు హైడ్రోపెరాక్సైడ్ల పెరిగిన స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడింది. మొత్తం మీద చింతపండు మృదులాస్థి, ఎముకలలో మంట, బలహీనతను తగ్గించడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Recommended image2
Coriander Benefits: రోజులో ఒక్కసారి కొత్తిమీర వాటర్ తాగితే షుగర్ కంట్రోల్ అవ్వడం పక్కా
Recommended image3
Tea: టీ చేయడానికి ఏ గిన్నె బెటర్?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved