MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Health
  • డయాబెటీస్ పేషెంట్లకు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బెటర్.. ఎందుకంటే?

డయాబెటీస్ పేషెంట్లకు వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బెటర్.. ఎందుకంటే?

మీకు అన్నం అంటే ఇష్టమైతే.. వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ నే తినండి. ఎందుకంటే వైట్ రైస్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అదే బ్రౌన్ రైస్ అయితే..   

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 29 2023, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image: Getty Images

Image: Getty Images

మన దేశంలో మధుమేహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అందుకే భారతదేశాన్ని మధుమేహానికి రాజధాని అని అంటుంటారు. పెరుగుతున్న డయాబెటిస్ కేసులు భారతీయ ఆహారంపై పెద్ద ప్రశ్నను లేవనెత్తాయి. ఈ డయాబెటీస్ కేసులను ఆపడానికి ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అయితే చాలా మంది డయాబెటీస్ ఉన్నా బియ్యాన్ని తింటుంటారు. కానీ బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అందుకే వీటిని పూర్తిగా తినకపోవడమే మంచిది. అయితే వైట్ రైస్ కు బదులుగా మధుమేహులు బ్రౌన్ రైస్ ను తినొచ్చు. ఎందుకంటే? 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Image: Getty Images

Image: Getty Images

పోషకాలు ఎక్కువగా ఉండే బ్రౌన్ రైస్ పాలిష్ చేయబడవు. అందుకే దీనిలో ఫైబర్ తో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అదే తెల్లబియ్యంలో అయితే పాలిషింగ్ ప్రక్రియ ఈ పోషకాలన్నింటినీ తొలగిస్తుంది. 

38
Image: Getty Images

Image: Getty Images

బ్రౌన్ రైస్ ఎందుకు ప్రత్యేకం

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. బ్రౌన్ రైస్ లో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం, భాస్వరం, విటమిన్ బి 1, విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటాయి.  ఈ పోషకాలన్నీ దీనికి ప్రత్యేకతలు.  బ్రౌన్ రైస్ సులభంగా జీర్ణం అవుతుంది. డయాబెటిస్  పేషెంట్లు బరువు తగ్గడం కూడా సులువు అవుతుంది. 
 

48
Image: Getty Images

Image: Getty Images

బ్రౌన్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ 

ఆహార పదార్ధాల గ్లైసెమిక్ ఇండెక్స్ ఈ ఆహార వనరు రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత పెంచుతుందో కొలుస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఏం తినాలి? ఏం తినకూడదో కూడా ఇది చెబుతుంది. అధిక జీఐ ఉన్న ఆహారాలు మీడియం లేదా తక్కువ జీఐ ఉన్న ఆహారాల కంటే రక్తంలో చక్కెర స్థాయిలను మరింత వేగంగా పెంచుతాయి. అలాగే  మితమైన, తక్కువ జీఐ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితం అవుతాయి. బ్రౌన్ రైస్ గ్లైసెమిక్ ఇండెక్స్ 55. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
 

58
Brown Rice White Rice

Brown Rice White Rice

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. డయాబెటిస్ పేషెంట్లు తెల్ల బియ్యం కంటే బ్రౌన్ రైస్ ను తీసుకోవడమే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే వైట్ రైస్ లో ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.  వైట్ రైస్ ను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. వైట్ రైస్ డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అదే బ్రౌన్ రైస్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలలో తక్కువ మార్పు మాత్రమే వస్తుంది. 

68
Image: Getty Images

Image: Getty Images

వైట్ రైస్, వైట్ బ్రెడ్ వంటి ఇతర కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వంటలను తయారుచేయడానికి  ఉపయోగిస్తున్నారు. చైనాలో బాగా పాలిష్ చేయబడిన తెల్ల బియ్యం సంపదకు చిహ్నంగా, బ్రౌన్ రైస్ ను పేదరికానికి చిహ్నంగా భావిస్తారు. 

78
Image: Getty Images

Image: Getty Images

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం..  ఫైబర్ అధికంగా ఉండే బ్రౌన్ రైస్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంటుంది. లేదా మార్పు చాలా నెమ్మదిగా ఉంటుంది. డయాబెటిస్ ను నియంత్రించడానికి బ్రౌన్ రైస్ బాగా ఉపయోగపడుతుంది. 
 

88

టైప్ 2 డయాబెటిస్ ఉన్న 16 మంది పెద్దలపై పబ్మెడ్ సెంట్రల్ ఈ అధ్యయనం నిర్వహించింది. తెల్ల బియ్యం తిన్న వారితో పోలిస్తే, 2 సేర్విన్గ్స్ బ్రౌన్ రైస్ ను తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని కనుగొన్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Recommended image2
ఆల్క‌హాల్ తాగిన తర్వాత ట్యాబ్లెట్స్‌ వేసుకోవచ్చా? వైద్యులు ఏమంటున్నారంటే..
Recommended image3
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved