MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • కిడ్నీ క్యాన్సర్ గురించి ఈ విషయాలను అస్సలు నమ్మకండి..

కిడ్నీ క్యాన్సర్ గురించి ఈ విషయాలను అస్సలు నమ్మకండి..

కిడ్నీ క్యాన్సర్ ను అంత తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. ఎందుకంటే ఏటా లక్ష్క్షల మంది ఈ వ్యాధి బారిన పడి చనిపోతున్నారు. కానీ ఈ వ్యాధి గురించి చాలా మంది నమ్మకూడదని విషయాలను నమ్ముతున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 21 2023, 09:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సాధారణంగా వచ్చే టాప్ 5 క్యాన్సర్లలో కిడ్నీ క్యాన్సర్ ఒకటి. ఏటా ఈ కిడ్నీ క్యాన్సర్ 20.1 లక్షల మంది ప్రాణాలను బలిగొంటోంది. అందులోనూ ఈ వ్యాధి పురుషుల కంటే మహిళలకే ఎక్కువగా వస్తుంది. కానీ ఈ వ్యాధి మగ, ఆడ ఇద్దరికీ వచ్చే రిస్క్ ఉంది. నివేదికల ప్రకారం.. ప్రతి ఏడాది 3,30,000 కంటే ఎక్కువ కొత్త మూత్రపిండాల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. దీన్ని సకాలంలో గుర్తించకపోవడం వల్ల చికిత్స తీసుకుంటూ చాలా మంది చనిపోతున్నారు. దీనిపై జనాలకు అవగాహన లేకపోవడం, అపోహలను నమ్మడం వంటివే ప్రాణాల మీదికి తెస్తున్నాయి. అసలు మూత్రపిండాల క్యాన్సర్ గురించి ఎలాంటి విషయాలను నమ్మకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అపోహ1: మూత్రపిండాల క్యాన్సర్ చాలా అరుదు

దీన్ని అస్సలు నమ్మకూడదు. చాలా మంది మూత్రపిండాల వ్యాధి ఎక్కువగా రాదని నమ్ముతుంటారు. నిజమేంటంటే..మూత్రపిండాల క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.5 లక్షల మందిని చంపుతోంది. ఈ వ్యాధి పురుషులకు, స్త్రీలకు ఇద్దరికీ వస్తుంది. కానీ మహిళలకే ఇది ఎక్కువగా వస్తోంది. 

36

అపోహ 2: స్మోకింగ్ వల్ల మూత్రపిండాల క్యాన్సర్ రాదు 

స్మోకింగ్ మూత్రపిండాలకు సంబంధించినది కాదని చాలా మంది నమ్ముతుంటారు. వాస్తవంగా చెప్పాలంటే ధూమపానం మూత్రపిండాల క్యాన్సర్ కు అతిపెద్ద ప్రమాద కారకాలలో ఒకటి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం.. స్మోకింగ్ మూత్రపిండ కణ క్యాన్సర్ ప్రమాదాన్నిచాలా  పెంచుతుంది. ఇది క్యాన్సర్ అత్యంత సాధారణ రూపాలలో ఒకటి.
 

46

అపోహ3 : మూత్రపిండాల క్యాన్సర్ శస్త్రచికిత్స మూత్రపిండాలను తొలగిస్తుంది

మూత్రపిండాల్లోనైనా, ఊపిరితిత్తుల్లోనైనా, మరెక్కడైనా ఏ రకమైన క్యాన్సర్ వచ్చినా ముందుగానే గుర్తిస్తే చికిత్స చేయొచ్చు. క్యాన్సర్ పెరుగుదల స్వభావాన్ని బట్టి శస్త్రచికిత్స అవసరం అవుతుంది. ఈ శస్త్రచికిత్స క్యాన్సర్ కణితిని మాత్రమే తొలగిస్తుంది. అంతేకానీ మూత్రపిండాలను తొలగించదు. 
 

56

అపోహ4 : కిడ్నీ క్యాన్సర్ వంశపారంపర్యం కాదు

చాలా మంది తమ కుటుంబంలో ఇది ఎవరికీ లేకపోతే మాకు కూడా మూత్రపిండాల క్యాన్సర్ రాదని భావిస్తుంటారు. కానీ మూత్రపిండాల క్యాన్సర్ కేసులలో 2-3% వంశపారంపర్యంగా ఉన్నాయని వైద్య డేటా చెబుతోంది. ఈ సంఖ్య తక్కువగా కనిపించినప్పటికీ.. మీకు ఈ రకమైన క్యాన్సర్ కుటుంబ చరిత్ర ఉంటే ప్రమాద కారకాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి.
 

66

మూత్రపిండాల క్యాన్సర్ లక్షణాలు?

ప్రారంభ దశలో మూత్రపిండాల క్యాన్సర్ ఎలాంటి లక్షణాలను చూపించదు. కానీ కొన్ని సంకేతాలు వస్తాయని నిపుణులు అంటున్నారు. పార్శ్వంలో నొప్పి ముఖ్యంగా ఒక వైపు మూత్రమే. మూత్రం రంగులో మార్పు. కొన్నిసార్లు మూత్రంలో రక్తం కనిపించడం. తీవ్రమైన జ్వరం, చాలా బరువు తగ్గడం, చెమట, అలసట వంటి లక్షణాలు కొంతమంది కిడ్నీ క్యాన్సర్ పేషెంట్లలో కనిపిస్తాయి. ఇది ఇతర అవయవాలకు వ్యాపించినప్పుడు అంటే రెండో దశలో స్పష్టమైన లక్షణాలను చూడొచ్చు. దీనిలో ఎముక నొప్పులు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. మీకు మీరు ఇది మూత్రపిండాల క్యాన్సర్ అని నిర్ధారించుకోవడానికి లేదు. ఎందుకంటే ఇవి ఇతర సమస్యల వల్ల కూడా వస్తాయి. ఏదేమైనా హాస్పటల్ లో చెక్ చేయించుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Constipation: మలబద్ధకం బాగా వేధిస్తోందా? రోజూ ఈ 3 అలవాట్లు పాటిస్తే మాయం
Recommended image2
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Recommended image3
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved