MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఎండాకాలంలో ఈ పండును తింటే ఎంత ఫాస్ట్ గా బరువు తగ్గుతారో..!

ఎండాకాలంలో ఈ పండును తింటే ఎంత ఫాస్ట్ గా బరువు తగ్గుతారో..!

పుచ్చకాయ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. ఈ పండును ఈ సీజన్ లో తింటే శరీరం హైడ్రేట్ గా ఉండటంతో పాటుగా  సులువుగా బరువు కూడా తగ్గుతారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 21 2023, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పుచ్చకాయ అద్భుతమైన సమ్మర్ ఫ్రూట్. ఈ పండు టేస్టీగా ఉండటమే కాదు.. మండే ఎండల్లో మన శరీరాల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి.  అంతేకాదు ఈ పండును తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. దీనిలో ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో ఇందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచి గుండె జబ్బులను నివారిస్తాయి. పుచ్చకాయలో బోలెడు లాభాలున్నా.. వీటిని తింటే కూడా ఆరోగ్యంగా బరువు తగ్గుతారు తెలుసా? ఈ పండు బరువు తగ్గడానికి ఎలా సహాయపడుతుందంటే..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అధిక ఫైబర్ కంటెంట్ 

పుచ్చకాయలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండు మన జీర్ణవ్యవస్థ పనితీరును వేగవంతం చేస్తుంది. ఇది శరీరం నుంచి నీటిని గ్రహిస్తుంది. అలాగే జీవక్రియ రేటును పెంచుతుంది. మీ జీవక్రియ రేటు ఎక్కువగా ఉంటే.. మీ శరీరం కొవ్వును అంత వేగంగా జీర్ణం చేస్తుంది. దీనిలో కేలరీలు అసలే ఉండవు. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 

35
muskmelon

muskmelon

కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది

పుచ్చకాయలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. నిజానికి ఈ వేసవి పండులో వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే దీన్ని తిన్నవెంటనే కడుపు నిండినట్టుగా అనిపిస్తుంది. ఆకలి కూడా ఎక్కువగా వేయదు. ఇది మీరు వేగంగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. 
 

45

కేలరీలు తక్కువగా ఉంటాయి

పుచ్చకాయ తీయగా ఉంటుంది. కాని దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ పండు చక్కెర కోరికలను తగ్గించడానికి సహాయపడుతుంది. అందుకే ఇది మీరు బరువు తగ్గడానికి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 
 

55

బరువు తగ్గడానికి పుచ్చకాయను ఎలా తినాలి?

బరువు తగ్గడానికి పుచ్చకాయను ఎన్నో విధాలుగా తినొచ్చు. ముఖ్యంగా అల్పాహారంలో, స్నాక్స్ తినే టైంలో తింటే మంచి ఫలితాలను పొందుతారు. అయితే  దీన్ని సలాడ్ లేదా స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది
Recommended image2
Chicken Biryani: 30 నిమిషాల్లో ఘుమఘుమలాడే పొట్లం బిర్యానీ.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..
Recommended image3
Jaggery: బెల్లం ఎలా తింటున్నారు..? ఇలా తింటేనే ప్రయోజనం ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved